మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
'పరీక్షా పె చర్చ 2022' 5వ ఎడిషన్‌లో పాల్గొనేందుకు నమోదు తేదీ ఫిబ్రవరి 3, 2022 వరకు పొడిగింపు
Posted On:
28 JAN 2022 12:53PM by PIB Hyderabad
'పరీక్షా పె చర్చ 2022' 5వ ఎడిషన్‌లో పాల్గొనేందుకు నమోదు తేదీ ఫిబ్రవరి 3, 2022 వరకు పొడిగించబడింది. విద్యార్తులు తమ జీవితాన్ని ఉత్సవ్‌గా నిర్వహించుకోవడానికి పరీక్షల నుండి ఉత్పన్నమయ్యే ఒత్తిడిని చర్చించి, అధిగమించడానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విదేశాల నుండి ఔత్సాహికులు మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో సంభాషించేలా చేసేందుకు ఏర్పాటు చేసిన విశిష్టమైన ఇంటరాక్టివ్ కార్యక్రమమే - 'పరీక్షా పె చర్చ. దీనిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విషయీకరించారు. ఈ కార్యక్రమం ఫార్మాట్ 2021లో మాదిరిగానే ఆన్‌లైన్ విధానంలో ఉండాలని ప్రతిపాదించబడింది. 9 నుండి 12 తరగతుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆన్‌లైన్ పోటీ ద్వారా దీనికి ఎంపిక చేయబడతారు. https://innovateindia.mygov.in/ppc-2022/లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 28 డిసెంబర్ 2021 నుండి 3 ఫిబ్రవరి, 2022 వరకు అందుబాటులో ఉంటుంది.
***
(Release ID: 1793413)
Visitor Counter : 193
Read this release in:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam