ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రపంచ జల దినం సందర్భం లో నీటి యొక్క ప్రతి చుక్క ను ఆదా చేయాలి అనేసంకల్పాన్ని స్వీకరించండి అంటూ ప్రజల కు విజ్ఞ‌ప్తి చేసిన ప్రధాన మంత్రి

Posted On: 22 MAR 2022 10:33AM by PIB Hyderabad

ప్రపంచ జల దినం సందర్భం లో ప్రతి ఒక్క నీటి చుక్క ను ఆదా చేయాలి అనే సంకల్పాన్ని స్వీకరించండి అంటూ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. నీటి ఆదా దిశ లో కృషి చేస్తున్న వ్యక్తులను మరియు సంస్థల ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో –

‘‘జల సంరక్షణ అనేది గత కొద్ది సంవత్సరాల లో ఒక ప్రజా ఉద్యమం గా మారిపోయింది; అంతేకాకుండా, సరికొత్త ప్రయాసల ద్వారా దేశం లోని అన్ని ప్రాంతాల లోను ఇది ఆచరణరూపం దాల్చడం చూస్తే సంతోషం వేస్తోంది. నీటి ని ఆదా చేసే దిశ లో శ్రమిస్తున్నటువంటి వ్యక్తుల ను మరియు సంస్థల ను నేను ప్రశంసిస్తున్నాను.’’

‘‘అద్భిః సర్వాణి భూతాని జీవన్తి ప్రభవంతి చ ’’

ప్రపంచ జల దినం సందర్భం లో, రండి, మనం ప్రతి ఒక్క నీటి చుక్క ను ఆదా చేయడం కోసం మన సంకల్పాన్ని పునరుద్ఘాటిద్దాం. మన దేశం జల సంరక్షణ మరియు స్వచ్ఛ మైన తాగు నీటి ని మన పౌరుల కు అందేటట్టు పూచీపడటం కోసం జల్ జీవన్ మిశన్ వంటి అనేక చర్యల ను చేపడుతున్నది.’’

మాతృమూర్తుల మరియు సోదరీమణుల జీవనాన్ని సులభతరం చేయడం లో జల్ జీవన్ మిశన్ అత్యంత ప్రభావవంతం అయినటువంటిది గా నిరూపితమవుతోంది. ప్రజలందరి భాగస్వామ్యం తో ప్రతి ఇంటికీ నల్లా నీటి ని అందించాలి అనేటటువంటి సంకల్పం నెరవేరగలదు.’’

‘‘రండి. మనం అందరం కలసి జల సంరక్షణ ను ముందుకు తీసుకుపోవాలి, అలాగే ఈ భూమి ని చిరకాలం మనుగడ సాగించేందుకు వీలు గా తీర్చిదిద్దడం లో మన వంతు తోడ్పాటు ను అందిద్దాం. నీటి తాలూకు ప్రతి బిందువు ను ఆదా చేయడం వల్ల మన ప్రజల కు సాయపడినట్లు అవుతుంది మరి మన ప్రగతి జోరు అందుకొంటుంది.’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST

 



(Release ID: 1808169) Visitor Counter : 173