ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) మార్చి 2023 వరకు పొడగింపు; ఆతిథ్యం,దాని సంబంధిత సంస్థలకు మద్దతు ఇవ్వడానికి మరో రూ. 50,000 కోట్ల గ్యారెంటీ కవర్
సూక్ష్మ, చిన్నతరహాపరిశ్రమల స్కీం కొరకు పునరుద్ధరించబడ్డ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ ద్వారా ఎమ్ ఎస్ఎమ్ ఇ లకు 2 లక్షల కోట్ల అదనపు రుణ సదుపాయం
6,000 కోట్ల వ్యయంతో “ఎంఎస్‌ఎమ్‌ఈ పనితీరును మెరుగుపరచడంతో పాటు వేగవంతం చేయడం” (ర్యాంప్)కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది
ఉద్యమ్, ఈ- శ్రామ్, ఎన్.సి.ఎస్, అసీం పోర్టల్స్వంటి ఎమ్ఎస్ఎమ్ఈ లు అనుసంధానం
Posted On:
01 FEB 2022 12:51PM by PIB Hyderabad
ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS)ని మార్చి 2023 వరకు పొడిగించనున్నట్లు, దాని గ్యారెంటీ కవర్‌ను రూ. 50వేల కోట్ల నుంచి మొత్తం రూ.5 లక్షల కోట్లకు పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2022-23ను సమర్పించే సందర్భంలో తెలిపారు. అదనపు మొత్తాన్ని ఆతిథ్యం మరియు సంబంధిత సంస్థల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. ఈసిఎల్ జిఎస్ 130 లక్షల కు పైగా ఎంఎస్ ఎంఈలకు చాలా అవసరమైన అదనపు క్రెడిట్ ను అందించిందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇది మహమ్మారి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి వారికి సహాయపడింది. ఆతిథ్యం మరియు సంబంధిత సేవలు, ముఖ్యంగా సూక్ష్మ మరియు చిన్న సంస్థల ద్వారా, వారి పూర్వ మహమ్మారి స్థాయి వ్యాపారాన్ని ఇంకా తిరిగి పొందలేదు అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ప్రతిపాదన చేయబడింది. ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించిన అనేక ఇతర ప్రతిపాదనలను కూడా ఆర్థిక మంత్రి చేశారు.
పునరుద్ధరించబడ్డ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్ (సిజిటిఎమ్ఎస్ఈ) స్కీం ద్వారా అదనపు రుణ సదుపాయం
క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (CGTMSE) పథకం అవసరమైన నిధులతో పునరుద్ధరించబడుతుంది. ఇది సూక్ష్మ, చిన్న సంస్థలకు రూ.2 లక్షల కోట్ల అదనపు రుణాన్ని సులభతరం చేస్తుందని, ఉపాధి అవకాశాలను విస్తరిస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
ఎమ్ఎస్ఎమ్ఈ పనితీరును మెరుగుపరచడంతో పాటు వేగవంతం చేయడం (RAMP)
5 సంవత్సరాలకాలంలో రూ. 6,000 కోట్ల వ్యయంతో ఎమ్ఎస్ఎమ్ఈ పనితీరును మెరుగుపరచడం తో పాటు వేగవంతం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది ఎమ్ఎస్ఎమ్ఈ రంగం మరింత స్థితిస్థాపకంగా, పోటీతత్వంతో సమర్థవంతంగా మారడానికి సహాయపడుతుంది.
ఉద్యమ్, ఈ- శ్రామ్, ఎన్.సి.ఎస్, అసీం పోర్టల్స్ వంటి ఎమ్ఎస్ఎమ్ఈ లు అనుసంధానం
ఉద్యమ్,ఈ- శ్రామ్, ఎన్.సి.ఎస్, అసీం పోర్టల్స్ వంటి ఎంఎస్ఎంఈ లు ఒకదానితో ఒకటి అనుసంధానించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.. వాటి పరిధి విస్తృతం చేయబడుతుంది.. ఇప్పుడు అవి GC, BC & BB సేవలను అందించే లైవ్ ఆర్గానిక్ డేటా బేస్‌లతో క్రెడిట్ ఫెసిలిటేషన్, ఎంటర్‌ప్రెన్యూర్ అవకాశాలను మెరుగుపరచే పోర్టల్‌లుగా పని చేస్తాయన్నారు. ఈ సేవలు ఆర్థిక వ్యవస్థను మరింత లాంఛనప్రాయం చేయడానికి మరియు అందరికీ వ్యవస్థాపక అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో క్రెడిట్ ఫెసిలిటేషన్, నైపుణ్యం నియామకాలకు సంబంధించినవి.
కస్టమ్ సుంకాల హేతుబద్ధీకరణ
వివిధ ఛార్జీలను మరింత హేతుబద్ధీకరించడానికి, గొడుగులపై సుంకాన్ని 20 శాతం పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. గొడుగు విడిభాగాలపై మినహాయింపు ఉపసంహరించబడింది. భారతదేశంలో తయారు చేయబడిన వ్యవసాయ ఉపకరణాలు మరియు పరికరాలపై కూడా మినహాయింపు హేతుబద్ధీకరించబడింది. ఎంఎస్ఎంఈ సెకండరీ స్టీల్ ఉత్పత్తిదారులకు ఉపశమనం కలిగించడానికి, స్టీల్ స్క్రాప్‌పై గత సంవత్సరం ఇచ్చిన కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును మరో ఏడాది పొడిగించడం జరిగింది. స్టెయిన్‌లెస్ స్టీల్ మరియు కోటెడ్ స్టీల్ ఫ్లాట్ ఉత్పత్తులు, అల్లాయ్ స్టీల్ బార్‌లు మరియు హై-స్పీడ్ స్టీల్‌పై లోహాల అధిక ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రజా ప్రయోజనాల ధృష్ట్యా కొన్ని యాంటీ-డంపింగ్ మరియు సివిడి లు రద్దు చేయబడుతున్నాయి.
***
(Release ID: 1794276)
Visitor Counter : 410