ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్‌ఈ 2021-22లో “మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ఆర్థిక సాయ పథకం” కోసం రూ.15,000 కోట్ల వ్యయం


2022-23లో పెట్టుబడులను ప్రోత్సహించేలా రాష్ట్రాలకు సాయం చేయడానికి రూ.1 లక్ష కోట్లు కేటాయింపు

జీఎస్‌డీపీలో 4% ఆర్థిక లోటుకు రాష్ట్రాలకు అనుమతి

Posted On: 01 FEB 2022 1:03PM by PIB Hyderabad

‘మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ఆర్థిక సాయం పథకం’ కోసం బీఈ 2021-22లోని రూ.10,000 కోట్ల నుంచి ఆర్‌ఈ 2021-22లో రూ.15,000 కోట్లకు పెంచామని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌ చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆమె ఇవాళ పార్లమెంటుకు సమర్పించారు.

13. Providing Greater Fiscal Space to States.jpg

 

            2022-23లో, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులను ప్రోత్సహించేలా రాష్ట్రాలకు సాయం చేయడానికి రూ.1 లక్ష కోట్లు కేటాయించేందుకు ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఈ మొత్తాన్ని యాభై ఏళ్ల వరకు వడ్డీ లేని రుణాల రూపంలో రాష్ట్రాలకు అందిస్తారు. రాష్ట్రాలకు అనుమతించిన సాధారణ రుణాల కంటే ఈ మొత్తమే ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ కేటాయింపులను 'ప్రధానమంత్రి గతి శక్తి'కి సంబంధించిన పనులతోపాటు, రాష్ట్రాల ఇతర ఉత్పాదక మూలధన పెట్టుబడి కోసం వినియోగించాలి:

  • రాష్ట్రాల వాటాకు మద్దతివ్వడంతోపాటు, 'ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన' ప్రాధాన్యత విభాగాలకు అనుబంధ నిధులు
  • డిజిటల్ చెల్లింపులు, ఓఎఫ్‌సీ నెట్‌వర్క్‌ను పూర్తి చేయడం సహా ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ
  • ఉప చట్టాల రూపకల్పన, పట్టణ ప్రణాళిక పథకాలు, రవాణా ఆధారిత అభివృద్ధి, బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులకు సంబంధించిన సంస్కరణలు

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, 2022-23లో, జీఎస్‌డీపీలో 4% ఆర్థిక లోటు వరకు రాష్ట్రాలకు అనుమతిస్తామని, అందులో 0.5% విద్యుత్ రంగ సంస్కరణలతో ముడిపడి ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీని షరతులను 2021-22లోనే తెలియజేశారు.

ఉత్పాదక ఆస్తులను సృష్టించడం, పారితోషికపూర్వక ఉపాధిని కల్పించడం వంటి మూలధన పెట్టుబడులను పెంచడంలో రాష్ట్రాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీమతి సీతారామన్‌ స్పష్టం చేశారు.

 

*******



(Release ID: 1794241) Visitor Counter : 312