ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంక్షిప్తంగా కేంద్ర బ‌డ్జెట్ 2022-23

Posted On: 01 FEB 2022 1:19PM by PIB Hyderabad

ఇండియా ఆర్థిక వృద్ధి ప్ర‌స్తుత సంవ‌త్స‌రంలో 9.2 శాతంగా ఉంది. ఇది పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌లోకెల్లా ఇది గ‌రిష్ఠ‌స్థాయిలో ఉంది.
కోవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌తికూల ప‌రిస్థితుల‌నుంచి ఆర్ధిక వ్య‌వ‌స్థ కోలుకుని  పుంజుకోవ‌డం మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లానికి నిద‌ర్శ‌నం. ఈ విష‌యాన్ని కేంద్ర ఆర్ధిక , కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ‌మ‌తి నిర్మ‌లా సీత‌రామన్ ఈరోజు కేంద్ర బ‌డ్జెట్‌ను పార్ల‌మెంటుకు స‌మ‌ర్పిస్తూ అన్నారు.
.
  ఇండియా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌ను జ‌రుపుకుంటోంది. దేశం అమృత కాలంలోకి ప్ర‌వేశించింది. ఇండియా వంద సంవ‌త్స‌రాల పండుగకు మ‌రో 25 సంవ‌త్స‌రాలు ఉంది. ప్ర‌ధాన‌మంత్రి స్వాతంత్ర్యదినోత్స‌వ ప్ర‌సంగంలో ప్ర‌స్తావించిన దార్శ‌నిక‌త ల‌క్ష్య సాధ‌న‌కు ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. అవి.


.సూక్ష్మ ఆర్దిక స్థాయి కి చేదోడుగా సూక్ష్మ ఆర్ధిక వ్య‌వ‌స్త స్థాయిలో ప్ర‌గ‌తిపై దృష్టిపెడుతూ అన్ని రంగాల సంక్షేమానికి కృషిచేయ‌డం జ‌రుగుతుంది.
డిజిట‌ల్ ఆర్ధిక వ్య‌వస్థ‌ను , ఫిన్ టెక్‌, టెక్నాల‌జీ ఆధారిత అభివృద్ధి, ఇంధ‌న ప‌రివ‌ర్త‌న‌, ప‌ర్యావ‌ర‌ణ చ‌ర్య‌లకు ప్రోత్సాహం.

2014 నుంచి ప్ర‌భుత్వం పౌరుల సాధికార‌త‌కు ప్ర‌త్యేకించి పేద‌లు, ఇత‌ర అణ‌గారిన వ‌ర్గాల వారి సాదికార‌త‌పై దృష్టిపెట్టి ప‌నిచేస్తోంది. వారికి గృహ‌వ‌స‌తి,విద్యుత్ స‌దుపాయం, వంట‌గ్యాస్, మంచినీటి స‌దుపాయం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంది. ఆర్ధిక స‌మ్మిళిత‌త్వం, ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ , పేద‌లు అన్ని అవ‌కాశాల‌ను సొంతం చేసుకునే సామ‌ర్ధ్యం క‌ల్పించ‌డానికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఇందుకు సంబంధించిన కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతూ వ‌చ్చింది.
 ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాధించేందుకు 14 రంగాలలో ఉత్పాదకత అనుసంధానిత ప్రోత్సాహకానికి అద్భుతమైన స్పందన లభించింది. దీనితో 60 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం తోపాటు, రాబోయే 5 సంవత్సరాలలో రూ. 30 లక్షల కోట్ల అదనపు ఉత్పత్తిని సాధించవచ్చని ఆర్థిక మంత్రి తెలిపారు.  పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ కు సంబంధించి నూత‌న విధానం  అమలు అంశంపై ఆమె మాట్లాడుతూ, ఎయిర్ ఇండియా యాజమాన్యం  వ్యూహాత్మక బదిలీ పూర్తయిందని,  ఎన్‌ఐఎన్‌ఎల్ (నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) కోసం వ్యూహాత్మక భాగస్వామిని ఎంపిక చేశామని చెప్పారు. త్వ‌ర‌లోనే ఎల్‌.ఐ.సి ప‌బ్లిక్ ఇష్యూ  త్వ‌ర‌లోనే రావ‌చ్చ‌ని , 2022-23లో మ‌రి కొన్ని  కూడా ప్రాసెస్‌లో ఉన్నాయ‌ని మంత్రి అన్నారు.

బ‌డ్జెట్ ప్ర‌గ‌తిని కొన‌సాగించేందుకు మ‌రింత ఊతం ఇచ్చేదిగా ఉంద‌ని నొక్కిచెప్పారు. ఇది 1) అమృత్ కాల్‌కు బ్లూ ప్రింట్ రూపొందిస్తుంద‌ని, అది భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కుఅనుగుణ‌మైన‌, అన్ని వ‌ర్గాల‌కు ఉప‌యోగ‌ప‌డే, ప్ర‌త్యేకంగా యువ‌త‌ , రైతులు, మ‌హిళ‌లు, షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగ‌ల వారికి ప్ర‌త్య‌క్షంగా ప్ర‌యోజ‌నం క‌లిగించేదిగా ఉంద‌న్నారు. (2) ఆధునిక మైలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద ఎత్తున ప‌బ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్‌, ఇండియాను శ‌త వ‌సంతాల‌కు సిద్దం చేయ‌డం, పిఎం గ‌తి శ‌క్తి మార్గ ద‌ర్శ‌నంలో మ‌ల్టీ మోడ‌ల్ విధానాన్ని మిళితం చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు.
పి.ఎం. గ‌తిశ‌క్ంతి, స‌మ్మిళిత అభివృద్ధి ఉత్పాద‌క‌త , పెట్టుబ‌డి వృద్ది, స‌న్ రైజ్ అవ‌కాశాలు, ఇంధ‌న ప‌రివ‌ర్త‌న‌, వాతావ‌ర‌ణ మార్పుల కార్యాచ‌ర‌ణ‌, ఇన్వెస్ట్‌మెంట్‌ల‌కు ఫైనాన్సింగ్ కు ప్రాధాన్య‌త‌నిస్తోంద‌న్నారు.

