ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాయుధ బలగాలకు సంబంధించిన పరికరాలలో ఆత్మనిర్భరతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను బడ్జెట్ పునరుద్ఘాటిస్తుంది


దేశీయ పరిశ్రమ కోసం క్యాపిటల్ ప్రొక్యూర్‌మెంట్ బడ్జెట్‌- 2021-22లో 58 శాతం నుండి 2022-23లో 68 శాతానికి కేటాయింపులు పెంపు

పరిశ్రమ, స్టార్టప్స్, అకాడెమియా కోసం తలుపులు తీరుస్తున్న రక్షణ శాఖ పరిశోధన అభివృద్ధి విభాగం

Posted On: 01 FEB 2022 1:08PM by PIB Hyderabad

దిగుమతులను తగ్గించడానికి మరియు సాయుధ దళాల పరికరాలలో ఆత్మనిర్భర్తను ప్రోత్సహించడానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ కేంద్రం ఒక కీలక అడుగు ముందుకేసింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్‌లో సమర్పించిన కేంద్ర బడ్జెట్, 2022 - 23  లో దేశీయ పరిశ్రమల కోసం మూలధన సేకరణ బడ్జెట్‌లో 68 శాతం కేటాయించింది. 2021-22లో 58 శాతం ఉంది. 

పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థల కోసం రక్షణ పరిశోధన, అభివృద్ధికి 25 శాతం బడ్జెట్‌లో కేటాయింపు జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఎస్ పి వి మోడల్ ద్వారా డిఆర్డిఓ ఇతర సంస్థల సహకారంతో మిలిటరీ ప్లాట్‌ఫారమ్‌లు మరియు పరికరాల రూపకల్పన, అభివృద్ధిని చేపట్టేందుకు ప్రైవేట్ పరిశ్రమ ప్రోత్సహిస్తుందని తెలిపారు. విస్తృత శ్రేణి పరీక్ష, ధృవీకరణ అవసరాలను తీర్చడానికి స్వతంత్ర నోడల్ అంబ్రెల్లా బాడీని ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు.

 

****


(Release ID: 1794459) Visitor Counter : 324