ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 సమాచారం


కొవిడ్-19పై పోరాటంలో ముఖ్య మైలురాయిని దాటిన భారతదేశం

662 రోజుల తర్వాత 4000 కంటే తగ్గిన రోజువారీ కొత్త కేసులు

664 రోజుల తర్వాత 50,000 కంటే తక్కువకు చేరిన క్రియాశీల కేసులు

Posted On: 08 MAR 2022 1:27PM by PIB Hyderabad

గత 24 గంటల్లో రోజువారీ కొత్త కొవిడ్‌-19 కేసులు 3,993కి తగ్గడంతో, భారతదేశం ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది. 2020 మే 16న 3,970 కేసులు నమోదైనప్పటి నుంచి, 662 రోజుల తర్వాత, దేశంలో నమోదైన అత్యల్ప కొత్త కేసుల సంఖ్య ఇదే.

 

అంతేకాదు, దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య కూడా 664 రోజుల తర్వాత 50,000 కంటే దిగువకు పడిపోయింది. దేశంలో ప్రస్తుత క్రియాశీల కేసులు 49,948. గతేడాది మే 14న 49,219 కేసులు నమోదైన తర్వాత ఇదే అత్యల్ప సంఖ్య. 

 

దేశంలో కొవిడ్‌ నిర్ధరణ పరీక్షల సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంచుతూనే ఉంది. గత వారంలో, దేశవ్యాప్తంగా సగటున 8.5 లక్షల పరీక్షలు నిర్వహించారు. వారపు పాజిటివిటీ రేటు 0.68%గా ఉంది.

రాష్ట్రాలు & యూటీల సహకారంతో, "హోల్ ఆఫ్ గవర్నమెంట్" విధానం ద్వారా మహమ్మారిపై పోరాటానికి భారత ప్రభుత్వం నాయకత్వం వహిస్తోంది. మహమ్మారి (పరీక్ష, పరిశీలన, చికిత్స, కొవిడ్‌ సంబంధిత జాగ్రత్తలు సహా) నియంత్రణ, నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఐదంచెల వ్యూహంలో టీకా కార్యక్రమం ఒక అంతర్భాగం. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహకారంతో కొవిడ్‌-19 నియంత్రణ, నిర్వహణ కోసం ప్రభుత్వం తన ప్రయత్నాలను నిరంతరం పెంచుతూనే ఉంది.

 

****



(Release ID: 1804311) Visitor Counter : 125