ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై లోక్ సభలో ప్రధానమంత్రి సమాధానం
“నేను ప్రసంగం ప్రారంభించే ముందు లతాదీకి నివాళి అర్పించాలనుకుంటున్నాను. ఆమె పాటల ద్వారా మన జాతిని ఐక్యం చేశారు”.
“రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ నాయకత్వ పాత్ర ఎలా పోషించగలదనే అంశం ఆలోచించేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సరైన సమయం”.
“విమర్శ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం అని మేం కూడా నమ్ముతాం. కాని మూర్ఖంగా ప్రతీ ఒక్కదాన్ని వ్యతిరేకించడం ఎప్పటికీ మంచి మార్గం కాదు”.
“మేం స్థానికం కోసం నినాదం గురించి మాట్లాడుతున్నామంటే మహాత్మా గాంధీ కలలు సాకారం చేస్తున్నట్టు కాదా? మరి ప్రతిపక్షం దాన్ని ఎందుకు అడ్డుకుంటోంది?”
“భారతదేశం ఆర్థికంగా కొత్త శిఖరాలు అధిరోహించడాన్ని ప్రత్యేకించి ఎవరి జీవితకాలంలో అయినా ఒకే ఒక్కసారి సంభవించే మహమ్మారి విజృంభించిన కాలంలో ఈ విజయం సాధించడాన్ని ప్రపంచం యావత్తు గుర్తిస్తోంది”.
“మహమ్మారి కోరల్లో చిక్కుకుపోయిన 80 కోట్ల మందికి పైగా సోదర దేశవాసులందరికీ మేం ఉచిత ఆహార ధాన్యాలు అందుబాటులోకి తెచ్చాం. ఏ ఒక్క భారతీయుడు ఆకలితో అలమటించకూడదన్నది మా కట్టుబాటు”.
“చిన్న రైతుల సాధికారత భారతదేశ పురో
Posted On:
07 FEB 2022 7:17PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానం ఇచ్చారు. ప్రసంగం ప్రారంభించడానికి ముందు ఆయన దివంగత లతా మంగేష్కర్ కు నివాళి అర్పించారు. “నా ప్రసంగం ప్రారంభించే ముందు లతా దీకి నివాళి అర్పించాలనుకుంటున్నాను. ఆమె తన సంగీతం ద్వారా జాతిని ఐక్యం చేశారు” అని ప్రధానమంత్రి చెప్పారు.
ప్రస్తుతం అనుసరిస్తున్న కొత్త తీర్మానాలు చేసుకుంటూ జాతి నిర్మాణానికి పునరంకితం అయ్యే వైఖరి ప్రాధాన్యత గురించి ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ నాయకత్వం ఏ విధంగా పోషిస్తుందనే విషయం ఆలోచించాల్సిన చక్కని సమయం “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్”. గత కొద్ది సంవత్సరాల కాలంలో భారతదేశం అభివృద్ధిలో ఎన్నో శిఖరాలు అధిరోహించిందనడం కూడా అంతే వాస్తవం అని ఆయన అన్నారు. “కరోనా అనంతర శకంలో సరికొత్త ప్రపంచం వేగంగా రూపు దిద్దుకుంటోందంటూ భారతదేశం ఈ అవకాశాన్ని వదులుకోకూడని కీలక మలుపు ఇది” అని కూడా ప్రధానమంత్రి అన్నారు.
పేదలు, నిరాదరణకు గురవుతున్న వర్గాల వారి స్థితిలో మార్పు వస్తున్న తీర గురించి ప్రధానమంత్రి వివరిస్తూ కొత్త సదుపాయాల ద్వారా వారు కొత్త ఆత్మగౌరవం సాధిస్తున్నారన్నారు. “గతంలో గ్యాస్ కరెక్షన్ ఒక హోదాకు గుర్తు. నేడు నిరుపేదలు కూడా గ్యాస్ అందుకున్నారు. అందుకు వారు ఎంతో ఆనందిస్తున్నారు. పేదలకు కూడా బ్యాంకు ఖాతాలు అందుబాటులో ఉన్నాయి. డిబిటి సేవలు సమర్థవంతంగా అందించేందుకు దోహదపడింది. ఇవి పెద్ద మార్పులు” అన్నారు. తమ ఇంటికి విద్యుత్ అందుతున్నందుకు పేదవర్గాల వ్యక్తి ఆనందిస్తే ఆమె పొందిన ఆ ఆనందమే జాతికి ఆనందాన్ని ఇచ్చి శక్తివంతం చేస్తుంది. ఉచిత గ్యాస్ కనెక్షన్ల వల్ల పేదల ఇంటిలో పొగరహిత వంటగదుల ద్వారా వారు పొందుతున్న ఆనందం గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
ప్రజాస్వామ్యం చక్కగా పని చేయాల్సిన ప్రాధాన్యతను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ భారతదేశంలో శతాబ్దాల ప్రజాస్వామ్య సంప్రదాయం గురించి నొక్కి చెప్పారు. “మేం ప్రజాస్వామ్యాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తాం. అలాగే ప్రజాస్వామ్యంలో విమర్శ అత్యంత కీలకం అన్నది కూడా మేం నమ్ముతాం. కాని ప్రతీ ఒక్క దాన్ని వ్యతిరేకించడం సరైన వైఖరి కానేకాదు” అని ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుత మహమ్మారిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న ధోరణిని ఆయన దుయ్యబట్టారు. లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడి ప్రజలు ఎక్కడి వారక్కడే కదలకుండా ఉంటే వారిని భయపెట్టి స్వరాష్ర్టాలైన ఉత్తర ప్రదేశ్, బిహార్ లకు పోవాలని రెచ్చగొట్టే వైఖరిని ఆయన విమర్శించారు.
సార్వత్రికంగా ప్రతీ ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సిన చర్యలను కూడా గుడ్డిగా వ్యతిరేకించే వైఖరి పట్ల శ్రీ మోదీ తీవ్ర విచారం ప్రకటించారు. “స్థానికం కోసం నినదించడం గురించి మేం మాట్లాడుతున్నామంటే మహాత్మాగాంధీ కలలు సాకారం చేస్తున్నట్టు కాదా? మరి దాన్ని ఎందుకు ప్రతిపక్షం వెక్కిరించాలి? మేం యోగా, ఫిట్ ఇండియా గురించి మాట్లాడుతుంటే కూడా ప్రతిపక్షం అపహాస్యం చేస్తూ ఉంటుంది” అన్నారు. “భారతదేశం ఆర్థిక పురోభివృద్ధిలో సాధిస్తున్న విజయాలను ప్రత్యేకించి ఎవరి జీవితకాలంలో అయినా ఏర్పడే ఏకైక మహమ్మారి విజృంభణ కాలంలో సాధించిన పురోగతిని ప్రపంచం యావత్తు గుర్తించింది” అన్నారు.
వంద సంవత్సరాల క్రితం కోరలు చాచిన ఫ్లూ మహమ్మారి గురించి ప్రధానమంత్రి గుర్తు చేస్తూ ఆకలి బాధ తాళలేకనే అప్పుడు ఎక్కువ మంది మృత్యువాత పడ్డారన్నారు. ప్రస్తుత మహమ్మారి సమయంలో ఏ ఒక్క భారతీయుడు ఆకలితో పస్తులుండి మరణించే దుస్థితి లేకుండా చూశాం. అదే ఒక పెద్ద సామాజిక భద్రతా చర్య అన్నారు. “మహమ్మారి కోరలు చాచిన కాలంలో 80 కోట్ల మందికి పైగా సోదర భారతీయులకు ఉచిత ఆహార ధాన్యాలు అందించేందుకు భారత ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఏ ఒక్క భారతీయుడు ఆకలితో ఉండకూడదన్నది మా కట్టుబాటు” అన్నారు.
చిన్న రైతుల ఆందోళనల గురించి శ్రద్ధ చూపించడం ఒక్కటే పేదరికాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనగలిగే మార్గం అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. దీర్ఘకాలంగా చిన్న రైతులు నిర్లక్ష్యానికి గురవ్వడాన్ని ఆయన దుయ్యబట్టారు. “ఎన్నో సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించి, రాజభవనాల్లో నివశించిన వారు చిన్న రైతుల సంక్షేమం గురించి మాట్లాడడం మరిచిపోయారు. కాని భారతదేశం పురోగమించాలంటే చిన్న రైతును సాధికారం చేయడం ప్రధానం. చిన్న రైతులే భారతదేశ పురోగమనాన్ని శక్తివంతం చేస్తారు” అని ఆయన చెప్పారు.
పాలన, ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం అనుసరిస్తున్న కొత్త విధానం గురించి ప్రధానమంత్రి వివరించారు. ఉత్తరప్రదేశ్ లో దీర్ఘకాలంగా పెండింగులో ఉండిపోయిన సరయు నహర్ నేషనల్ ప్రాజెక్టు వంటివి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పూర్తవుతున్నాయని ఆయన ఉదాహరణగా చూపారు. అదే విధఃగా మౌలిక వసతులపరమైన సవాళ్ల పరిష్కారానికి పిఎం గతిశక్తి సమ్యక్ దృక్పథం అందిస్తున్నదని, చక్కని పరిష్కారాలతో పరిశ్రమలు లాజిస్టిక్ సవాళ్లకు సమాధానం ఇస్తుందని చెప్పారు. చక్కని అనుసంధానకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. "మా ప్రభుత్వం ఎంఎస్ఎంఇల నిర్వచనాన్ని మార్చివేసింది. ఇది ఆ రంగానికి సహాయకారిగా ఉంది" అన్నారు.
ఆత్మనిర్భర్ భారత కొత్త మానసిక వైఖరి గురించి మాట్లాడుతూ అన్వేషణాత్మక విధానాలతో దానికి కొత్త దిశ కల్పిస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. కొత్త రంగాలను తెరవడం ద్వారా ప్రతిభను వినియోగంలోకి తేవడంతో పాటు యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నట్టు ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. "ప్రభుత్వాలు మాత్రమే సమస్యలను పరిష్కరించగలవన్న వైఖరిని మేం విశ్వసించం. దేశ ప్రజల మీద, దేశ యువత మీద మాకు నమ్మకం ఉంది. మన స్టార్టప్ రంగాన్నే ఉదాహరణగా తీసుకుందాం. స్టార్టప్ ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మన ప్రజల బలానికి ఇది నిదర్శనం" అని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో యునికార్న్ ల నాణ్యత పెరిగిన విషయం కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. "యువతను, సంపద సృష్టించే వారిని, ఎంటర్ ప్రెన్యూర్లను భయపెట్టే వైఖరిని మేం అంగీకరించం" అని ప్రధానమంత్రి స్పష్ఠం చేశారు. 2014 సంవత్సరానికి ముందు దేశంలో 500 స్టార్టప్ లుండేవి. గత ఏడు సంవత్సరాల కాలంలో దేశంలో 60 వేల స్టార్టప్ లు ఏర్పాటయ్యాయి. భారతదేశం 100 యునికార్న్ ల దేశంగా మారుతోంది. స్టార్టప్ లలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమించింది.
"మేక్ ఇన్ ఇండియా"ను అపహాస్యం చేయడం అంటే దేశంలో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను, భారత యువతను, పారిశ్రామిక రంగాన్ని అపహాస్యం చేయడమే. రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించడమే అతి పెద్ద జాతి సేవ అని ఆయన చెప్పారు.
గతంలో ప్రపంచ సమస్యలను సాకుగా చూపుతూ ద్రవ్యోల్బణాన్ని సమర్థించుకునే వైఖరి ఉండేది. కాని నేడు ప్రపంచ సమస్యలను సాకుగా చూపే వైఖరికి భిన్నంగా సంక్లిష్టమైన ప్రపంచ సమస్యలున్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా అదుపు చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు.
"మాకు జాతి అంటే సజీవమైన ఆత్మ. ప్రభుత్వాధికారాన్ని అందుకునే ఒక ఏర్పాటు ఏ మాత్రం కాదు" అని ప్రధానమంత్రి అన్నారు. యావత్ భారతదేశాన్ని ఒక సజీవమైన ఆత్మగా వివరించే పురాణాలు, సుబ్రహ్మణ్య భారతి మాటలను ఆయన ఉటంకించారు. సిడిఏ బిపిన్ రావత్ కు తమిళనాడు ప్రజలు చూపించిన గౌరవమే దేశవ్యాప్త జాతీయ సెంటిమెంట్ కు చక్కని ఉదాహరణ అని ఆయన వివరించారు.
పవిత్రమైన అమృత కాల సమయంలో పాజిటివ్ సెంటిమెంట్ తో జాతికి తమ సేవలందించేందుకు కృషి చేయాలని ఆయన రాజకీయ పార్టీలు, పౌరులు, యువతకు పిలుపు ఇస్తూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ముగించారు.
****
DS
(Release ID: 1796386)
Visitor Counter : 142
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam