ప్రధాన మంత్రి కార్యాలయం

మహిళ లజాతీయ సంఘం (నేశనల్ కమిశన్ ఫార్ విమెన్) 30వ స్థాపన దినం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించినప్రధాన మంత్రి


‘‘దేశం లో మహిళల సంఘాలు అన్నీ వాటి పరిధి ని పెంచుకోవాలి; అవి వాటి వాటిరాష్ట్రాల మహిళల కు ఒక కొత్త దిశ ను ఇవ్వాలి’’

‘‘ఆత్మనిర్భర్ భారత్ ప్రచార ఉద్యమం దేశం అభివృద్ధి తో మహిళల సామర్ధ్యాల ను ముడిపెడుతోంది’’

‘‘2016వ సంవత్సరం తరువాత ఉనికి లోకి వచ్చిన 60 వేల కు పైగా స్టార్ట్-అప్స్ లో, 45 శాతం స్టార్ట్-అప్స్ లో కనీసం ఒకమహిళా డైరెక్టర్ పనిచేస్తున్నారు’’

‘‘2015వ సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు 185 మంది మహిళల ను ‘పద్మ’ పురస్కారాల తో సమ్మానించడం జరిగింది.  ఈ ఏడాది లో వేరువేరు కేటగిరీల లో పురస్కారాల స్వీకర్తల లో 34 మంది మహిళ లు ఉన్నారు; ఇది ఒక రికార్డు’’

‘‘ప్రస్తుతం గరిష్ఠ స్థాయి లో ప్రసూతి సెలవుల నిబంధన ను కలిగివున్న దేశాల లో ఒకదేశం గా భారతదేశం ఉంది’’

‘‘ఏ ప్రభుత్వం అయినా మహిళ ల భద్రత కు ప్రాధాన్యం ఇవ్వనప్పుడల్లా, అటువంటి ప్రభుత్వాలు అధికారం లో నుంచివెళ్ళిపోయేటట్లు గా మహిళ లు చూశారు’’ 

Posted On: 31 JAN 2022 5:50PM by PIB Hyderabad

మహిళ ల జాతీయ సంఘం (నేశనల్ కమిశన్ ఫార్ విమెన్-ఎన్ సిడబ్ల్యు) 30వ స్థాపన దినం సందర్భం లో ఈ రోజు న ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమాని కి ఇతివృత్తం గా శి ద ఛేంజ్ మేకర్ను తీసుకోవడం జరిగింది. వేరు వేరు రంగాల లో మహిళ ల కార్యసాధనల ను ఒక వేడుక గా జరుపుకోవడాని కి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ సందర్భం లో మహిళ ల రాష్ట్ర సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాల లో మహిళ లు మరియు శిశు వికాసం విభాగాలు, విశ్వవిద్యాలయాల మరియు కళాశాల ల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా నవపారిశ్రామికులు, ఇంకా వ్యాపార సంఘాలు పాలుపంచుకొన్నాయి. అలాగే, ఈ సందర్భం లో మహిళ లు మరియు బాలల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, సహాయ మంత్రులు డాక్టర్ ముంజపరా మహేంద్రభాయ్ కాలుభాయ్ మరియు శ్రీమతి దర్శన జర్దోశ్, మహిళల జాతీయ సంఘం చైర్ పర్సన్ రేఖ శర్మ గారు లు కూడా పాల్గొన్నారు.

 

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మహిళ ల జాతీయ సంఘం 30వ స్థాపన దినం సందర్భం లో అభినందనల ను వ్యక్తం చేశారు. ‘‘30 ఏళ్ళ మైలురాయి అనేది ఏ వ్యక్తి జీవనం లో అయినా గాని, లేదా ఏ సంస్థ యాత్ర లో అయినా గాని చాలా ముఖ్యమైంది. ఇది కొత్త బాధ్యతల కాలం, మరి కొత్త శక్తి తో ముందుకు పోవలసిన సమయం’’ అని ఆయన అన్నారు.

 

 

భారతదేశం మార్పుల కు లోనవుతున్న ప్రస్తుత కాలం లో, మహిళ ల పాత్ర నిరంతరం గా విస్తరిస్దున్నది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కారణం గా మహిళ ల జాతీయ సంఘం యొక్క భూమిక విస్తరణ కూడా తక్షణ అవసరం అని ఆయన పేర్కొన్నారు. దేశం లో మహిళ ల సంఘాలు అన్నీ కూడాను వాటి పరిధి ని పెంచుకోవాలి, మరి అవి వాటి వాటి రాష్ట్రాల లో మహిళల కు ఒక కొత్త దిశ ను ఇవ్వాలి అని ఆయన అన్నారు.

 

శతాబ్దాల పాటు స్థానిక చిన్న పరిశ్రమలు (లేదా ఎమ్ఎస్ఎమ్ఇ లు) భారతదేశాని కి బలం గా ఉంటూ వస్తున్నాయి అని ప్రధాన మంత్రి తెలిపారు. ఈ పరిశ్రమల లో పురుషుల పాత్ర మాదిరి గానే మహిళల కు కూడా అదే పాత్ర ఉంది అని ఆయన అన్నారు. పాతదైన ఆలోచనల ధోరణి మహిళల ను ఇంటి పనుల లో వారి నైపుణ్యాల కు మాత్రమే పరిమితం చేసింది అని ప్రధాన మంత్రి చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ ను ముందుకు తీసుకు పోవడం కోసం ఈ పాత ఆలోచన విధానాన్ని మార్చవలసిన అవసరం ఉంది అని ఆయన అన్నారు. మేక్ ఇన్ ఇండియాప్రస్తుతం చేస్తున్నది ఇదే. ఆత్మనిర్భర్ భారత్ప్రచార ఉద్యమం మహిళల శక్తియుక్తుల కు దేశాభివృద్ధి తో ముడి పెడుతున్నది అని ఆయన అన్నారు. ముద్రయోజన లబ్ధిదారుల లో దాదాపు గా 70 శాతం మంది మహిళ లు ఉండటం ఈ పరివర్తన ను సూచిస్తోంది అని ఆయన అన్నారు. గడచిన ఆరేడు సంవత్సరాల లో మహిళ ల స్వయంసహాయ సమూహాల సంఖ్య లో మూడింతల పెరుగుదల ను దేశం గమనించింది. ఇదే విధం గా 2016వ సంవత్సరం తరువాత ఏర్పడిన 60 వేల కు పైగా స్టార్ట్-అప్స్ లో 45 శాతం స్టార్ట్-అప్స్ కనీసం ఒక మహిళా డైరెక్టర్ ను కలిగి ఉన్నాయి అని ఆయన వివరించారు.

 

న్యూ ఇండియాయొక్క వృద్ధి ప్రక్రియ లో మహిళ లు పాలుపంచుకోవడం అదే పని గా పెరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. సమాజం లో నవపారిశ్రామికత్వం పరం గా మహిళ ల తాలూకు ఈ పాత్ర కు గరిష్ఠ గుర్తింపు ను ఇవ్వడం కోసం మహిళ ల సంఘాలు కృషి చేయాలి అని ఆయన అన్నారు. 2015వ సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు గమనిస్తే 185 మంది మహిళల ను పద్మపురస్కారాల తో సన్మానించడమైంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సంవత్సరం లో కూడాను వేరు వేరు కేటగిరీల కు చెందిన పురస్కార విజేతల లో 34 మంది మహిళ లు ఉన్నారు. ఇన్ని అవార్డులు మహిళల కు దక్కడం ఇది వరకు ఎన్నడూ ఎరుగని ఒక రికార్డు అని ప్రధాన మంత్రి అన్నారు.

 

గడచిన ఏడేళ్ళ లో దేశ విధానాలు మహిళల కు సంబంధించి మరింత సూక్ష్మ బుద్ధి ని అలవరచుకొన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం భారతదేశం గరిష్ఠ స్థాయి లో ప్రసూతి సెలవు నిబంధన ను కలిగి ఉన్న దేశాల లో ఒక దేశం గా ఉంది. చిన్న వయస్సు లో వివాహం అనేది కుమార్తె ల చదువుల కు మరియు ఉద్యోగాల కు అడ్డు రాకుండా ఉండాలని, ఈ కారణం గా కుమార్తె ల పెళ్లీడు ను 21 సంవత్సరాల కు పెంచేందుకు ప్రయత్నం జరుగుతోంది అని ఆయన అన్నారు.

 

గ్రామీణ ప్రాంతాల మహిళ లు సశక్తీరణ కు చాలా దూరం లో ఉండిపోయిన సంగతి ని గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు. తొమ్మిది కోట్ల గ్యాస్ కనెక్శన్ లు, ఇంటింటా టాయిలెట్ ల వంటి చర్యల ను గురించి ఆయన ప్రస్తావించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో పక్కా ఇళ్ళ ను ఇంటి లోని మహిళ ల పేరిటే ఇవ్వడం, మాతృత్వం కాలం లో సమర్ధన, జన్ ధన్ ఖాతా లు వంటి చర్య లు మారుతున్న భారతదేశాని కి మరియు మహిళ ల సశక్తీకరణ కు నిదర్శనం గా మహిళల ను సూచిస్తున్నాయి అని ఆయన అన్నారు.

 

మహిళ లు సంకల్పించుకొన్నట్లయితే గనక వారు మాత్రమే అందుకు గాను దిశ ను నిర్దేశిస్తారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కారణం గానే మహిళల భద్రత ను ఒక ప్రాథమ్యం గా ఏ ప్రభుత్వం అయినా స్వీకరించనప్పుడల్లా, అటువంటి ప్రభుత్వాలు అధికారం నుంచి నిష్క్రమించేటట్లు గా మహిళలు చేశారు అని ఆయన అన్నారు. మహిళల పై జరిగే నేరాల ను ఎంత మాత్రం సహించనటువంటి విధానం తో ప్రభుత్వం పని చేస్తోంది అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అత్యాచారం వంటి కేసుల లో మరణ దండన సహా కఠిన చట్టాలు ఉన్నాయి అని ఆయన అన్నారు. పోలీసు ఠాణాల లో మరిన్ని మహిళా హెల్ప్ డెస్క్ లు, రోజు లో 24 గంటలూ పనిచేసేటటువంటి హెల్ప్ లైన్ లు, సైబర్ క్రైమ్స్ పరిష్కరించడం కోసం పోర్టల్ వంటి చర్యల ను తీసుకోవడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి వివరించారు.

 

 

 



(Release ID: 1796515) Visitor Counter : 197