ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రముఖ గాయని లత మంగేశ్ కర్ గారి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 06 FEB 2022 10:27AM by PIB Hyderabad

ప్రముఖ గాయని లత మంగేశ్ కర్ గారి కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. లత మంగేశ్ కర్ గారి కుటుంబం తో ప్రధాన మంత్రి మాట్లాడి, తన సంతాపాన్ని తెలియజేశారు. రాబోయే తరాల వారు ఆవిడ ను భారతదేశ సంస్కృతి లో ఒక ప్రసిద్ధురాలు గా స్మరించుకొంటారు; ఆవిడ స్వర మాధుర్యం ప్రజల ను మైమరపించడం లో సాటి లేనటువంటి సామర్థ్యాన్ని సంతరించుకొంది అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

"మాటల లో చెప్పలేనంతటి మానసిక వ్యథ కు లోనవుతున్నాను. దయ, సంరక్షణ లు మూర్తీభవించినటువంటి లత అక్కయ్య మనను వదలిపెట్టి వెళ్లిపోయారు. ఆమె లేని లోటు మన దేశ ప్రజల కు తీర్చలేనిది. రాబోయే తరాల వారు ఆవిడ ను భారతదేశ సంస్కృతి లో ఒక ప్రసిద్ధురాలు గా స్మరించుకొంటారు; ఆవిడ స్వర మాధుర్యం ప్రజల ను మైమరపించడం లో సాటి లేనటువంటి సామర్థ్యాన్ని సంతరించుకొంది.’’

‘‘లత అక్కయ్య పాడిన పాటలు విభిన్నమైనటువంటి భావోద్వేగాల కు అద్దం పట్టాయి. భారతదేశ చలనచిత్ర జగత్తు లో చోటు చేసుకొన్న మార్పుల ను దశాబ్దాల తరబడి ఆవిడ సన్నిహితం గా గమనించారు. చలనచిత్రాల కు అవతల, ఆమె భారతదేశం యొక్క వృద్ధి ని గురించి ఎల్లప్పుడూ ఉద్వేగాన్ని వ్యక్తపరుస్తూ వచ్చారు. ఒక బలమైన భారతదేశాన్ని, ఒక ప్రగతిశీల భారతదేశాన్ని చూడాలి అని ఆమె సదా కోరుకొన్నారు.’’

‘‘లత దీదీ వద్ద నుంచి అపారమైన వాత్సల్యాన్ని నేను అందుకొంటూ రావడం అనేది నాకు లభించినటువంటి గౌరవం అని నేను తలుస్తాను. ఆమె తో నేను జరిపిన మాటామంతీ మరపురానివి. లత అక్కయ్య కన్నుమూత సందర్భం లో నా తోటి భారతీయులతో పాటు నేను సైతం బాధ పడుతున్నాను. ఆమె కుటుంబం తో నేను మాట్లాడాను, నా సంతాపాన్ని వారికి తెలియజేశాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1795918) Visitor Counter : 148