ప్రధాన మంత్రి కార్యాలయం
బడ్జెటు ప్రకటనల ను కార్యరూపం లో పెట్టేందుకు 11 వెబినార్ ల ద్వారా జరిగిన సంప్రదింపులకు, మేధోమథనాని కి నాయకత్వం వహించిన ప్రధాన మంత్రి
బడ్జెటు కు సంబంధించిన 11 వెబినార్ లలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
ఈ వెబినార్ లలో 40 వేల మంది స్టేక్ హోల్డర్స్ పాల్గొన్నారు
కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల తో పాటు నవపారిశ్రామికవేత్తలు, ఎమ్ఎస్ఎమ్ఇ లు, ఎగుమతిదారులు, గ్లోబల్ ఇన్వెస్టర్స్, స్టార్ట్-అప్ లు తదితర వర్గాలు ఈవెబినార్ లలో పాలుపంచుకోవడం జరిగింది
బడ్జెటు లోని అంశాల ను ప్రభావవంతమైన విధం గా అమలు లోకి తీసుకు రావడం కోసం ప్రభుత్వానికిచాలా ప్రయోజనకరమైన సూచన లు, సలహా లు అందాయి
ఈ వెబినార్ లతో స్టేక్ హోల్డర్స్ మధ్య యాజమాన్య భావన ను జనింపచేసే మరియు కాలబద్ధఅమలు కు వీలు కల్పించడం లో తోడ్పాటు లభించింది
Posted On:
09 MAR 2022 6:57PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీపమ్ (డిఐపిఎఎమ్) యొక్కబడ్జెటు సంబంధి ప్రకటనల పై చర్చించడాని కి ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ఈ రోజు న ప్రసంగించారు. ఇది ప్రధాన మంత్రి ప్రసంగించిన బడ్జెటు సంబంధి 11 వెబినార్ లలో చివరి వెబినార్. ప్రధాన మంత్రి ఉన్నత విద్య, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, రక్షణ, ఆరోగ్యం, డిపిఐఐటి, పిఎస్ఎ, ఎమ్ఎన్ఆర్ఇ, డిఇఎ, ఇంకా దీపమ్ ల మంత్రిత్వ శాఖ లు /విభాగాల కు సంబంధించిన బడ్జెటు వెబినార్ లలో పాలుపంచుకొన్నారు. కేంద్ర బడ్జెటు-2022 లో దేశ ఆర్థిక వృద్ధి కోసం, మన ప్రజల అభ్యున్నతి ని పెంపొందింపచేయడం కోసం అనేక ప్రకటనల ను పొందు పరచడం జరిగింది. ఈ వెబినార్ లను బడ్జెటు యొక్క వేగాన్ని ఎంత మాత్రం తగ్గించకుండా ఉండడం కోసం, మరి ఆ బడ్జెటు ను అమలు చేయడం కోసం స్టేక్ హోల్డర్స్ అన్నిటి లో యాజమాన్య భావన ను జనింపచేయాలనే ఉద్దేశ్యం తో నిర్వహించడమైంది. ఈ వెబినార్ లలో స్మార్ట్ (ఎస్ఎమ్ఎఆర్ టి) ఎగ్రికల్చర్, పిఎమ్ గతిశక్తి, రక్షణ, డిజిటల్ ఎడ్యుకేశన్ మరియు గతిశీల నైపుణ్యాల సాధన లో ఆత్మనిర్భరత, ఆరోగ్య సంరక్షణ సేవల ను అన్ని వర్గాల వారికి సమానమైన రీతి లో అందజేయడం, మేక్ ఇన్ ఇండియా మరియు ఆకాంక్షభరిత ఆర్థిక వ్యవస్థ ను ఆవిష్కరించడం కోసం ఆర్థిక సహాయాన్ని అందించడం మొదలైన వివిధ అంశాల పై చర్చించడం జరిగింది.
బడ్జెటు కోసం ప్రముఖ స్టేక్ హోల్డర్స్ మధ్య యాజమాన్య భావన ను ఏర్పరచడం అనేది ఈ వెబినార్ ను నిర్వహించడం లోని ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది. ఈ అభ్యాసం మంత్రిత్వ శాఖల ను మరియు విభాగాల ను నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభం కావడం తోనే బడ్జుటు ను క్షేత్ర స్థాయి లో కార్యరూపం లోకి తీసుకువచ్చేందుకు పూచీపడుతుంది. విభిన్న స్టేక్ హోల్డర్స్ తో సంప్రదింపుల ను జరపడం ద్వారా ఆయా వర్గాల ఆచరణాత్మకమైనటువంటి /ప్రపంచ నైపుణ్యాల ను మరియు అనుభవాన్ని వినియోగించుకోవడాని కి, లోటుపాటుల ను గుర్తించడాని కి సహాయం లభించగలదు. కేంద్ర బడ్జెటు ను ఫిబ్రవరి 1వ తేదీ కల్లా సమర్పించడం తో పాటు వెబినార్ ల మాధ్యమం ద్వారా జరిపిన ఈ తరహా సంప్రదింపుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాల కు వాటి ప్రాథమ్యాల పట్ల మెరుగైన అవగాహన ఏర్పడి, మరి ఈ విధంగా వాటి బడ్జెటుల ను మెరుగైన రీతి లో రూపొందించుకోవడానికి వీలు కలుగుతుంది.
ఈ వెబినార్ లలో దాదాపు గా 40 వేల వరకు స్టేక్ హోల్డర్స్ పాలుపంచుకొన్నట్టు ఒక అంచనా ఉంది. వారిలో నవ పారిశ్రామికవేత్తలు, ఎమ్ఎస్ఎమ్ఇ లు, ఎగుమతిదారులు, గ్లోబల్ ఇన్వెస్టర్స్, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, స్టార్ట్-అప్స్ జగతి కి చెందిన యువతీయువకులు భాగమయ్యారు. ప్రతి ఒక్క వెబినార్ జరిగిన క్రమం లో విస్తృతమైన ప్యానల్ చర్చ మరియు విషయాధారిత బ్రేక్-అవుట్ సమావేశాలను నిర్వహించడం జరిగింది. ఈ వెబినార్ లలో ప్రభుత్వానికి ఒకదానిని మించి మరొకటి బహు విలువైన సలహా లు అందాయి. ఈ సలహాల తో బడ్జెటు లో చేసిన ప్రకటనల ను ప్రభావవంతమైన రీతి లో అమలు పరచడం లో తోడ్పాటు లభించనుంది.
***
(Release ID: 1804791)
Visitor Counter : 167
Read this release in:
Urdu
,
Tamil
,
Odia
,
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam