ప్రధాన మంత్రి కార్యాలయం
అరుణాచల్ ప్రదేశ్ స్వర్ణోత్సవం,36 వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగానికి సంక్షిప్త తెలుగు అనువాదం
Posted On:
20 FEB 2022 12:12PM by PIB Hyderabad
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన సోదర సోదరీమణులారా,
జై హింద్ !
అరుణాచల్ ప్రదేశ్ 36వ రాష్ట్రఅవతరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. 50 సంవత్సరాల క్రితం నార్త్ ఈస్ట్ ఫ్రానిటర్ ఏజెన్సీ -NEFA అరుణాచల్ పేరుతో కొత్త గుర్తింపును తెచ్చుకుంది.సోదర సోదరీమణులారా, ఈ 50 సంవత్సరాలలో ఈ ఉదయించే సూర్యుని గుర్తింపు , ఈ నూతన తేజస్సును మీరందరూ శ్రద్ధ, దేశభక్తి తో నిర్విరామంగా బలపరిచారు.
ఈ అద్భుతమైన అరుణాచల్ ప్రదేశ్‌ను 5 దశాబ్దాల క్రింత చూసిన భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికాజీ అరుణాచల్ హమారా పేరుతో ఒక పాటను రాశారు. ఈ పాటను అరుణాచల్‌కు చెందిన ప్రతివారు ఎంతో ఇష్టపడతారరు. ఈ పాట లేకుండా ఏ కార్యక్రమమూ సంపూర్ణం కాదు.అందువల్ల మీతో మాట్లాడేటపుడు నేను కూడా ఈ పాటోని కొన్ని పంక్తులు మీతో ప్రస్తావిస్తాను.
అరుణ్ కిరణ్ శీష్ భూషణ్
అరుణ్ కిరణ్ శీష్ భూషణ్
కంఠ్ హిమ కీ ధారీ
ప్రభాత్ సూరజ్ చుంబిత్ దేశ్
అరుణాచల్ హమారా
అరుణాచల్ హమారా
భారత్ మా కా రాజ్‌దులారా
భారత్ మా కా రాజ్‌దులారా
అరుణాచల్ హమారా!
మిత్రులారా,
దేశభక్తి , సామాజిక సామరస్య స్ఫూర్తికి వినూత్న ఔన్నత్యాన్ని అరుణాచల్ ప్రదేశ్ అందించిన తీరు, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించి, అరుణాచల్ ప్రదేశ్ నిలబెట్టిన తీరు, అలాగే మీరు మీ సంప్రదాయాలను, అభివృద్ధిని చేయి చేయి కలిపి ముందుకు తీసుకువెళుతున్న తీరు యావత్ దేశానికే స్ఫూర్తిదాయకం.
మిత్రులారా,
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా , దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అమర వీరులందరినీ స్మరించుకుంటున్నాం.ఆంగ్లో -ఆదివాసీల యుద్ధం లేదా స్వాతంత్రానంతరం సరిహద్దు రక్షణలో అరుణాచల్ ప్రదేశ్ ప్రజల సాహసగాధలు, ప్రతి భారతీయుడికి అత్యంత విలువైన వారసత్వం. అరుణాచల్ ను సందర్శించి మిమ్మలను కలుసుకునే అవకాశం నాకు పలుమార్లు దక్కింది.
మన యువ, సమర్ధ ముఖ్యమంత్రి పెమా ఖండూజీ పై మీరు ఉంచిన విశ్వాసం, మీ ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తున్నదని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మీ విశ్వాసం,రెండు ఇంజిన్ల ప్రభుత్వం మరింత కష్టపడి పనిచేస్తూ , మరింత చేయడానికి ప్రోత్సాహాన్నిస్తోంది. సబ్ కా సాథ్ , సబ్ కా వికాస్, సబ్ కా విశ్వా3స్, సబ్ కా ప్రయాస్ అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు మంచి భవిష్యత్‌ను ఇవ్వనుంది.
మిత్రులారా,
21 వశతాబ్దంలో తూర్పు ఇండియా , ప్రత్యేకించి ఈశాన్య భారతావని దేశ అభివృద్ధికి ఇంజిన్‌గా మారనున్నదన్నది నా గట్టి విశ్వాసం. ఈ స్ఫూర్తితొ గత ఏడు సంవత్సరాలలో అరుణాచల్ ప్రదేశ్‌లో మున్నెన్నడూ లేనన్ని పనులు చేయడం జరిగింది. అనుసంధాన రంగం, విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు, ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ లో జీవితాన్ని , వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని సులభతరం చేస్తున్నాయి. ఇటానగర్ తో సహా ఈశాన్య ప్రాంతంలోని అన్ని రాజధానులను రైలు కనెక్టివిటితో అనుసంధానం చేయడం మా ప్రాధాన్యతగా ఉంది. అరుణాచల్‌ను తూర్పు ఆసియాకు ప్రధాన గేట్ వేగా మార్చేందుకు మేం మా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. జాతీయ భద్రత ను దృష్టిలో ఉంచుకుని అరుణాచల్‌ప్రదేశ్ పాత్రను పరిగణనలోకి తీసుకుని ఆధునిక మౌలికసదుపాయాలను అభివృద్ధి చేయడం జరుగుతోంది.
మిత్రులారా,
అరుణాచల్ ప్రదేశ్ లో అభివృద్ధి, ప్రకృతి, పర్యావరణం, సంస్కృతికి సంబంధించి సమగ్ర విధానం దిశగా మేం నిరంతరం ముందుకు వెళుతున్నాం. మీ కృషి కారణంగా ఇది అత్యంత ప్రధానమైన జీవ వైవిధ్య ప్రాంతంగా ఉంద. అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధికి పెమా ఖండూజీ నిరంతరం పాటుపడుతుండడం చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆరోగ్యం, విద్య , నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, స్వయం సహాయక బృందాలు ఇలా అన్ని రంగాలలో ఖండూజీ ఎంతో క్రియాశీలంగా ఉన్నారు. నేను ఎప్పుడు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజుజితో మాట్లాడినా, వారు ఎప్పుడూ అరుణాచల్ ప్రదేశ్‌ను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఒక కొత్త ఆలోచనతో ముందుకు వస్తారు. ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది ప్రయత్నించాలన్న తపనతో వస్తారు.
మిత్రులారా,
పకృతి అరుణాచల్ ప్రదేశ్ కు తన ప్రకృతినిధి నుంచి ఎంతో ఇచ్చింది. మీరు మీ జీవితాన్ని ప్రకృతిలో భాగం చేసుకున్నారు. మేం అరుణాచల్ ప్రదేశ్‌కు ఉన్న పర్యాటక సామర్ధ్యాన్ని మొత్తం ప్రపంచం ముందుకు తీసుకుపోదలచాం. ఇవాళ, ఈ సందర్బంగా, నేను మీకు ఒక హామీ ఇస్తున్నాను. ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ ప్రజల కలలను సాకారం చేయడానికి ఏ ఒక్క అవకాశాన్నీ వదలిపెట్టదని హామీ ఇస్తున్నాను. మరోసారి మీ అందరికీ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆలాగే, అరుణాచల్ ప్రదేశ్ పేరుకు 50 సంవత్సరాలు అయిన సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
ధన్యవాదాలు.
***
(Release ID: 1799917)
Visitor Counter : 151
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam