ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 19 FEB 2022 8:51AM by PIB Hyderabad

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు నమస్సులు అర్పించారు. ఆయన స‌ర్వోత్కృష్ట మైనటువంటి నాయకత్వం మరియు సామాజిక సంక్షేమానికి ఆయన కట్టబెట్టిన అగ్రతాంబూలం అనే అంశాలు ప్రజల కు తరాల తరబడి ప్రేరణ ను అందిస్తూ వస్తున్నాయి అని కూడా ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ కు ఆయన జయంతి సందర్భం లో నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను. స‌ర్వోత్కృష్ట మైన ఆయన నాయకత్వం మరియు సామాజిక సంక్షేమానికి ఆయన అగ్రతాంబూలాన్ని కట్టబెట్టడం అనేటటువంటి అంశాలు ప్రజల కు తరాల తరబడి ప్రేరణ ను అందిస్తూ వస్తున్నాయి. సత్యం మరియు న్యాయం అనే విలువల కోసం నిలబడడం లో రాజీ పడడం అనేది ఆయన ఎరుగనే ఎరుగరు. ఆయన కన్న కలల ను నెరవేర్చడానికి మేం కంకణం కట్టుకొన్నాం.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

 


(रिलीज़ आईडी: 1799592) आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam