ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో ఫోన్‌లో సంభాషించిన బంగ్లాదేశ్ ప్రధాని భద్రత సలహాదారు మేజర్ జనరల్ (రిటైర్డ్) తారిఖ్ అహ్మద్ సిద్ధిఖీ
Posted On:
07 MAR 2022 9:31PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాని భద్రత సలహాదారు మేజర్ జనరల్ (రిటైర్డ్) తారిఖ్ అహ్మద్ సిద్ధిఖీ ఫోన్‌ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా 2021 మార్చిలో తన బంగ్లాదేశ్ పర్యటను ప్రధానమంత్రి సాభిమానంతో గుర్తుచేసుకుంటూ ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు శుభాకాంక్షలు తెలిపారు.
భారత-బంగ్లాదేశ్ స్నేహ సంబంధాలను పటిష్ఠం చేయడంతోపాటు కోవిడ్-19 మహమ్మారి విజృంభణసహా సంక్లిష్ట సమయాల్లో తమకు అండగా నిలిచినందుకు ప్రధానికి సిద్ధిఖీ ధన్యవాదాలు తెలియజేశారు. బంగ్లాదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని షేక్ హసీనా నాయకత్వాన సాగుతున్న కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు. భారత-బంగ్లాదేశ్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తమ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
(Release ID: 1803984)
Visitor Counter : 185
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam