ప్రధాన మంత్రి కార్యాలయం
బహరీన్ సామ్రాజ్య యువ రాజు మరియు ప్రధాని మాన్య శ్రీ ప్రిన్స్ సల్ మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి
Posted On:
01 FEB 2022 6:26PM by PIB Hyderabad
బహరీన్ సామ్రాజ్య యువరాజు, ప్రధాని మాన్య శ్రీ ప్రిన్స్ సల్ మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు. మాన్య శ్రీ ప్రిన్స్ సల్ మాన్ భారతదేశం గణతంత్ర దినం సందర్భం లో ప్రధాన మంత్రి కి అభినందన లు తెలిపారు.
నేతలు ఇరువురు భారతదేశాని కి, బహరీన్ కు మధ్య ద్వైపాక్షిక సంబంధాల పై సమీక్ష ను నిర్వహించి, రాజకీయం, వ్యాపారం, పెట్టుబడి, శక్తి, ఆరోగ్యం, భద్రత, ఇంకా ప్రజల మధ్య పరస్పర సహకారం సహా వివిధ రంగాల లో నిరంతర పురోగతి చోటుచేసుకోవడం పట్ల సంతృప్తి ని వ్యక్తం చేశారు. భారతదేశం మరియు బహరీన్ లు ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన పరిణామం తాలూకు స్వర్ణ జయంతి ని 2021-22 లో జరుపుకొంటున్నాయి.
కోవిడ్ మహమ్మారి కాలం లో బహరీన్ లో భారతీయ సముదాయం యొక్క ఉత్కృష్ట సంరక్షణ తో పాటు వారి యొక్క సామాజిక అవసరాల ను, సాంస్కృతిక అవసరాల ను నెరవేర్చినందుకు బహరీన్ నాయకత్వాని కి ప్రధాన మంత్రి ధన్యవాదాలను తెలియజేశారు.
మాన్య శ్రీ రాజా హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలియజేశారు. యువరాజు, ప్రధాని ప్రిన్స్ సల్ మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ను వీలైనంత త్వరలో భారతదేశాన్ని సందర్శించడానికి తరలి రావాలంటూ తన ఆహ్వానాన్ని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
****
(Release ID: 1794919)
Visitor Counter : 170
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam