యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ యువజన పార్లమెంటు ఉత్సవం- 2022 నేషనల్ రౌండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్


100 సంవత్సరాల స్వాతంత్ర్యం నాటికి భారతదేశాన్ని మార్చే పరిష్కారాలను ఊహించండి: శ్రీ అనురాగ్ ఠాకూర్

Posted On: 10 MAR 2022 2:49PM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు , క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ రోజు న్యూఢిల్లీ లోని పార్లమెంటు సెంట్రల్ హాల్ లో మూడవ జాతీయ యువజన పార్లమెంటు ఉత్సవం (ఎన్ వై పి ఎఫ్)-2022 నేషనల్ రౌండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు.

 

యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమానిక్ కూడా

కార్యక్రమానికి  హాజరయ్యారు.యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ కార్యదర్శి శ్రీమతి సుజాతా చతుర్వేది, రాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ పి. సి. మోదీ, మంత్రిత్వ శాఖకుపార్లమెంటు కు చెందిన  ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా 2022 రేపు (మార్చి 11) ఎన్ వై పి ఎఫ్ ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తారు. మొదటి ముగ్గురు జాతీయ విజేతలు ముగింపు కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ ముందు మాట్లాడే అవకాశాన్ని పొందుతారు.

 

శ్రీ అనురాగ్ ఠాకూర్ తన ప్రసంగంలో, " సంవత్సరం జాతీయ యువజన పార్లమెంటు ఉత్సవం ఇతివత్తం 'న్యూ ఇండియా స్వరం గా మారండి-పరిష్కారాలను కనుగొనండి- విధానానికి దోహదపడండి' అని అన్నారు.

అజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భం గా ఘన వ్యర్థాల నిర్వహణ, ఆకలి నిర్మూలన, , లింగ సమానత్వం, తక్కువ వ్యయం తో  పరిశుభ్రమైన ఇంధనం, స్వచ్ఛమైన నీరుపారిశుధ్యం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. ఇప్పటివరకు మనం సాధించిన పురోగతి గురించి చర్చించాలని,  100 సంవత్సరాల స్వాతంత్ర్యం నాటికి, భారతదేశాన్ని ఇంకా మార్చడానికి పరిష్కారాలను ఊహించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.కోట్లాది మంది ప్రజల ప్రజల జీవితాలను  మార్చగల ఆరోగ్యం, క్రీడలు, మీడియా, రవాణా, మౌలిక సదుపాయాలు, విదేశీ వ్యవహారాల రంగంలో యువత ఏమి చేయగలరు? మానవాళి భవిష్యత్తుకు, 'జీవన సౌలభ్యానికి' వంద కోట్ల మంది ప్రజలు ఎలా దోహదపడగలరు?" అని శ్రీ ఠాకూర్ అన్నారు.

 

స్వామి వివేకానంద భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తూ, యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం లో జాతీయ యువజన పార్లమెంటు ప్రధాన పాత్ర పోషించిందని శ్రీ ఠాకూర్ తెలిపారు.స్వామి వివేకానంద్ భావజాలం నుంచి స్ఫూర్తి పొందడానికి యువత అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.

 

ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడుతూ, మహమ్మారి సమయంలో ప్రపంచం మొత్తం కష్టపడుతున్నప్పటికీ, భారతదేశం

పరిస్థితికి తగ్గట్టు ఎదిగిందని, పరిస్థితిని అధిగమించడానికి మనమందరం చేతులు కలిపి పనిచేశామని శ్రీ ఠాకూర్ పేర్కొన్నారు. దీనితో, సరైన దార్శనికత , నాయకత్వంతో, మనం అన్ని ప్రతికూలతలను ఎదుర్కోగలమని ప్రపంచానికి నిదర్శనంగా నిలిచామని అన్నారు. యువత కూడా సుగుణాన్ని పెంపొందించుకోవాలని , 100 ఏళ్ల స్వతంత్రం నాటికి మన దేశానికి అద్భుతాలు సాధించడానికి ఐకమత్య స్ఫూర్తితో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపు ఇచ్చారు.

 

యువత స్ఫూర్తి, భాగస్వామ్యంతోనే దేశానికి పునాది పడుతుందని, దేశాన్ని, సమాజాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగలిగేది యువతేనని, యువత గతం- భవిష్యత్తు మధ్య వారధి గా దేశానికి వర్తమానం గా నిలుస్తారని మంత్రి పునరుద్ఘాటించారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్కిల్ ఇండియా, ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి పథకాలను ప్రోత్సహించారని, ఇవి కోట్లాది మంది యువతకు నైపుణ్యాలను అందించడమే కాకుండా బలమైన భారత దేశానికి పునాది వేస్తోందని శ్రీ ఠాకూర్ అన్నారు.యువజన పార్లమెంటు లోని వివిధ రౌండ్ల లో పాల్గొన్న యువత ను కేంద్ర మంత్రి ప్రశంసించారు. జాతీయ యువజన

పార్లమెంటు ఫెస్టివల్ 2022 3 ఎడిషన్

ఫైనలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

 

 

దేశం కోసం తమ ఆలోచనలు కలలను వినిపించడానికి యువతకు ఒక వేదికను అందించడం , వివిధ  ప్రభుత్వ పథకాలు, కార్యకలాపాలను ఆకర్షణీయమైన ఇంటరాక్టివ్ ప్లాట్ ఫామ్ లో యువతకు ప్రచారం చేయడం పౌర భాగస్వామ్యం, చర్చల ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడం జాతీయ యువజన పార్లమెంటు లక్ష్యమని

శ్రీమతి సుజాత చతుర్వేది అన్నారు.

 

నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ (ఎన్ వైపిఎఫ్) రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ సేవలతో సహా వివిధ కెరీర్ లలో చేరే యువత గొంతు ను వినేందుకు నిర్వహిస్తున్నారు. 2017 డిసెంబర్ 31 ప్రధాన మంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో వ్యక్తం చేసిన ఆలోచనకు ఆచరణ రూపమే ఎన్ వై పి ఎఫ్. ప్రధాన మంత్రి ఆలోచన నుండి ప్రేరణ తీసుకొని, ఎన్ వైపిఎఫ్ మొదటి ఎడిషన్ ను  జనవరి 12 నుండి ఫిబ్రవరి 27, 2019 వరకు "కొత్త భారతదేశం స్వరం గా ఉండండి -పరిష్కారాలను కనుగొనండి -విధానానికి దోహదపడండి" అనే ఇతివత్తంతో నిర్వహించారు. ఇందులో మొత్తం 88,000 మంది యువత పాల్గొన్నారు.

 

ఎన్ వై పి ఎఫ్ రెండవ ఎడిషన్ ను 23 డిసెంబర్, 2020 నుంచి 12 జనవరి, 2022 వరకు వర్చువల్ మోడ్ ద్వారా "యువాహ్- ఉత్సా నయే భారత్ కా" అనే థీమ్ తో నిర్వహించారు. దీనిని దేశవ్యాప్తంగా 23 లక్షల మందికి పైగా యువత ,భాగస్వాములు జిల్లా, రాష్ట్ర ,జాతీయ స్థాయిలో వీక్షించారు.

 

వర్చువల్ మోడ్ ద్వారా జిల్లా స్థాయిలో 14 ఫిబ్రవరి 2022 ఎన్ వై పి ఎఫ్ మూడవ ఎడిషన్ ప్రారంభమయింది. ప్దేశవ్యాప్తంగా 2.44 లక్షల మందికి పైగా యువత జిల్లా యువజన పార్లమెంటుల్లో పాల్గొన్నారు. తరువాత రాష్ట్ర యువజన పార్లమెంటులు 23 నుంచి ఫిబ్రవరి 27, 2022 వరకు వర్చువల్ పద్ధతి లో జరిగాయి.

 

రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు  చెందిన ఎనభై ఏడు మంది (87) విజేతలు  (62 మంది మహిళలు ,25 మంది పురుషులు) లకు గౌరవ యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి , సహాయ మంత్రి , ఇతర ప్రముఖుల ముందు పార్లమెంటు సెంట్రల్ హాల్ లో హాజరు కావడానికి అవకాశం లభించింది. రాష్ట్ర యువజన పార్లమెంటు (ఎస్ వై పి) విజేతలు ఇరవై తొమ్మిది మంది లోక్ సభ సభ్యులు  శ్రీ భర్తృహరి మహతాబ్, డాక్టర్ సత్య పాల్ సింగ్, శ్రీమతి అనూ జే. సింగ్, ఐఆర్ ఎస్ (రిటైర్డ్), సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు శ్రీ కంచన్ గుప్తా లతో కూడిన నేషనల్ జ్యూరీ ముందు మాట్లాడే అవకాశం లభించింది. మొదటి ముగ్గురు జాతీయ విజేతలకు కూడా 2022 మార్చి 11 ముగింపు కార్యక్రమంలో స్పీకర్, లోక్ సభ ముందు మాట్లాడే అవకాశం లభించింది. జాతీయ స్థాయిలో ముగ్గురు తుది విజేతలకు సర్టిఫికేట్ , అవార్డులు (రూ. 2,00,000, రూ. 150,000, రూ. 100,000)  మరో రెండు కన్సోలేషన్ బహుమతుల కింద రూ. 50,000 లు ప్రదానం చేస్తారు.

 

***



(Release ID: 1804891) Visitor Counter : 225