పి.ఎం. గ‌తిశ‌క్తి :
పి.ఎం. గ‌తిశ‌క్తి మాస్ట‌ర్‌ప్లాన్ ఫ‌ర్ ఎక్స్‌ప్రెస్ వేస్ ను 2022-23లో రూప‌క‌ల్ప‌న చేయ‌డం జ‌రుగుతుంది. ప్ర‌జ‌ల రాక‌పోక‌లు, స‌ర‌కు ర‌వాణా స‌త్వ‌రం జ‌రిగేందుకు ఇది ఉప‌క‌రిస్తుంది. నేష‌న‌ల్ హైవేస్ నెట్‌వ‌ర్క్‌ను 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో 25,000 కిలోమీట‌ర్ల‌కు విస్త‌రించ‌డం జ‌రుగుతుంది.  ప్ర‌భుత్వ వ‌న‌రుల‌కు తోడు, వినూత్న ఫైనాన్సింగ్ ప‌ద్ధ‌తుల ద్వారా 20,000 కోట్ల రూపాయ‌ల‌ను స‌మీక‌రించ‌డం జ‌రుగుతుంది.
నాలుగు ప్రాంతాల‌లో 2022-23 లో మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు పిపిపి ప‌ద్ధ‌తిలో  కాంట్రాక్టు ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

రైల్వేల‌కు సంబంధించి, ప్ర‌స్తావిస్తూ ఆర్థిక‌మంత్రి, ఒక స్టేష‌న్‌- ఒక ఉత్ప‌త్తి అంశాన్ని ప్రాచుర్యంలోకి తేవ‌డం జ‌రుగుతుంది. స్థానిక వ్యాపారాలు, స‌ర‌ఫ‌రా చెయిన్ల‌కు ఇది స‌హాయ‌ప‌డుతుంది. దీనికి తోడు ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌లో భాగంగా క‌వ‌చ్ ప‌థ‌కం కిందికి 2000 కిలోమీట‌ర్ల‌నెట్ వ‌ర్క్‌ను తీసుకురావ‌డం జ‌రుగుతుంది. దీని ద్వారా దేశీయంగా ప్రపంచ శ్రేణి సాంకేతిక‌త‌తో భ‌ద్ర‌త‌, సామ‌ర్ధ్య పెంపున‌కు 2022-23లో చ‌ర్య‌లు తీసుకుంటారు. మెరుగైన సామ‌ర్ధ్యం , ప్ర‌యాణికుల‌కు సుఖ‌వంత‌మైన ప్ర‌యాణ అనుభూతి క‌లిపించేందుకు మెరుగైన ఇంధ‌న సామ‌ర్ధ్యానికి 400 కొత్త వందే భార‌త్ రైళ్ల‌ను త‌యారుచేసి అభివృద్ధి చేయ‌నున్న‌ట్టు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్ స‌దుపాయాల కోసం 100 పి.ఎం. గ‌తి శ‌క్తి కార్గో టెర్మిన‌ళ్లను రాగ‌ల మూడు సంవ‌త్స‌రాల‌లో   ఏర్పాటుచేయ‌డం జ‌రుగుతోంది.


 వ్య‌వ‌సాయ‌రంగం:

ఇక వ్య‌వ‌సాయ రంగానికి వ‌స్తే, ర‌సాయ‌నాల ర‌హిత స‌హ‌జ ప‌ద్ధ‌తుల‌లో సాగును దేశ‌వ్యాప్తంగా  ప్రోత్స‌హిస్తామ‌ని , ప్ర‌త్యేకించి తొలి ద‌శ‌లో గంగాన‌దికి చెందిన 5 కిలోమీట‌ర్ల వెడ‌ల్పు కారిడార్‌లోని పంట పొలాల‌లో దీనిని అమ‌లుపై దృష్టిపెడ‌తామ‌న్నారు. పంట అంచ‌నా, భూ రికార్డుల‌ డిజిటైజేష‌న్‌, పురుగుమందుల పిచికారీ, పోష‌కాలు వెద‌జ‌ల్లేందుకు కిసాన్ డ్రోన్ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుందన్నారు
నూనెగింజ‌ల దిగుమ‌తిపై ఆధార‌ప‌డ‌డం త‌గ్గించేందుకు దేశీయంగా నూనె గింజ‌ల ఉత్పత్తి పెంచేందుకు హేతుబ‌ద్ధ‌మైన , స‌మ‌గ్ర విధానాన్ని అమ‌లుచేస్తామ‌న్నారు.


2023 సంవ‌త్స‌రాన్ని అంత‌ర్జాతీయ చిరుధాన్యాల సంవ‌త్స‌రంగా ప్ర‌క‌టించినందున‌, దేశీయంగా వీటి వినియోగం పెంపు, చిరుధాన్యాల ఉత్ప‌త్తులకు దేశీయంగా, అంత‌ర్జాతీయంగా బ్రాండింగ్, పంట కోత అనంత‌రం ఉత్ప‌త్తికి విలువ జోడింపుకు ప్ర‌భుత్వం పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.


నీటిపారుద‌ల ప్రాజెక్టులుః
కెన్- బెత్వా లింక్ ప్రాజెక్టును 44,605 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. ఈ ప్రాజెక్టు 9.08 ల‌క్ష‌ల హెక్టార్ల పంట పొలాల‌కు నీటి స‌దుపాయం , 62 ల‌క్ష‌ల మందిప్ర‌జ‌ల‌కు మంచినీటి స‌దుపాయం, 103 మెగా వాట్ల జ‌ల‌విద్యుత్ ఉత్ప్తి, 27 మెగా వాట్ల సౌర విద్యుత్ ఉత్ప‌త్తికి వీలు క‌ల్పిస్తుంది.

 

ఈ ప్రాజెక్టుకు 2021-22 స‌వ‌రించిన అంచ‌నాల ప్ర‌కారం రూ 4,300 కోట్లు, 2022-23 సంవ‌త్స‌రంలో 1,400 కోట్ల రూపాయ‌లు కేటాయించడం జ‌రిగింది. దీనికితోడు ద‌మ‌న్ గంగ‌- పింజాల్‌, పార్‌-తాపి న‌ర్మ‌ద‌, గోదావ‌రి-కృష్ణ‌, కృష్ణ -పెన్నార్‌, పెన్న‌-కావేరి న‌దుల అనుసంధానం ఖ‌రారుచేయ‌డం జ‌రిగింది. ఈ విష‌య‌మై ప్ర‌యోజ‌నం పొంతున్న రాష్ట్రాలు, కేంద్రానికిమ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌గానే దీని అమ‌లుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం జరుగుతుంది.

 

ఎం.ఎస్‌.ఎం.ఇల‌కు మ‌ద్ద‌తుః

ఎమ‌ర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ పథ‌కం ( ఇసిఎల్ జిఎస్‌) 130 ల‌క్ష‌ల‌కు పైగా ఎం.ఎస్‌.ఎం.ఇల‌కు అవ‌స‌ర‌మైన అద‌న‌పు రుణ స‌దుపాయాన్నిక‌ల్పించింది. ఇది కోవిడ్ మ‌హమ్మారి కార‌ణంగా త‌లెత్తిన ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను త‌ట్టుకునేందుకు ఎం.ఎస్.ఎం.ఇల‌కు  ఉప‌యోగ‌ప‌డింది. ఇసిఎల్ జిఎస్‌ను  2023 మార్చి వ‌ర‌కు పొడిగించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.
క్రెడిట్ గ్యారంటీ ట్ర‌స్ట్ ఫ‌ర్ మైక్రో, స్మాల్ ఎంట‌ర్ ప్రైజెస్ (సిజిటిఎంఎస్ ఇ) ప‌థ‌కాన్ని  త‌గిన విధంగా నిధులు చేర్చ‌డం ద్వారా పున‌రుద్ధ‌రిస్తారు. ఇది సూక్ష్మ‌, చిన్న త‌ర‌హా ఎంట‌ర్ ప్రైజ్‌ల‌కు అద‌నంగా 2 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల రుణం అందుబాటు లోకితెచ్చేందుకు, ఉపాధి అవ‌కాశాల‌ను పెంపొందించేందుకు వీలు క‌ల్పిస్తుంది. ఎం.ఎస్.ఎం.జి  ప‌నితీరును పెంచే ఆర్‌.ఎ.ఎం.పి ప‌థ‌కాన్ని రాగ‌ల 5 సంవ‌త్స‌రాల లో 6 ,0000 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో తీసుకురావ‌డం జ‌రుగుతుంద‌ని, దీనితో ఎం.ఎస్‌.ఎం.ఇ రంగం మ‌రింత స‌మ‌ర్ధంగా, పోటీ త‌త్వంతో ప‌నిచేయ‌డానికి వీలుక‌లుగుతుంద‌న్నారు.
 ఉద‌యం, ఈ -శ్ర‌మ్, ఎన్ సిఎస్‌, ఎఎస్ఇఇఎం పోర్ట‌ల్‌లను అనుసంధానంచేసి వాటి ప‌రిథిని విస్తృతం చేస్తారు.

నైపుణ్య శిక్ష‌ణ‌:
నైపుణ్య శిక్ష‌ణ‌, నాణ్య‌మైన విద్య గురించి ప్ర‌స్తావిస్తూ ఆర్థిక‌మంత్రి, డ్రోన్ శ‌క్తి ద్వారా వివిధ‌ అప్లికేష‌న్లు చేప‌ట్ట‌డానికి స్టార్ట‌ప్ ల‌ను ప్రోత్స‌హిస్తామ‌న్నారు. అన్ని రాష్ట్రాల‌లో  ఎంపిక చేసిన ఐటిఐ ల‌లో   నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన కోర్సుల‌ను ప్రారంభించ‌డం జ‌రుగుతుంది.  వృత్తి విద్యా కోర్సుల‌లో, కీల‌క‌మైన ఆలోచ‌నా నైపుణ్యాల‌ను పెంపొందింప చేసేందుకు , సృజ‌నాత్మ‌క‌త‌కు 750 వ‌ర్చువ‌ల్ ప్ర‌యోగ శాల‌ల‌ను సైన్సు, మాథ‌మాటిక్స్ ల‌లోను అలాగే 75 నైపుణ్య ఈ లాబ్‌ల‌ను 2022-23 సంవ‌త్స‌రంలో ఏర్పాటు చేస్తారు.
ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల‌లో పాఠ‌శాల‌లు ఎక్కువ కాలం మూత‌ప‌డ‌డంతో పిల్లలు ప్ర‌త్యేకించి గ్రామీణ ప్రాంతాల‌లోనివారు, షెడ్యూలుకులాలు, షెడ్యూలు త‌ర‌గ‌తులు వారు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కుచెందిన వారు దాదాపు రెండు సంవ‌త్స‌రాలు త‌ర‌గ‌తి గ‌ది బోధ‌న‌కు దూర‌మ‌య్యారు. వీరిలో చాలా మంది ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే పిల్ల‌లు. వీరికి అనుబంధంగా బోధ‌న అంద‌జేసేందుకు ఒక త‌ర‌గ‌తి, ఒక టివి చాన‌ల్ కార్య‌క్ర‌మ‌మైన పిఎం ఈ విద్య‌ను 12 నుంచి 200 ఛాన‌ళ్ల‌కు విస్త‌రిస్తారు. ఇది రాష్ట్రాలు ప్రాంతీయ భాష‌ల‌లో 1నుంచి 12 త‌ర‌గ‌తుల వ‌ర‌కు అనుబంధ విద్య‌ను అందించ‌డానికి  ఉప‌క‌రిస్తుంది.

  దేశ‌వ్యాప్తంగా  ప్ర‌పంచ‌శ్రేణి  సార్వ‌త్రిక విద్య‌ను ఇంటి గుమ్మం ముందుకు చేర్చేదిశ‌గా డిజిట‌ల్ విశ్వ‌విద్యాల‌యాన్ని ఏర్పాటు చేస్తారు. దీనిని వివిధ భార‌తీయ భాష‌ల‌లో ఐసిటి ఫార్మెట్‌ల‌లో అందుబాటులోకి తీసుకువ‌స్తారు.  దీనిని నెట్ వ‌ర్క్ హ‌బ్ స్పోక్ న‌మూనాలో తీసుకువ‌స్తారు. దేశంలో అత్యుత్త‌మ విశ్వ‌శిద్యాల‌యాలు ఈ నెట్ వ‌ర్క్ తో అనుసంధాన‌మ‌వుతాయి.

ఆయుష్మాన్ భార‌త్ డిజిట‌ల్ మిష‌న్ కింద నేష‌న‌ల్ డిజిట‌ల్ హెల్త్ ఎకో సిస్ట‌మ్ కు సంబంధించి ఓపెన్ ప్లాట్‌ఫారంను తీసుకువ‌స్తారు. ఇందులో ఆరోగ్య స‌దుపాయాల క‌ల్పించేవారి డిజిట‌ల్ రిజిస్ట్రీస్‌, ప్ర‌త్యేక ఆరోగ్య గుర్తింపు, క‌న్సెంట్ ఫ్రేమ్ విర్క్‌, సార్వ‌త్రిక ఆరోగ్య స‌దుపాయాలు అందుబాటులోకితేవడం ఉంటాయి.
కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆరోగ్య స‌మ‌స్య‌లు అన్ని వ‌య‌సుల‌వారిలో క‌నిపించ‌డంతో నేష‌న‌ల్ టెలి మెంటల్‌హెల్త్ ప్రోగ్రాంను ప్రారంభిస్తారు. దీనిద్వారా హెల్త్ కౌన్సిలింగ్ సేవ‌లు, అందుబాటులోకి వ‌స్తాయి. ఈ నెట్ వ‌ర్క్ లో 23 టెలి మెంట‌ల్ హెల్త్ సెంట‌ర్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను చేరుస్తారు. ప్ర‌ఖ్యాత నిమ్‌హాన్స్ సంస్థ దీనికి నొడ‌ల్ సెంట‌ర్ గా ఉంటుంది. ఇంట‌ర్నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ బెంగ‌ళూరు -ఐఐఐటిబి దీనికి సాంకేతిక స‌హ‌కారం అందిస్తోంది..

 న‌ల్ సే  జ‌ల్ :
దేశంలోని 3.8 కోట్ల ఇళ్ల‌కు హ‌ర్‌ఘ‌ర్ , న‌ల్ సే జ‌ల్ కింద నీటిని అందించేందుకు 60,000 కోట్ల రూపాయ‌లను ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కేటాయించారు. ప్ర‌స్తుత క‌వ‌రేజ్ 8.7 కోట్లు కాగా ఇందులో 5.5 కోట్ల ఇళ్ల‌కు గ‌త రెండు సంవ‌త్స‌రాల‌లోనే ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీటిని అందించ‌డం జ‌రిగింది. అలాగే ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్‌యోజ‌న కింద 2022-23 సంవ‌త్స‌రంలో 80 ల‌క్ష‌ల ఇళ్ల‌నుపూర్తి చేయ‌డం జ‌రుగుతుంది. గ్రామీణ ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో ఇళ్ల నిర్మాణానికి 48 వేల కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌డం జ‌రిగింది.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి :
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి ప్ర‌ధాన‌మంత్రి ఒక కొత్త ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చారు. పిఎం-డెవ్ ఐఎన్ ఇ ని నార్త్ ఈస్ట్ర‌న్ కౌన్సిల్ ద్వారా అమ‌లు చేస్తారు. మౌలిక స‌దుపాయాల‌కు దీని ద్వారా నిధులు స‌మ‌కూరుస్తారు. పిఎం గ‌తి శ‌క్తి, సామాజిక అభివృద్ధిప్రాజెక్టులు ఈశాన్య రాష్ట్రాల అవ‌స‌రాల‌కు అనుగుణంగా రూపక‌ల్ప‌న చేయ‌డం జ‌రుగుతుంది. ఇందుకు ప్రాథ‌మికంగా 1500 కోట్ల రూపాయ‌లు  యువ‌త‌, మ‌హిళ‌ల జీవ‌నోపాథి కార్య‌క‌లాపాల కు, వివిధ రంగాల‌లో ఉన్న‌లోపాల‌ను స‌వ‌రించ‌డానికి  ఇది ఉప‌కరిస్తుంది.

2022 సంవ‌త్స‌రంలో నూరుశాతం 1.5 ల‌క్ష‌ల పోస్ట్ఆఫీసులు కోర్ బ్యాంకింగ్‌వ్య‌వ‌స్థ‌లోకి తీసుకువ‌స్తారు. దీనితో ఆర్థిక స‌మ్మిళిత‌త్వానికి , 11 నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్, ఎటిఎంల తో ఖాతాల‌కు అనుసంధాన‌త ఏర్ప‌డుతుంది. ఇది ఆన్ లైన్ ద్వారా నిధుల‌ను పోస్టాఫీసు ఖాతాల‌నుంచి బ్యాంకు ఖాతాల‌కు బ‌దిలీ చేయ‌డానికి వీలుక‌ల్పిస్తుంది. ఇది ప్ర‌త్యేకించి రైతుల‌కు, గ్రామీణ ప్రాంతాల‌లోని వ‌యోధికుల‌కు అంత‌ర్‌పోర్ట‌బిలిటీకి, ఆర్థిక స‌మ్మిళిత‌త్వానికి అవ‌కాకాశం క‌ల్పిస్తుంది.


 డిజిట‌ల్ బ్యాంకింగ్ యూనిట్లు:
 75 సంవ‌త్స‌రాల  స్వాతంత్ర్య ఉత్స‌వాల సంద‌ర్భంగా  ప్ర‌భుత్వం 75 డిజిట‌ల్ బ్యాంకింగ్ యూనిట్ల‌ను (డిబియు)ల‌ను 75 జిల్లాల‌లో షెడ్యూలు వాణిజ్య బ్యాంకుల ద్వారా ఏర్పాటుచేయ‌నుంది. ఇది డిజిట‌ల్ బ్యాంకింగ్‌కార్య‌క‌లాపాల‌ను దేశంలోని వివిధ మారుమూల ప్రాంతాల‌కు సైతం అందుబాటులోకి తీసుకురానుంది.
ఎల‌క్ట్రానిక్ చిప్ సౌక‌ర్యంతో ఈ పాస్ పోర్టును జారీచేయ‌నున్నారు. 2022-23 సంవ‌త్స‌రంలో దీనిని తీసుకురానున్నారు. దీన‌వ‌ల్ల విదేశీ ప్ర‌యాణాలు సుల‌భ‌త‌ర‌మౌతాయి.


5 జి టెక్నాల‌జీ. :
టెలిక‌మ్యూనికేష‌న్ రంగాన్ని గురించి ప్ర‌స్తావిస్తూ నిర్మ‌లా సీతారామ‌న్, ప్ర‌త్యేకించి 5 జి సాంకేతిక ప‌రిజ్ఞానం గురించి ప్ర‌స్తావించారు. ఇది ప్ర‌గ‌తి, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తుంద‌న్నారు. 2022లో త‌గిన స్పెక్ట్ర‌మ్వేలం నిర్వ‌హిస్తామ‌ని, ఇది 5జి మొబైల్ స‌ర్వీసులు 2022-23లో ప్రైవేట్ టెలికం ప్రొవైడ‌ర్లు  అందుబాటులోకి తీసుకురావ‌డానికి వీలు క‌లుగుతుంద‌న్నారు. 

