ప్రధాన మంత్రి కార్యాలయం
దక్షిణాసియా లో అతి పెద్ద రామ్‌సర్ ప్రాంతాల నెట్‌వర్క్ గల దేశంగా భారతదేశాని కి గుర్తింపు లభించడంపై హర్షాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
03 FEB 2022 10:30PM by PIB Hyderabad
దక్షిణాసియా లో అతి పెద్ద రామ్‌సర్ ప్రాంతాల నెట్‌వర్క్ గల దేశం గా భారతదేశాని కి గుర్తింపు లభించడం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రామసర్ ప్రాంతాల జాబితా లో గుజరాత్ లోని ఖిజాడియా వన్యప్రాణుల అభయారణ్యం, ఉత్తర్ ప్రదేశ్ లోని బఖీరా వన్యప్రాణుల అభయారణ్యాల కు స్థానం లభించడంపై ప్రధాన మంత్రి సంతోషం వెలిబుచ్చారు.
ఈ అంశం మీద కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ ట్వీట్ పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందిస్తూ ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశం లో -
“ఇదో అద్భుతమైన వార్త!
భారతదేశం దక్షిణాసియాలో అతిపెద్ద రామ్‌సర్ ప్రాంతాల నెట్‌వర్క్ కలిగి ఉంది. వృక్ష, జంతుజాలాల పరిరక్షణసహా ప్రకృతితో మమేకమై జీవించడంలో మన పౌరుల నిబద్ధతకు ఇదే తార్కాణం.” అని పేర్కొన్నారు.
***
DS/AK
(रिलीज़ आईडी: 1795379)
आगंतुक पटल : 238
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam