ఆర్థిక మంత్రిత్వ శాఖ
బడ్జెట్ భారతదేశ ఆర్ధిక వ్యవస్థ కు @75 నుండి @100 వరకు పునాది
రాబోయే 25 సంవత్సరాలలో సమ్మిళిత ఆర్థిక దృష్టి ,సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత అభివృద్ధి
నాలుగు ప్రాధాన్యతలతో ఫ్యూచరిస్టిక్ , హోలిస్టిక్ బడ్జెట్
ప్రస్తుత సంవత్సరం 9.2% వృద్ధి అంచనా అన్ని ఆర్థిక వ్యవస్థలలో అత్యధికం
భారీ ప్రభుత్వ పెట్టుబడులకు మార్గనిర్దేశం చేయడానికి ప్రధానమంత్రి గతిశక్తి
బలమైన ఎదుగుదల దిశగా సబ్ కా ప్రయాస్
Posted On:
01 FEB 2022 12:54PM by PIB Hyderabad
‘‘ మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్నాం. భారతదేశం @100 వరకు 25 సంవత్సరాల సుదీర్ఘ అమృత్ కాలం లోకి లోకి ప్రవేశించాము" అని కేంద్ర ఆర్థిక , కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2022-23ను సమర్పిస్తూ అన్నారు. .@75 నుండి @100 వరకు రాబోయే 25 సంవత్సరాల అమృత్ కాలం పై ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి ఈ బడ్జెట్ పునాది వేయడానికి ,బ్లూప్రింట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని మంత్రి పేర్కొన్నారు
స్థూల ఆర్థిక స్థాయి వృద్ధిని సూక్ష్మ ఆర్థిక స్థాయితో పూర్తి చేసే సర్వ సమ్మిళిత సంక్షేమ దృష్టి; డిజిటల్ ఎకానమీ , ఫిన్ టెక్, టెక్నాలజీ ఎనేబుల్డ్ డెవలప్ మెంట్, ఎనర్జీ ట్రాన్సిషన్, క్లైమేట్ యాక్షన్ ప్రోత్సాహం; పబ్లిక్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ తో ప్రైవేట్ పెట్టుబడి నుండి క్రౌడ్-ఇన్ ప్రైవేట్ పెట్టుబడి వరకు మంచి వ్యవస్థ పై ఆధారపడటం అనేవి రాబోయే 25 సంవత్సరాలలో కొన్ని లక్ష్యాలను సాధించడం ద్వారా మన దార్శనికతను సాధించే ప్రాంతాలని ఆర్థిక మంత్రి చెప్పారు.
నాలుగు ప్రాధాన్యతలు:
ప్ర ధాన మంత్రి గ తిశ క్తి; సమ్మిళిత అభివృద్ధి; ఉత్పాదకత పెంపుదల ,పెట్టుబడి, మెరుగైన అవకాశాలు, ఇంధన మార్పు -వాతావరణ చర్య; పెట్టుబడులకు ఆర్థిక సహాయం మొదలైనవి ఈ భవిష్యత్ ,సంపూర్ణ బడ్జెట్ నాలుగు ప్రాధాన్యతలు.
ఎదుగుదల కోసం బడ్జెట్:
ప్రస్తుత సంవత్సరంలో 9.2% వృద్ధి ని అంచనా వేయడం, భారత దేశం అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో అగ్రగామిగా ఉండడం
వల్ల, ఈ భావి, సమ్మిళిత బడ్జెట్ వృద్ధికి ప్రోత్సాహాన్ని అందిస్తూనే ఉంటుందని, ఇది మన యువత , మహిళలు, రైతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్ర త్యక్ష
ప్రయోజనాన్ని కల్పించ గలుగుతుందని ఆర్థిక మంత్రి అన్నారు. బహుళ సమన్వయ విధానం ద్వారా ఆధునిక మౌలిక
సదుపాయాలకు ప్రయోజనకరమైన భారీ
ప్రభుత్వ పెట్టుబడికి ప్రధాన మంత్రి గతిశ క్తి మార్గ దర్శక శక్తిని ఇస్తుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ బలమైన పునరుద్ధరణ , రికవరీలో దేశ పటిష్ట స్థితిస్థాపకత ప్రతిబింబిస్తుందని ఆమె అన్నారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం, విస్తరణ:
వ్యాక్సినేషన్ క్యాంపైన్ వేగం , కవరేజీ ,గత 2 సంవత్సరాలలో ఆరోగ్య మౌలిక సదుపాయాలలో వేగవంతమైన అభివృద్ధి సవాళ్లను తట్టుకోవడానికి మనకు సహాయపడిందని మంత్రి అన్నారు. మనం అధిక వ్యాప్తి , తేలికపాటి లక్షణాలతో ఓమిరాన్ వేవ్ మధ్యలో ఉన్నామని ఆమె పునరుద్ఘాటించారు. 'సబ్కా ప్రయాస్' బలమైన అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించడానికి భారతదేశానికి సహాయపడుతుందని నొక్కి చెప్పారు.పేదలు అన్ని అవకాశాలను అందిపుచ్చుకునెలా
ప్రోత్సహించడానికి, అలాగే వివిధ ఆదాయ వర్గాల కిందకు వచ్చే మధ్య తరగతి ప్రజలకు అవసరమైన పర్యావరణ వ్యవస్థను అందించ డానికి నిబద్ధతను కలిగివున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
*****
(Release ID: 1794266)
Visitor Counter : 379
Read this release in:
English
,
Kannada
,
Bengali
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Malayalam