ఆర్థిక మంత్రిత్వ శాఖ

ట్యాక్స్ రిటర్న్స్‌ అప్‌డేట్ చేసేందుకు రెండేళ్ల సమయం వికలాంగులకు పన్నులో రాయితీ


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ మినహాయింపు

ఎన్‌పీఎస్‌ మినహాయింపులు 10 నుంచి 14 శాతానికి పెంపు

వర్చువల్ డిజిటల్ ఆస్తుల లావాదేవీలపై వచ్చే ఆదాయంపై 30% పన్ను

పన్ను చెల్లింపుదారులతో వివాదాల పరిష్కారానికి నూతన చర్యలు

Posted On: 01 FEB 2022 12:56PM by PIB Hyderabad

అప్‌డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు గడువును పెంచుతున్నట్లు ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల  మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఈ రోజు 2022-23 కేంద్ర బడ్జెట్ ను శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. సంబంధిత అసెస్మెంట్ సంవత్సరానికి దాఖలు చేసిన  రిటర్నులలో రెండు సంవత్సరాల లోపు అదనపు పన్ను చెల్లించి ఐటీ రిటర్నులను అప్‌డేట్ చేసుకోవచ్చునన్నారుదీనివల్ల పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయాన్ని మదింపు వేసినప్పుడు జరిగిన పొరపాటుతప్పులను  సరిదిద్దుకుని   ఐటీ రిటర్నులను అప్‌డేట్  చేసుకునేందుకు అవకాశం  కలుగుతుందని ఆర్థిక మంత్రి వివరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం ఆదాయాన్ని ఐటీ రిటర్నులో సరిగ్గా చూపలేదని ఆదాయం పన్ను శాఖ గుర్తించినప్పుడు  సుదీర్ఘమైన  ప్రక్రియను అనుసరించి తుది నిర్ణయం తీసుకోవాల్సి వస్తున్నదని ఆమె అన్నారు.  కొత్త ప్రతిపాదన పన్ను చెల్లింపుదారులపై నమ్మకాన్ని ఉంచుతుందని అన్నారు.  ఇది స్వచ్ఛంద పన్ను సమ్మతి దిశలో ఒక నిశ్చయాత్మక అడుగు " అని ఆమె వ్యాఖ్యానించారు. 

వైకల్యం ఉన్న వ్యక్తులకు పన్ను ఉపశమనం  

అంగ వైకల్యం కలిగి ఉన్న వారి పేరిట బీమా పథకం తీసుకున్న తల్లిదండ్రులు, సంరక్షకులు పథకానికి సంబంధించి ఏకమొత్తం చెల్లింపు లేదా యాన్యుటీ చెల్లించినప్పుడు  మాత్రమే మరణం తర్వాత  తల్లిదండ్రులు, సంరక్షకులకు  పన్ను  మినహాయింపు ను  చట్టం ప్రస్తుతం అందిస్తుంది. దీనితో  వారి తల్లిదండ్రులు/సంరక్షకుల జీవితకాలంలో కూడా అంగ వైకల్యం  కలిగిన వారిపై ఆధారపడిన వారికి యాన్యుటీ లేదా ఏకమొత్తం చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని శ్రీమతి సీతారామన్ తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని  తల్లిదండ్రులు/సంరక్షకుల జీవితకాలంలో అరవై ఏళ్లు నిండిన చందాదారుల పై ఆధారపడిన వికలాంగులకు యాన్యుటీ మరియు ఏకమొత్తం చెల్లింపును అనుమతించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు ఆమె  ప్రకటించారు.

రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య సమానత్వం

 

Tax Proposals.jpg

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక భద్రతా ప్రయోజనాలను పెంపొందించేందుకు  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారిని తీసుకు రావాలని నిర్ణయించామని శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎన్‌పిఎస్ ఖాతాకు యజమాని చెల్లించే మొత్తంపై  పన్ను మినహాయింపు పరిమితిని 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

వర్చువల్ డిజిటల్ ఆస్తులపై పన్ను 

 

వర్చువల్ డిజిటల్ ఆస్తులలో లావాదేవీల పరిమాణం మరియు ఫ్రీక్వెన్సీ అసాధారణంగా పెరిగాయని శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనిని దృష్టిలో “ ఏదైనా వర్చువల్ డిజిటల్ ఆస్తిని బదిలీ చేయడం ద్వారా వచ్చే ఏదైనా ఆదాయంపై 30 శాతం చొప్పున పన్ను విధించబడుతుంది ” అని సీతారామన్ ప్రకటించారు.”. సముపార్జన ఖర్చు మినహా   ఆదాయాన్ని లెక్కించేటప్పుడు  ఏదైనా ఖర్చు లేదా భత్యానికి సంబంధించి ఎలాంటి మినహాయింపులు ఈ పథకం అనుమతించదని ఆమె వివరించారు.   వర్చువల్ డిజిటల్ ఆస్తిని బదిలీ చేయడం వల్ల వచ్చే నష్టాన్ని ఏ ఇతర ఆదాయం తో భర్తీ చేయ లేమని మంత్రి అన్నారు.  లావాదేవీ వివరాలను నమోదు చేసేందుకు వర్చువల్ డిజిటల్ ఆస్తిని బదిలీ చేయడానికి సంబంధించి చేసిన చెల్లింపుపై  ఒక శాతం టీడీస్ విధించడం జరుగుతుందని అన్నారు. వర్చువల్ డిజిటల్ ఆస్తి బహుమతిగా పొందిన వ్యక్తి నుంచి కూడా  పన్ను వసూలు చేస్తామని అన్నారు. 

వివాద పరిష్కార వ్యవస్థ   

 

ఒకే విధమైన సమస్యలతో కూడిన అప్పీలు దాఖలు చేయడానికి చాలా సమయం పడుతున్నదని దీనిపై ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటున్నాయని శ్రీమతి  సీతారామన్ పేర్కొన్నారు. వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలనే  లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. పన్ను చెల్లింపుదారులు మరియు ఆదాయం పన్ను శాఖల  మధ్య పదేపదే వ్యాజ్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనిలో భాగంగా  ఒకే విధమైన వివాదానికి సంబంధించి హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ముందు అప్పీల్‌ లో ఉన్న వివాదం పరిష్కారం అయ్యే వరకు  శాఖ మరోసారి అప్పీల్‌ చేయకుండా విధంగా ప్రభుత్వం తగిన విధానాన్ని రూపొందిస్తుందని మంత్రి తెలిపారు.  

 

Tax Proposals 2.jpg

దేశంలో పన్ను చెల్లింపుదారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పన్ను చెల్లింపుతో ప్రజల సమస్యల పరిష్కారానికి ఆ కృషి చేస్తున్న ప్రభుత్వానికి పన్ను చెల్లింపుదారులు తమ వంతు సహకారాన్ని అందించారని మంత్రి అన్నారు. 

 

****

 (Release ID: 1794249) Visitor Counter : 537