ర‌క్ష‌ణ రంగం :
 ర‌క్ష‌ణ రంగం గురించి ప్ర‌స్తావిస్తూ, ప్ర‌భుత్వం దిగుమ‌తుల‌ను త‌గ్గించి ఆత్మ‌నిర్భ‌ర్‌భార‌త్ కింద సాయుధ బ‌ల‌గాల‌కు అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల‌ను అందుబాటులోకి తేనున్న‌ద‌న్నారు. కేపిటల్ ప్రోక్యూర్మెంట్ బ‌డ్జెట్ లో 68 శాతాన్ని దేశీయ ప‌రిశ్ర‌మ‌కు 2022-23 సంవ‌త్స‌రంలో  కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు. 2021-22 సంవ‌త్స‌రం దానిక‌న్న 58 శాతం పెంచారు. ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న‌, అభివృద్ధిని ప‌రిఃశ్ర‌మ‌లు, స్టార్ట‌ప్ లు విద్యా సంస్థ‌ల‌కు రక్ష‌ణ ప‌రిశోధ‌న అభివృద్ధి బ‌డ్జెట్ లో 25 శాతాన్ని కేటాయించ‌నున్నారు.

దేశీయంగా 280 గిగావాట్ల స్థాపిత సౌర విద్యుత్ సామ‌ర్థ్యాన్ని 2030 నాటికి చేరుకునేందుకు వీలు క‌ల్పిస్తూ అద‌నంగా 19,500 కోట్ల రూపాయ‌ల‌ను ఉన్న‌త స్థాయి సామ‌ర్థ్యం గ‌ల మాడ్యూల్స్త త‌యారీకి ఉత్పాద‌క‌త‌తో కూడిన ప్రోత్సాహ‌కం ఇవ్వ‌నున్నారు. పాలి సిలికాన్ నుంచి సోలార్ పివి మాడ్యూల్స్ వ‌ర‌కు పూర్తి స్థాయి స‌మీకృత త‌యారీ యూనిట్ల‌కు ప్రాధాన్య‌త ఇస్తారు.

 

   దేశంలో 2022-23లోనూ ప్రభుత్వ పెట్టుబడులు అగ్రస్థానంలో కొనసాగాలని, అలాగే డిమాండు, ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం ఉండాలని ఆర్థికశాఖ మంత్రి అన్నారు. అందుకే కేంద్ర బడ్జెట్‌లో మూలధన వ్యయం కేటాయింపులను మరోసారి గణనీయ స్థాయిలో 35.4

శాతం పెంచి రూ.5.54 లక్షల కోట్ల నుంచి ప్రస్తుత 2022-23 సంవత్సరంలో రూ.7.50 లక్షల

కోట్లకు భారీగా హెచ్చించినట్లు వెల్లడించారు. మునుపటి 2019-20 కాలంతో పోలిస్తే

ఈ వ్యయం 2.2 రెట్లకన్నా అధికంగా పెరిగింది. మొత్తంమీద 2022-23 జీడీపీలో ఈ వ్యయం విలువ 2.9 శాతంగా ఉంటుందని అంచనా. రాష్ట్రాలకు పూర్తి ఆర్థిక సహాయం ద్వారా మూలధన ఆస్తుల సృష్టికి కేటాయింపులుసహా కేంద్ర ప్రభుత్వ “ఆచరణాత్మక

మూలధన వ్యయం” అంచనా 2022-23లో రూ.10.68 లక్షల కోట్లు కాగా, ఇది జీడీపీలో 4.1

శాతంగా ఉంటుందని మంత్రి వివరించారు.

   ఇక 2022-23లో ప్రభుత్వం సమీకరించే మార్కెట్‌ రుణాల మొత్తంలో ‘సావరిన్‌ గ్రీన్‌ బాండ్స్‌’ జారీ ఒక భాగంగా ఉంటుంది. దీనికింద హరిత మౌలిక సదుపాయాల కోసం వనరుల సేకరణకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ బాండ్ల జారీద్వారా లభ్యమయ్యే నిధులను ప్రభుత్వరంగ ప్రాజెక్టులకు వినియోగిస్తారు. ఇది ఆర్థిక వ్యవస్థలో కర్బన ఉద్గారాల తీవ్రత తగ్గించేందుకు దోహదం చేస్తుంది. దేశంలో కరెన్సీ నిర్వహణ మరింత సమర్థంగా, చౌకగా సాగడం కోసం 2022-23 నుంచి ‘బ్లాక్‌చెయిన్‌ తదితర సాంకేతిక పరిజ్ఞానాల ఆధారంగా రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ద్వారా ‘డిజిటల్‌ రూపాయి’ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

   హకారాత్మక సమాఖ్య తత్వం వాస్తవ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ‘మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ఆర్థిక సహాయ పథకం’ కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు బడ్జెట్‌ అంచనాల్లో రూ.10,000 కోట్లుగా పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరానికి సవరించిన అంచనాల్లో రూ.15,000 కోట్లకు పెంచింది. అంతేకాకుండా 2022-23కుగాను ఆర్థిక వ్యవస్థలో సమగ్ర పెట్టుబడుల ఉత్ప్రేరణం దిశగా రాష్ట్రాలకు సాయపడేందుకు కేటాయింపులను రూ.1 లక్ష కోట్లుగా పేర్కొంది. రాష్ట్రాలకు అనుమతించిన సాధారణ రుణ సమీకరణ మొత్తానికి ఈ యాభయ్యేళ్ల పరిమితిగల వడ్డీరహిత రుణాలు అదనంగా లభిస్తాయి. ఈ కేటాయింపులను ‘పీఎం-గతిశక్తి’ సంబంధిత ఇతర ఉత్పాదక మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలు వినియోగించాల్సి ఉంటుంది. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా 2022-23లో రాష్ట్రాల ‘జీఎస్‌డీపీ’లో ద్రవ్యలోటును 4 శాతం వరకూ అనుమతిస్తామని శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అయితే, ఇందులో 0.5 శాతాన్ని విద్యుత్‌ రంగ సంస్కరణలతో ముడిపెడుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన షరతులు 2021-22లోనే రాష్ట్రాలకు తెలియజేయబడ్డాయి.

   చివరగా తన బడ్జెట్‌ ప్రసంగంలోని ‘ఎ’ భాగాన్ని ముగిస్తూ- బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటును 6.8 శాతంగా పేర్కొన్నప్పటికీ ప్రస్తుత ఏడాదిలో సవరించబడిన ద్రవ్యలోటు జీడీపీలో 6.9 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు ఆర్థికశాఖ మంత్రి చెప్పారు. కాగా, 2022-23లో ద్రవ్యలోటును జీడీపీలో 6.4 శాతంగా అంచనా వేయగా, దీన్ని 2025-26కల్లా 4.5 శాతం కన్నా దిగువకు చేర్చేదిశగా గత సంవత్సరం ఆమె ప్రకటించిన విస్తృత ఆర్థిక ఏకీకరణ మార్గానికి అది అనుగుణంగా ఉండటం గమనార్హం. ద్రవ్యలోటు స్థాయిని 2022-23కుగాను నిర్దేశిస్తున్న సందర్భంగా ప్రభుత్వ పెట్టుబడుల ద్వారా వృద్ధికి ఊతమిస్తూ ఆర్థిక వ్యవస్థ  మరింత బలంగా, సుస్థిరంగా రూపొందాలని ఆమె పిలుపునిచ్చారు.

   నిలకడైన, అంచనాలను అందుకోగల రీతిలో ప్రకటించిన పన్ను విధానం కొనసాగింపును 2022-23 కేంద్ర బడ్జెట్‌ స్పష్టం చేసింది. అదే సమయంలో విశ్వసనీయ పన్ను వ్యవస్థను ఏర్పరచడంలో భాగంగా ఈ దార్శనికతను ముందుకు తీసుకెళ్లే మరిన్ని సంస్కరణలు తేవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ పన్నులు, సుంకాల సంబంధిత ప్రతిపాదనలను శ్రీమతి నిర్మలా సీతారామన్‌ వివరిస్తూ- పన్ను వ్యవస్థ మరింత సరళం కాగలదని.. పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా కట్టుబడి, వివాదాలు తగ్గుముఖం పట్టేవిధంగా ఉంటుందని ప్రకటించారు.

   ప్రత్యక్ష పన్ను విషయానికొస్తే- ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తప్పులు దిద్దుకుని రెండేళ్లలోగా నవీకృత రిటర్నులు దాఖలు చేసేందుకు బడ్జెట్‌ అనుమతిస్తుంది. ఇక వైకల్యం ఉన్నవారికి పన్ను నుంచి ఉపశమనం కల్పిస్తుంది. సహకార సంస్థలకు ప్రత్యామ్నాయ కనీస పన్ను శాతాన్ని, అదనపు సుంకాన్ని మరోవైపు అంకుర సంస్థలకు ప్రోత్సాహంలో భాగంగా అర్హతగల సంస్థల స్థాపన గడువును మరో ఏడాది పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ‘ఎన్‌పీఎస్‌’ ఖాతాకు యాజమాన్య వాటా చందాపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది. కొత్తగా ఏర్పాటయ్యే తయారీ రంగ సంస్థలకు పన్ను రాయితీ విధానం కింద ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించింది. వర్చువల్‌ ఆస్తుల బదిలీద్వారా లభించే ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తామని పేర్కొంది. అప్పీళ్లు పునరావృతం కాకుండా చూసేదిశగా వివాద నిర్వహణ మెరుగుకు బడ్జెట్‌ ప్రతిపాదించింది.

   రోక్ష పన్నుల అంశంలో- ప్రత్యేక ఆర్థిక మండలా(సెజ్‌)ల్లో కస్టమ్స్‌ పరిపాలన మొత్తం సమాచార సాంకేతికత (ఐటీ) చోదితంగానే ఉంటుందని కేంద్ర బడ్జెట్‌ ప్రకటించింది. మూలధన వస్తువులు, ప్రాజెక్టు దిగుమతులలో రాయితీల శాతాన్ని క్రమంగా తొలగించి, పరిమిత రీతిలో 7.5 శాతం సుంకం వర్తింపజేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా కస్టమ్స్‌ మినహాయింపులు, సుంకాల సరళీకరణను సమీక్షించాల్సిన ఆవశ్యకతను బడ్జెట్‌ గుర్తుచేసింది. ఈ మేరకు 350 వరకూ మినహాయింపులను దశలవారీగా రద్దుచేయాలని ప్రతిపాదించింది. దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీకి సౌలభ్యం కల్పిస్తూ కస్టమ్స్‌ సుంకాల శాతాలను దశలవారీగా క్రమబద్ధం చేయాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది. వ్యవసాయ రంగానికి సంబంధించి దేశీయంగా తయారయ్యే పరికరాలు, సాధనాలపై మినహాయింపుల హేతుబద్ధీకరణ చేపట్టబడుతుంది. తుక్కు ఉక్కుపై కస్టమ్స్‌ సుంకం మినహాయింపు పొడిగించనుండగా, అసమ్మిళిత ఇంధనంపై అదనపు వ్యత్యాస ఎక్సైజ్‌ సుంకం విధించబడుతుంది.

   దనపు పన్ను చెల్లించడానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులు నవీకరించిన రిటర్ను దాఖలుకు వీలుగా కొత్త నిబంధనను బడ్జెట్‌ ప్రతిపాదించింది. ఈ మేరకు సంబంధిత పన్ను మదింపు సంవత్సరం చివరినుంచి రెండేళ్లలోగా నవీకరించిన రిటర్న్‌ దాఖలు చేయవచ్చు. ఈ ప్రతిపాదనతో పన్ను చెల్లింపుదారులలో తిరిగి విశ్వాసం నెలకొంటుందని శ్రీమతి సీతారామన్‌ అన్నారు. దీనివల్ల వాస్తవ రిటర్ను దాఖలు సమయంలో పేర్కొనబడని ఆదాయాన్ని స్వచ్ఛందంగా ప్రకటించే వీలుంటుందని చెప్పారు. పన్ను చట్టాలకు స్వచ్ఛంద కట్టుబాటు దిశగా కొత్త నిబంధన ఒక నిర్ణయాత్మక ముందడుగని పేర్కొన్నారు.

   దేశంలోని సహకార సంఘాలు, కంపెనీల మధ్య సమానస్థాయి దిశగా సహకార సంఘాలకూ కనీస ప్రత్యామ్నాయ పన్నును 15 శాతానికి తగ్గించాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది. అంతేకాకుండా మొత్తం ఆదాయం రూ.1 కోటినుంచి రూ.10 కోట్లకు మించిన సహకార సంఘాలపై ప్రస్తుతం విధిస్తున్న అదనపు సుంకాన్ని 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గించే ప్రతిపాదనను ఆర్థికశాఖ మంత్రి ప్రకటించారు. ఇక దివ్యాంగుల తరఫున వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బీమా పథకంలో చేరవచ్చునని బడ్జెట్‌ ప్రతిపాదించింది. ప్రస్తుత చట్టం ప్రకారం చందాదారులు.. అంటే- తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మరణించినపుడు మాత్రమే  దివ్యాంగులకు ఏకమొత్తంగా లేదా వార్షిక చెల్లింపులు సమయంలో పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే, ఇకపై తల్లిదండ్రులు లేదా సంరక్షకులు జీవించి ఉండగానే… అంటే- వారికి 60 ఏళ్లు పూర్తికాగానే దివ్యాంగులకు ఏకమొత్తంగా లేదా వార్షికంగా సొమ్ము అందించేందుకు బడ్జెట్‌ అనుమతించింది.

   ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగి జీతంలో 14 శాతాన్ని మొదటి అంచె (టియర్‌-1) జాతీయ పెన్షన్‌ పథకం (ఎన్‌పీఎస్‌) చందాకింద చెల్లిస్తుంది. ఉద్యోగి ఆదాయం లెక్కింపు సందర్భంగా ఈ మొత్తాన్ని మినహాయింపుగా పరిగణిస్తారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యాజమాన్య చందాలో 10 శాతానికి మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల మధ్య సమానస్థాయి వర్తించేలా ఈ మినహాయింపు పరిమితిని ప్రస్తుత 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది.

   దేశంలో స్థాపన ప్రకటన నాటినుంచి పదేళ్లలోగా అంటే- 31.03.2022కు ముందు ఏర్పాటయ్యే అర్హతగల అంకుర సంస్థలకు వరుసగా మూడేళ్లపాటు పన్ను ప్రోత్సాహకం లభిస్తుంది. అయితే, కోవిడ్‌ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో పన్ను ప్రోత్సాహకం పొందడం కోసం స్థాపన వ్యవధిని మరో ఏడాదిపాటు… అంటే- 31.03.2023దాకా పొడిగించాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది.

   కొన్ని దేశీయ కంపెనీలకు అంతర్జాతీయంగా వ్యాపార పోటీతత్వ వాతావరణం కల్పన దిశగా పన్ను రాయితీ విధానం ప్రవేశపెట్టబడింది. దీనికింద కొత్తగా ఏర్పాటైన దేశీయ తయారీరంగ సంస్థలకు 15 శాతం పన్నును అమలు చేస్తుంది. ఇందులో భాగంగా సెక్షన్‌ ‘115బిఏబీ’ కింద తయారీ లేదా ఉత్పాదన ప్రారంభానికి చివరి తేదీని ఏడాదిపాటు… అంటే-2024 మార్చి 31దాకా పొడిగించాలని కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదించింది.

   వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులపై పన్నుకు సంబంధించి- ఏదైనా వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తి బదిలీ ద్వారా లభించే ఆదాయంపై 30 శాతం పన్ను విధింపునకు బడ్జెట్‌ వీలు కల్పిస్తోంది. అటువంటి ఆదాయాన్ని లెక్కించేటపుడు కొనుగోలు/సముపార్జన వ్యయం మినహా ఎలాంటి ఇతర వ్యయాలు లేదా భత్యాలకు మినహాయింపు అనుమతించబడదు. అంతేకాకుండా వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల బదిలీవల్ల ఏదైనా నష్టం సంభవిస్తే ఇతరత్రా ఆదాయాల తగ్గింపునకు సదరు నష్టం అనుమతించబడదు. ఇలాంటి లావాదేవీల వివరాలు రాబట్టడం కోసం వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తి బదిలీకి సంబంధించిన చెల్లింపులపై ‘టీడీఎస్‌’ను సదరు ఆస్తి నగదుపూర్వక విలువ పరిమితిపై 1 శాతంగా విధించాలని నిబంధన రూపొందించబడింది. అలాగే వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తిని బహుమతిగా పొందిన వ్యక్తిపై పన్ను విధించాలని కూడా ప్రతిపాదించబడింది.

   వివాదాల సమగ్ర పరిష్కార విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ- ఒక మదింపుదారు విషయంలో అధికారపరిధిగల హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో ఏదైనా కేసు సంబంధిత అంశం విచారణలో ఉన్నపుడు ఆయా న్యాయస్థానాల్లో అది పూర్తిగా పరిష్కారం అయ్యేదాకా సదరు మదింపుదారుపై పన్నుశాఖ అప్పీలు దాఖలు వాయిదాకు బడ్జెట్‌ వీలు కల్పించింది. అలాగే ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్ లేదా ఆఫ్‌షోర్ బ్యాంకింగ్ యూనిట్ జారీ చేసిన కౌంటర్ డెరివేటివ్‌ల ద్వారా ప్రవాస భారతీయులకు వచ్చే ఆదాయం, రాయల్టీ ద్వారా వచ్చే ఆదాయం,  ఓడ లీజుపై వచ్చే వడ్డీ, ఐఎఫ్‌ఎస్‌సీ ద్వారా పోర్ట్‌ ఫోలియో మేనేజ్‌మెంట్ సేవల ద్వారా లభించే ఆదాయం నిర్దిష్ట షరతులకు లోబడి పన్ను నుంచి మినహాయించబడుతుందని బడ్జెట్‌ ప్రతిపాదించింది. ఆదాయం లేదా లాభంపై విధించే అదనపు సుంకం లేదా సెస్సును వ్యాపార వ్యయంగా అనుమతించే వీల్లేదని బడ్జెట్‌ స్పష్టం చేసింది.

   న్ను ఎగవేతకు ప్రయత్నించేవారిలో నిర్దిష్టత, చట్టమంటే భయం పెంచే దిశగా ఆర్థికశాఖ మంత్రి ఒక ప్రతిపాదన తెచ్చారు. ఈ మేరకు తనిఖీ లేదా సర్వే కార్యకలాపాల్లో భాగంగా అటువంటి వ్యక్తులకు సంబంధించి వెల్లడించని ఆదాయం వెలుగుచూసినపుడు వారికి ఇతరత్రా సంభవించిన ఏదైనా నష్టాన్ని అందులోనుంచి మినహాయించే వీలుండదని స్పష్టం చేశారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల పరిధిలో కస్టమ్స్‌ పరిపాలన సంస్కరణలు చేపట్టనున్నట్లు బడ్జెట్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇకపై ఈ కార్యకలాపాలు పూర్తిగా ‘ఐటీ’ చోదితంగానే సాగుతాయని, ముప్పు ఆధారిత తనిఖీలకు మాత్రమే పరిమితమై మరింత సౌలభ్యంపై దృష్టి సారిస్తూ జాతీయ కస్టమ్స్‌ పోర్టల్‌ పనిచేస్తుందని పేర్కొంది. ఈ సంస్కరణ 2022 సెప్టెంబరు 30 నుంచి అమలులోకి రానుందని ప్రకటించింది.

   మూలధన వస్తువులు, ప్రాజెక్టు దిగుమతులలో రాయితీల శాతాన్ని క్రమంగా తొలగించి, పరిమిత రీతిలో 7.5 శాతం సుంకం వర్తింపజేయాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది. అయితే, దేశంలో తయారీ లేని అత్యాధునిక యంత్రాలకు సంబంధించి కొన్ని మినహాయింపులు కొనసాగుతాయి. మూలధన వస్తు తయారీకి దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా  ప్రత్యేక మూసలు, బాల్‌ స్క్రూలు, లీనియర్‌ మోషన్‌ గైడ్‌ వంటి ఉత్పాదక వనరులపై కొన్ని మినహాయింపులు ప్రవేశపెట్టబడతాయి. మొత్తంమీద 350కిపైగా మినహాయింపు పద్దులు రద్దుచేయబడతాయి. దేశీయ తయారీ సామర్థ్యం తగినంతగా గల వ్యవసాయ ఉత్పాదన, రసాయనాలు, దుస్తులు, వైద్య పరికరాలు, ఔషధాలు, మందులు ఈ జాబితాలో ఉన్నాయి. అదేవిధంగా వివిధ రాయితీ శాతాలకు సంబంధించి పలు నోటిఫికేషన్ల ద్వారా ప్రకటించే బదులుగా ఇకపై కస్టమ్స్‌ సుంకాల షెడ్యూలులోనే అన్నీ చేర్చబడతాయి.

   లక్ట్రానిక్స్‌ రంగంలో ధరించే, వినికిడి పరికరాలు, ఎలక్ట్రానిక్‌ స్మార్ట్‌ మీటర్ల దేశీయ తయారీకి సౌలభ్యం దిశగా గ్రేడ్లవారీ పన్ను వ్యవస్థ ఏర్పాటు కోసం కస్టమ్స్‌ సుంకం శాతాల క్రమబద్ధీకరణ చేపట్టబడుతుంది. మొబైల్‌ ఫోన్‌ చార్జర్ల ట్రాన్స్‌ ఫార్మర్‌ విడిభాగాలు, మొబైల్‌ కెమెరా మాడ్యూల్‌ లెన్స్‌, కొన్ని ఇతర వస్తువులపై సుంకంలో రాయితీలు ఇవ్వబడతాయి.

   వజ్రాలు, ఆభరణాల రంగానికి ఊపునిచ్చేందుకు కట్‌-పాలిష్డ్‌ వజ్రాలు, రాళ్లపై కస్టమ్స్‌ డ్యూటీ 5 శాతానికి తగ్గించబడింది. ఇ-కామర్స్‌ ద్వారా ఆభరణాల ఎగుమతికి వీలు కల్పిస్తూ సరళీకరించిన నియంత్రణ వ్యవస్థ ఈ ఏడాది జూన్‌ నుంచి అమలులోకి వస్తుంది. తక్కువ విలువైన అనుకరణ ఆభరణాల దిగుమతికి ప్రోత్సాహకాల రద్దు దిశగా సదరు ఆభరణాల దిగుమతిపై కస్టమ్స్‌ సుంకాన్ని కిలోకు కనీసం రూ.400 వంతున విధించాలని నిర్దేశించబడింది. ఇక మిథనాల్‌, ఎసిటిక్‌ యాసిడ్‌, పెట్రోలియం శుద్ధికి వినియోగించే భారీ ముడిపదార్థాలు వంటి కొన్ని వస్తువులపై కస్టమ్స్‌ సుంకం తగ్గించబడింది. అయితే, దేశీయ తయారీ సామర్థ్యం తగినంతగాగల సోడియమ్‌ సైనైడ్‌పై సుంకం పెంచబడింది.

   గొడుగులపై సుంకం 20 శాతానికి పెంచడంతోపాటు వాటి విడిభాగాలపై పన్ను మినహాయింపు ఉపసంహరించబడింది. దేశీయంగా తయారయ్యే వ్యవసాయ పరికరాలు, సాధనాలపై మినహాయింపు హేతుబద్ధీకరించబడింది. తుక్కు ఉక్కుపై నిరుడు అనుమతించిన కస్టమ్స్‌ సుంకం మినహాయింపు మరో ఏడాదిపాటు పొడిగించబడింది. అయితే, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, కోటెడ్‌ ఫ్లాట్‌ స్టీల్‌ ఉత్పత్తులు, అల్లాయ్‌ స్టీల్‌ కడ్డీలు, హైస్పీడ్‌ స్టీల్‌ వంటివాటిపై నిల్వ నిరోధక సుంకం, ‘సీవీడీ’ విధింపు రద్దుచేయబడింది. అలాగే ఎగుమతులకు ప్రోత్సాహకంగా కొన్ని రాయితీలు కల్పించబడ్డాయి. ఈ మేరకు హస్తకళలు, వస్త్రాలు, చర్మదుస్తులు, చర్మ పాదరక్షల ఎగుమతిదారులకు అవసరమైన అలంకరణ, ట్రిమ్మింగ్, ఫేజెనర్లు, బటన్లు, జిప్పర్, లైనింగ్ మెటీరియల్, నిర్దిష్ట చర్మం, ఫర్నిచర్ ఫిట్టింగ్‌లు, ప్యాకేజింగ్ బాక్సులు వంటివాటిపై మినహాయింపులు ఇవ్వబడతాయి. ఇక రొయ్యల ఎగుమతిని ప్రోత్సహించే దిశగా రొయ్యల సాగుకు అవసరమైన కొన్ని ఉత్పాదకాలపై సుంకం తగ్గించబడుతోంది.

   సమ్మిళిత ఇంధనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ దిశగా కృషిని ప్రోత్సహించడం లక్ష్యంగా 2022 అక్టోబరు 1వ తేదీనుంచి అసమ్మిళిత ఇంధనంపై లీటరుకు రూ.2 వంతున అదనపు వ్యత్యాస ఎక్సైజ్ సుంకం విధించబడుతుంది.

 

***(Release ID: 1794562) Visitor Counter : 942