ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా , ఆస్ట్రేలియా రెండవ శిఖరాగ్ర సమ్మేళనాన్ని నిర్వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి శ్రీ స్కాట్ మారిసన్.
Posted On:
21 MAR 2022 6:19PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ ఇండియా - ఆస్ట్రేలియా వర్చువల్ శిఖరాగ్ర సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇరుదేశాల మధ్య బహుముఖ సంబంధాలను సమీక్షించడంతో పాటు ప్రాంతీయ , అంతర్జాతీయ పరిణామాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇటీవల న్యూ సౌత్ వేల్స్, క్వీన్ లాండ్‌లో తీవ్ర వరదలు వాటి కారణంగా జరిగిన విధ్వంసం , ఫలితంగా కొందరు ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ సంతాపం వ్యక్తం చేశారు.
2020 జూన్ లో జరిగిన తొలి శిఖరాగ్ర సమ్మేళనంలో ఏర్పడిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిపై ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశౄరు. ఉభయ దేశాల మధ్య సంబంధాల పరిధిని విస్తృత పరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరుదేశాలమధ్య సంబంధాలలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సెక్యూరిటీ, విద్య ఆవిష్కరణలు, సైన్స్ టెక్నాలజీ, కీలక ఖనిజాలు, నీటి నిర్వహణ, నూతన పునరుత్పాదక ఇంధన సాంకేతిక పరిజ్ఞానం, కోవిడ్ -19 సంబంధిత పరిశోధనలు వంటి వి ఉన్నాయి.
ఇండియాకు 29 పురాతన కళాఖండాలను తిరిగి అప్పగించినందుకు ఆస్ట్రేలియా ప్రధామంత్రి శ్రీ స్కాట్ మారిసన్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురాతన కళా ఖండాలలో శిల్పాలు, పెయింటింగ్‌లు, ఫొటోగ్రాఫ్‌లు, శతాబ్దాల నాటివి ఉన్నాయి . ఇందులో కొన్ని 9వ , 10 వ శతాబ్దాల నాటివి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వి ఉన్నాయి. వీటిలో 12 వ శతాబ్దానికి చెందిన చోళ ఇత్తడి కళాఖండం, 11-12 శతాబ్దాల నాటి రాజస్థాన్ కు చెందిన జైన్ కళాఖండం, గుజరాత్ కు చెందిన 12-13 శతాబ్దాల నాటి శాండ్ స్టోన్ మహిషాసుర మర్ధిని విగ్రహం, 18-19 శతాబ్దాలకు చెందిన పెయింటింగ్ లు, గెలాటిన్ సిల్వర్ ఫొటోగ్రాఫ్‌లు ఉన్నాయి.
కొవిడ్ 19 మహమ్మారి సమయంలో ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులు, భారతీయ ప్రజల పట్ల శ్రద్ధ తీసుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి శ్రీ మారిసన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
సహ ప్రజాస్వామ్య దేశాలుగా , ఉమ్మడి విలువలు, ఉమ్మడి ప్రయోజనాల కలిగి ఉండడంతోపాటు, ఇరు దేశాల మద్య నానాటికి పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలను వారు పరస్పరం మెచ్చుకున్నారు. ఇందులో స్వేచ్ఛాయుత, బహిరంగ, సమగ్ర , సుసంపన్న ఇండొ పసిఫిక్ సంబంధాలు కూడా ఉన్నాయి.
ఇరుదేశాల మధ్య లోతైన సమగ్ర వ్యూహాత్మక సంబంధాలకు సంబంధించి ఇరు దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దీనికితోడు ఇరుదేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఇరు ప్రధానమంత్రులు వార్షిక శిఖరాగ్ర సమ్మేళనాలు నిర్వహించాలని ఉభయులూ నిర్ణయించారు. ఇది ఇరుదేశాలమధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన కొత్త కోణంగా చెప్పుకోవచ్చు.
***
(Release ID: 1807892)
Visitor Counter : 187
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam