ప్రధాన మంత్రి కార్యాలయం

ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు లోజరిగిన ఒక బస్సు దుర్ఘటన లో వ్యక్తులు మరణించడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి; బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం చెల్లింపునకు ప్రధానమంత్రి ఆమోదం తెలిపారు

Posted On: 27 MAR 2022 12:41PM by PIB Hyderabad

ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు లో జరిగిన ఒక బస్సు దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కు ఒక్కొక్కరి కి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని వారి దగ్గరి సంబంధికుల కు మరియు ప్రమాదం లో గాయపడ్డ వ్యక్తుల కు తలా 50,000 రూపాయల వంతు న పరిహారాన్ని ఇచ్చేందుకు కూడా ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో

ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు లో జరిగిన ఒక దు:ఖదాయకమైన బస్సు దుర్ఘటన లో వ్యక్తులు చనిపోయినందుకు దు:ఖిస్తున్నాను. ఆప్తుల ను కోల్పోయి శోకం లో మునిగిపోయిన కుటుంబాల కు ఇదే నా సంతాపం. ఈ ప్రమాదం లో గాయపడ్డ వ్యక్తులు త్వరలోనే కోలుకొంటారని నేను ఆశిస్తున్నాను.

మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతు న మరియు గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతు న పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది: PM@narendramodi ’’ అని తెలియజేసింది.

***

DS/ST

 



(Release ID: 1810352) Visitor Counter : 119