ప్రధాన మంత్రి కార్యాలయం

కరియప్ప గ్రౌండ్ లో జరిగిన ఎన్ సిసి పిఎమ్ ర్యాలీ ని ఉద్దేశించిప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘ఎన్ సిసి లో నేను పొందిన శిక్షణ మరియుజ్ఞానం దేశం పట్ల నా యొక్క బాధ్యతల ను నిర్వర్తించడం లో నాకు గొప్ప బలాన్ని ఇచ్చాయి’’

‘‘దేశం యొక్క సరిహద్దు ప్రాంతాల లో ఒక లక్ష మంది కొత్త కేడెట్ లను సంసిద్ధంగా ఉంచడమైంది’’

‘‘ఎన్ సిసి లో మరింత మంది అమ్మాయిల ను చేర్చుకోవడం అనేది మన కృషి గా ఉండాలి’’

‘‘దేశ ప్రజల కే మొదటి ప్రాధాన్యం అనే సంకల్పం తో ఏ దేశం యొక్క యువత ముందంజ వేస్తుందోఆ దేశాన్ని ప్రపంచం లో ఏ శక్తీ కూడాను ఆపజాలదు’’

‘‘మంచి డిజిటల్ అలవాటుల ను చేసుకోవడం లో ఎన్ సిసి కేడెట్ లు ఒక ప్రధాన పాత్రను పోషించగలుగుతారు;  మరి వారు దుష్ప్రచారాని కి మరియువదంతుల కు వ్యతిరేకం గా ప్రజల లో చైతన్యాన్ని సైతం ఏర్పరచ గలుగుతారు’’

‘‘విద్యాసంస్థల ఆవరణ లను మత్తుపదార్థాల కు తావు ఉండనటువంటివి గా తీర్చిదిద్దడం లో ఎన్ సిసి/ఎన్ఎస్ఎస్ తోడ్పడాలి’’

Posted On: 28 JAN 2022 2:30PM by PIB Hyderabad

కరియప్ప గ్రౌండు లో జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గౌరవ వందనాన్ని ప్రధాన మంత్రి పరిశీలించడం తో పాటు గా, ఎన్ సిసి దళాలు జరిపిన కవాతు ను కూడా ఆయన సమీక్షించారు. సైనిక కార్యాచరణ, స్లిదరింగ్, మైక్రోలైట్ ఫ్లయింగ్, పారా సెయిలింగ్, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాల లో ఎన్ సిసి కేడెట్ లు వారి యొక్క నైపుణ్యాల ను ప్రదర్శించడాన్ని కూడా ఆయన గమనించారు. ఉత్కృష్ట కేడెట్ లు ప్రధాన మంత్రి వద్ద నుంచి పతకాన్ని, బేటన్ ను స్వీకరించారు.

ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను దేశం జరుపుకొంటున్న వేళ ఉత్సవాల లో ఒక విభిన్న స్థాయి ఉత్సాహం తొణికిసలాడుతోందన్నారు. ఎన్ సిసి తో తనకు గల అనుబంధాన్ని ప్రధాన మంత్రి సగర్వం గా గుర్తు కు తెచ్చుకొన్నారు. దేశ ప్రజల పట్ల తనకు గల బాధ్యతల ను నెరవేర్చడం కోసం శక్తి ని ఇస్తున్న ఖ్యాతి ఎన్ సిసి కేడెట్ గా తాను పొందిన శిక్షణ కు దక్కుతుంది అని ఆయన అన్నారు.

దేశ నిర్మాణం లో లాలా లాజ్ పత్ రాయ్ గారు మరియు ఫీల్డ్ మార్శల్ కరియప్ప గారు లు అందించిన తోడ్పాటుల కు గాను ప్రధాన మంత్రి వారి కి నివాళులు అర్పించారు. ధైర్యవంతులైన ఈ ఇరువురు భారతదేశ పుత్రుల జయంతి ఈ రోజున నే కావడం గమనించదగ్గది.

కొత్త సంకల్పాల తో దేశం ముందుకు సాగిపోతున్నటువంటి కాలం లో ఎన్ సిసి ని బలోపేతం చేయడం కోసం చేపడుతున్న చర్యల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. దీనికోసం, దేశం లో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సంఘాన్ని ఏర్పాటు చేయడమైందన్నారు. గడచిన రెండు సంవత్సరాల లో, ఒక లక్ష మంది కొత్త కేడెట్ లను దేశ సరిహద్దు ప్రాంతాల లో తీర్చి దిద్దడమైందని ఆయన అన్నారు.

రక్షణ సంస్థ ల ద్వారాల ను అమ్మాయి ల కోసం, అలాగే మహిళ ల కోసం తెరచి ఉంచడం కోసం తీసుకొంటున్న నిర్ణయాల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. కేడెట్ లలో అమ్మాయి లు పెద్ద సంఖ్య లో ఉండటాన్ని ఆయన గమనించి, ఇది దేశ ప్రజల వైఖరి లో వస్తున్న మార్పునకు ఒక సంకేతం అని అభివర్ణించారు. ‘‘మీ తోడ్పాటు దేశాని కి అవసరం. మరి దీని కోసం అనేకమైన అవకాశాలు ఉన్నాయి’’ అని కేడెట్ లలోని అమ్మాయిల తో ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశం లోని కుమార్తె లు సైనిక్ స్కూళ్ళ లో ప్రవేశాలు తీసుకొంటున్నారు, మరి మహిళ లు సైన్యం లో ప్రధానమైన బాధ్యతల ను స్వీకరిస్తున్నారు అని ఆయన అన్నారు. దేశం లో కుమార్తె లు వాయుసేన లో యుద్ధ విమానాల ను సైతం నడుపుతున్నారు. ‘‘ఈ తరహా స్థితి లో మరింత మంది కుమార్తెల ను ఎన్ సిసి లోకి చేర్చుకోవాలి అనేది మన ప్రయాస కావాలి’’ అని ఆయన చెప్పారు.

కేడెట్ లలో యువత ప్రాతినిధ్యాన్ని గురించి ప్రధాన మంత్రి గమనించారు. వారి లో చాలా మంది ఈ శతాబ్ది లో జన్మించిన వారే అని ఆయన అన్నారు. దేశాన్ని 2047వ సంవత్సరం లోకి తీసుకు పోవడం లో యువత భూమిక ను గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ‘‘మీ యొక్క ప్రయాస లు, మీ యొక్క సంకల్పం, మరి ఆ సంకల్పాల ను నెరవేర్చడం..ఇవి భారతదేశం యొక్క కార్యసిద్ధి, భారతదేశం సాఫల్యం అవుతాయి’’ అని ఆయన అన్నారు. ఏ దేశం లో అయితే యువత దేశ ప్రజల కే మొదటి ప్రాధాన్యం అనేటటువంటి ఆలోచన వైఖరి తో ముందుకు సాగుతుందో అటువంటి దేశాన్ని ప్రపంచం లో ఏ శక్తి కూడాను ఆపజాలదు అని ప్రధాన మంత్రి అన్నారు. ఆట మైదానం లో మరియు స్టార్ట్-అప్ ఇకోస్పియర్ లో భారతదేశం యొక్క సాఫల్యం ఈ విషయాన్ని చాలా స్పష్టం గా వివరిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. అమృత కాలం లో అంటే, వర్తమానం నుంచి మొదలు పెడితే రాబోయే 25 సంవత్సరాల లో, దేశం యొక్క ఆకాంక్షల తో, దేశం యొక్క అభివృద్ధి తో కేడెట్ లు వారి కార్యాచరణల ను, ఆకాంక్షల ను పెనవేసుకోవాలి అని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. వోకల్ ఫార్ లోకల్ప్రచార ఉద్యమం లో నేటి యువజనులు పోషించదగిన ప్రధాన పాత్ర ను కూడా ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘భారతదేశం లో ఉండే వ్యక్తి యొక్క శ్రమ తో, స్వేదం తో రూపుదిద్దుకొన్న వస్తువుల ను మాత్రమే ఉపయోగించుదాం అని నేటి యువత సంకల్పాన్ని తీసుకొంటే గనక భారతదేశం యొక్క భవితవ్యాన్ని మార్చవచ్చును’’ అని ఆయన దృఢం గా చెప్పారు.

ప్రస్తుతం ఒక పక్క డిజిటల్ టెక్నాలజీ కి, సమాచారానికి సంబంధించి మంచి అవకాశాలు ఉంటే, మరో పక్క దుష్ప్రచారం తాలూకు అపాయాలు పొంచి ఉన్నాయి అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. మన దేశం లో సామాన్య మానవుడు ఎటువంటి వదంతి యొక్క ప్రభావం లోనూ పడకపోవడం అనేది కూడా అవసరం అని ఆయన నొక్కిచెప్పారు. దీనికి గాను ఒక చైతన్య కారకమైనటువంటి ప్రచార ఉద్యమాన్ని ఎన్ సిసి కేడెట్ లు నిర్వహించాలి అంటూ ఆయన ప్రతిపాదించారు.

ఎన్ సిసి గాని లేదా ఎన్ ఎస్ఎస్ గానీ ఉన్న పాఠశాల లోకి/కళాశాల లోకి మత్తు పదార్థాలు చేరకూడదు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. కేడెట్ లు వారంతట వారు మాదక ద్రవ్యాల జోలికి పోకూడదు, మరి అదే కాలం లో వారి విద్యాసంస్థల ఆవరణల ను డ్రగ్స్ కు తావు ఉండనివి గా తీర్చిదిద్దాలి అంటూ ఆయన సలహా ను ఇచ్చారు. ఎన్ సిసి లో లేదా ఎన్ఎస్ఎస్ లో లేనటువంటి మిత్రులు సైతం ఈ చెడు అలవాటు ను వదలి వేసేటట్లు గా వారి కి సాయం చేయండి అని ఆయన నొక్కిచెప్పారు.

దేశం లో ఉమ్మడి ప్రయాసల కు ఒక కొత్త శక్తి ని ఇవ్వడం కోసం కృషి చేస్తున్నSelf4Society పోర్టల్ తో అనుబంధాన్ని కలిగి ఉండాలి అని కేడెట్ లకు ప్రధాన మంత్రి సూచన చేశారు. ఈ పోర్టల్ తో 7 వేల కు పైగా సంస్థ లు మరియు 2.25 లక్షల మంది జతపడ్డారు.

 

***

DS/AK



(Release ID: 1793418) Visitor Counter : 162