ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అమృత్ కాల్ కింద సులభతర జీవనం ప్రారంభం: కేంద్ర బడ్జెట్ 2022-23


2022-23 లో భవిష్యత్ టెక్నాలజీతో చిప్ ఆధారిత పాస్ పోర్టుల జారీ ప్రారంభం

మెరుగైన పట్టణ ప్రణాళిక కోసం భవనాల బైలాస్, టౌన్ ప్లానింగ్ పథకాల ఆధునీకరణ

సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా పట్టణ ప్రణాళిక, డిజైనింగ్ భారత్ కోణంలో రూపకల్పనకు ప్రతిపాదన
విద్యుత్ వాహనాల బాటరీల పరస్పర మార్పిడికి విధాన రూపకల్పన

Posted On: 01 FEB 2022 1:10PM by PIB Hyderabad

స్వతంత్ర భారత దేశం 75 వ ఏట నుంచి 100 వ సంవత్సరానికి ప్రయాణించటానికి ఈ బడ్జెట్ పునాది వేస్తుందని ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి నిర్మలాసీతారామన్  అన్నారు. ఆవిధంగా ఆజాదీకా అమృత్ కాల కు ఇది బ్లూ ప్రింట్ లాంటిదని అభివర్ణించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్ లో  ఈ రోజు బడ్జెట్ ప్రతిపాదిస్తూ,  అమృత్ కాల లో సులభతర జీవనం  ప్రారభానికి బాటగా  ఈ ప్రకటన చేశారు.  

ఈ క్రింది అంశాల మార్గదర్శనంలో  సులభతర జీవనం సాధించగలమని మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వివరించారు:

1.      రాష్ట్రాల చురుకైన భాగస్వామ్యం

2.      వ్యక్తిగతంగా చేపట్టే అనేక  కార్యకలాపాలను డిజిటైజ్ చేయటం

3.      ఐటీ అనుసంధానం ద్వారా కేంద్ర, రాష్ట్ర స్థాయి వ్యవస్థలను సమీకృతం చేయటం

దీనివలన న్ని రకాల పౌర సేవలూ ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. ఒకే పని మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం పోవటం తొలగిపోయి ప్రామాణీకరించటం సాధ్యమవుతుంది. 

 

Productivity enhancement and investment (Ease of Doing Business 2.0)_M2.jpg

చిప్ తో కూడిన ఈ-పాస్ పోర్టులు

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ-పాస్ పోర్టులు జారీ చేయటం మొదలవుతుందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. పాస్ పోర్ట్ లో ఒక చిప్ ను అమర్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటామన్నారు. దీనివలన విదేశాలకు వెళ్ళే పౌరులకు మరింత వెసులుబాటు కలుగుతుందని చెప్పారు.

భవనాల బై  లాస్, టౌన్ ప్లానింగ్  ఆధునీకరణ

భవనాల బై లాస్ ఆధునీకరణ. టౌన్ ప్లానింగ్ పథకం (టీపీఎస్), రవాణా ఆధారిత అభివృద్ధి (టీఓడీ) ని కూడా ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. వీటివలన పట్టణ ప్రణాళికలో సంస్కరణలు తీసుకురావటం సాధ్యమవుతుంది.  ప్రజా రవాణా వ్యవస్థతో జీవించటం, పనిచేయటానికి అవసరమైన సంస్కారణాలకు ఇది దోహదపడుతుంది.

ఈ విషయంలో కేంద్ర మంత్రి ఒక ప్రకటన చేస్తూ, ప్రజా రవాణా వ్యవస్థకు, అమృత్ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. దీనివలన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించటానికి, వాటిని అమలు చేయటానికి రాష్ట్రాలకు టీవోడీ, టీపీఎస్ ఉపయోగపడతాయన్నారు.

అర్బన్ ప్లానింగ్ లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు

అర్బన్ ప్లానింగ్, డిజైన్ లో భారతీయ పరిజ్ఞానాన్ని ఉమపయోగించుకోవటానికి, ఈ విషయమలో సర్టిఫికెట్స్ తోర్స్ కూడిన శిక్షణ ఇవ్వటానికి  వివిధ ప్రాంతాలలో ప్రస్తుతం పనిచేస్తున్న ఐదు విద్యా సంస్థలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా హోదా కల్పించాలని నిర్ణయించినట్టు శ్రీమతి నిర్మలా సీతారామన్  తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.  ఈ కేంద్రాలకు ఒకకోడానికి రూ. 250 కోట్ల ఎండోమెంట్ ఫండ్  సమకూర్చుతామని కూడా వెల్లడించారు.

బాటరీ మార్పిడి విధానం

పట్టణ ప్రాంతాలలో ఎలక్ట్రిక్ వాహనాలు తమ బాటరీలు రీఛార్జ్ చేసుకోవటానికి తగినంత స్థలం అందుబాటులో ఉండదు గనుక బాటరీలు పరస్పరం మార్చుకోగలిగేలా ఒక  విధానం రూపొందించబోతున్నట్టు  ఆర్థికమంత్రి ప్రకటించారు.   ఈ విషయంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలని, బాటరీని ఒక ఇంధన రంగ సేవగా గుర్తించాలని కూడా యోచిస్తున్నట్టు చెప్పారు.   

 

****


(Release ID: 1794250) Visitor Counter : 407