మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున, 2020 మరియు 2021 సంవత్సరాల్లో 29 మంది అత్యుత్తమ వ్యక్తులకు ప్రతిష్టాత్మక నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేయనున్న గౌరవనీయులు రాష్ట్రపతి
Posted On:
07 MAR 2022 11:01AM by PIB Hyderabad
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క వారం రోజుల వేడుకలు 1 మార్చి, 2022న న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. 8 మార్చి, 2022న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2020 మరియు 2021 సంవత్సరాలకుగానూ నారీ శక్తి పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. COVID-19 మహమ్మారి సృష్టించిన ప్రబలమైన పరిస్థితుల కారణంగా 2020 సంవత్సరానికి అవార్డు వేడుకను 2021లో నిర్వహించడం సాధ్యం కాలేదు.
గౌరవనీయులైన ప్రధాన మంత్రి కూడా ఈ అవార్డు గ్రహీతలతో ఇంటారాక్టివ్ సెషన్ లో పాల్గొంటారు. ఇందులో భాగంగా వారి కృషి, ప్రయత్నాలను కొనియాడుతూనే ఇతరులకు ప్రేరణ కలిగించే విధంగా మహిళా సాధికారతకు సంబంధించిన వివిధ రంగాలలో రాణించేందుకు వీలుగా వారిని ప్రోత్సహించే విధంగా మాట్లాడతారు.
మొత్తంగా 28 అవార్డులు (2020, 2021 సంవత్సరాలకు.. అంటే ఏడాదికి 14 చొప్పున) 29 మందికి ప్రధానం చేయబడతాయి. ముఖ్యంగా మహిళా సాధికారత, బలహీన- అట్టడుగున ఉన్న మహిళల సాధికారత కోసం విశిష్ట సేవలను అందించడంలో వారి అసాధారణమైన కృషికి గుర్తింపుగా 29 మందికి ఈ అవార్డులు అందజేస్తారు.
‘నారీ శక్తి పురస్కారం’ అనేది స్త్రీ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. వ్యక్తులు లేదా సంస్థలు ద్వారా సమాజానికి చేసిన అసాధారణ సహకారాన్ని గుర్తించడంతో పాటూ, మహిళలను గేమ్ ఛేంజర్లుగా; సమాజంలో సానుకూల మార్పుకు అవసరమయ్యే ఉత్ప్రేరకంగా వారిని భావిస్తారు.
ఈ సాధకులు తమ కలలను నెరవేర్చుకోవడానికి వయస్సు, భౌగోళిక అడ్డంకులు లేదా వనరులను అడ్డంకులుగా అసలు భావించలేదు. వారి అచంచలమైన స్ఫూర్తి లింగపరంగా మూస పద్ధతులను విచ్ఛిన్నం చేయడానికి, లింగ అసమానత మరియు వివక్షకు వ్యతిరేకంగా నిలబడటానికి సమాజాన్ని మరియు ముఖ్యంగా యువ భారతీయ మనస్సులను ప్రేరేపిస్తుంది. ఈ అవార్డులు సమాజ పురోగతిలో మహిళలను సమాన భాగస్వాములుగా గుర్తించే ప్రయత్నం చేస్తుంది.
2020 సంవత్సరానికి నారీ శక్తి పురస్కారం విజేతలు వ్యవస్థాపకత, వ్యవసాయం, ఆవిష్కరణలు, సామాజిక పని, కళలు మరియు హస్తకళలు, STEMM మరియు వన్యప్రాణుల సంరక్షణ మొదలైన విభిన్న రంగాలకు చెందినవారు. 2021 సంవత్సరానికి నారీ శక్తి పురస్కారం విజేతలు భాషాశాస్త్రం, వ్యవస్థాపకత, వ్యవసాయం, సామాజిక పని, కళలు మరియు చేతిపనుల, మర్చంట్ నేవీ, STEMM, విద్య మరియు సాహిత్యం, వైకల్య హక్కులు మొదలైన రంగాల నుండి విజేతలను తీసుకున్నారు.
అవార్డు గ్రహీతల జాబితా ఈ కింది విధంగా ఉంది;
నారీ శక్తి పురస్కారం – 2020
క్రమ సంఖ్య
|
పేరు
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
విభాగం
|
-
|
అనితా గుప్తా
|
బీహార్
|
సామాజిక వ్యాపారవేత్త
|
-
|
ఉషాబెన్ దినేష్‌బాయ్ వసవ
|
గుజరాత్
|
ఆర్గానిక్ రైతు మరియు గిరిజన కార్యకర్త
|
-
|
నసీరా అక్తర్
|
జమ్మూ& కశ్మీర్
|
పరిశోధకురాలు – పర్యావరణ పరిరక్షణ
|
-
|
సంధ్యా ధార్
|
జమ్మూ& కశ్మీర్
|
సామాజిక కార్యకర్త
|
-
|
నివృతి రాయ్
|
కర్ణాటక
|
కంట్రీ హెడ్, ఇంటెల్ ఇండియా
|
-
|
టిఫానీ బ్రార్
|
కేరళ
|
సామాజిక కార్యకర్త – అంధుల కోసం పని చేస్తున్నారు.
|
-
|
పద్మ యాంగ్‌చాన్
|
లడఖ్
|
లెహ్ పరిసర ప్రాంతాల్లో కనుమరుగైపోయిన వంటకాలు మరియు వస్త్రధారణను రివైవ్ చేయడం.
|
-
|
జోధయా బాయ్ బైగా
|
మధ్యప్రదేశ్
|
బైకా తెగకు చెందిన ఆర్ట్ పెయింటర్
|
-
|
శైలీ పందిరి నాకు ఇ
య
|
మహారాష్ట్ర
|
డౌన్ సిండ్రోమ్ ఉన్న కథక్ నృత్యకారిణి
|
-
|
వనితా జాగ్డియో బోరదే
|
మహారాష్ట్ర
|
మొట్టమొదటి మహిళా స్నేక్ రెస్క్యూవర్
|
-
|
మీరా థాకూర్
|
పంజాబ్
|
సిక్కి గ్రాస్ ఆర్టిస్ట్
|
-
|
జయ ముత్తు, తేజమ్మ (సంయుక్తంగా)
|
తమిళనాడు
|
కళాకారిణి - టోడా ఎంబ్రాయిడరీ
|
-
|
ఎలా లోథ్ (మరణానంతరం)
|
త్రిపుర
|
అబ్ట్రెసియన్ & గైనకాలజిస్ట్
|
-
|
ఆర్తి రానా
|
ఉత్తర ప్రదేశ
|
చేనేత కార్మికురాలు & ఉపాధ్యాయురాలు
|
నారీ శక్తి పురస్కార్ 2021
|
-
|
సథుపతి ప్రసన్న శ్రీ
|
ఆంధ్రప్రదేశ్
|
లింగ్విస్ట్ – మైనారిటీ గిరిజన తెగలకు చెందిన భాషలను పరిరక్షిస్తున్నారు.
|
-
|
తాగే రీతా టాకే
|
అరుణాచల్ ప్రదేశ్
|
వ్యాపారవేత్త
|
-
|
మధులిక రాంటెకీ
|
ఛత్తీస్‌ఘఢ్
|
సామాజిక కార్యకర్త
|
-
|
నిరంజనా బెన్ ముఖుల్ బాయ్ కళారథి
|
గుజరాత్
|
రచయిత & విద్యావేత్త
|
-
|
పూజా శర్మ
|
హర్యానా
|
రైతు & వ్యాపారవేత్త
|
-
|
అన్షుల్ మల్హోత్రా
|
హిమాచల్ ప్రదేశ్
|
నేత కార్మికురాలు
|
-
|
శోభా గస్తి
|
కర్ణాటక
|
సామాజిక కార్యకర్త – దేవదాసీ వ్యవస్థను నిర్మూలించడానికి పని చేస్తున్నారు
|
-
|
రాధికా మీనన్
|
కేరళ
|
కెప్టెన్ మర్చెంట్ నేవీ – సముద్రంలో ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలకుగానూ IMO నుంచి బ్రేవరీ అవార్డ్ పొందిన మొట్టమొదటి మహిళ.
|
-
|
కమల్ కుంభార్
|
మహారాష్ట్ర
|
సామాజిక వ్యాపారవేత్త
|
-
|
శృతి మహాపాత్ర
|
ఒడిశా
|
వికలాంగుల హక్కుల కార్యకర్త
|
-
|
బతూల్ బేగం
|
రాజస్థాన్
|
మాండ్ & భజన్ జానపద గాయని
|
-
|
తారా రంగస్వామి
|
తమిళనాడు
|
సైకియాట్రిస్ట్ & పరిశోధకురాలు
|
-
|
నీర్జా మాధవ్
|
ఉత్తరప్రదేశ్
|
హిందీ రచయిత – ట్రాన్స్‌జెండర్ల హక్కులు మరియు టిబెటన్ శరణార్థుల కోసం పని చేస్తున్నారు
|
-
|
నీనా గుప్తా
|
పశ్చిమ బెంగాల్
|
గణిత శాస్త్రవేత్త
|
****
(Release ID: 1803823)
Visitor Counter : 473
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam