యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏషియ‌న్ గేమ్స్ స్వ్కాష్‌లో మెరుగైన ఫ‌లితాల‌ను సాధించేందుకు క్రిస్ వాక‌ర్ నియామ‌కాన్ని ఆమోదించిన మంత్రిత్వ శాఖ‌

Posted On: 24 JAN 2022 2:03PM by PIB Hyderabad

ఈ ఏడాదిలో జ‌రుగ‌నున్న ఏషియ‌న్ గేమ్స్ లో పాల్గొనున్న భార‌తీయ‌ స్క్వాష్ టీమ్కు శిక్ష‌ణ‌ను ఇచ్చేందుకు విదేశీ కోచ్ గా  ప్ర‌పంచ స్వ్కాష్ చాంపియ‌న్‌షిప్స్ లో రెండుసార్లు ప‌త‌కాన్ని సాధించిన క్రిస్ వాక‌ర్‌ను నియ‌మించేందుకు యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆమెదాన్ని తెలిపింది. స్క్వాష్‌, సైక్లింగ్‌లలో ఇంగ్లాండుకు ప్రాతినిథ్య వ‌హించిన వాక‌ర్ ను 16వారాల పాటు శిక్ష‌ణ‌ను ఇచ్చేందుకు నియ‌మిస్తారు. 

 


మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ వాక‌ర్ నియ‌మాకాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంపిక క‌మిటీ, స్వ్కాష్ రాకెట్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా సూచించాయి. మార్క్స్ కెయిన్స్‌తో క‌లిసి అత‌డు ప్రారంభ ప్ర‌పంచ డ‌బుల్స్ స్క్వాష్ చాంపియ‌న్‌షిప్‌ను అత‌డు 1997లో గెలుచుకున్నాడు. అనంత‌రం యునైటెడ్ స్టేట్స్‌లో స్థిర‌ప‌డిన అత‌డు ఆమెరిక‌న్ టీంకు జాతీయ కోచ్ స్థాయికి ఎదిగాడు. 
ప్ర‌పంచ డ‌బ‌ల్స్‌, కామ‌న్‌వెల్త్ క్రీడ‌లు, ఏషియ‌న్ క్రీడ‌ల ఉన్న ముఖ్య ఏడాదిలో భార‌తీయ టీంతో క‌లిసి ప‌ని చేయ‌డం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని ఆయ‌న పేర్కొన్నారు. నేను ఫెడ‌రేష‌న్‌తో క‌లిసి స‌న్నిహితంగా ప‌ని చేస్తాను, రానున్న పోటీల‌లో భారీయ స్క్వాష్ క్రీడాకారుల బృందం ఉత్త‌మ‌మైన స్వ్కాష్‌ను ప్ర‌ద‌ర్శించడం కోసం సంసిద్ధంగా ఉండేందుకు  వారికి సాయ‌ప‌డ‌తాను,ఈ ఏడాది రాబోయే కాలం కోసం నేను ఎదురుచూస్తున్నాన‌ని, ఆయ‌న పేర్కొన్నారు.  


అత‌డు 1993, 1996 ప్ర‌పంచ ఓపెన్ స్వ్కాష్ చాంపియ‌న్ షిప్‌ల‌లో కాంశ్య ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు. అలాగే, 1995, 1997 ప్ర‌పంచ టీం చాంపియ‌న్ షిప్‌ల‌లో ఇంగ్లాండ్ టీంలో భాగంగా ర‌జ‌త ప‌త‌కాల‌ను సాధించాడు. అత‌డికి 1998, 2002 సంవ‌త్స‌రాల‌లో జ‌రిగిన కామ‌న్ వెల్త్ క్రీడ‌ల డ‌బుల్స్ కాంశ్య ప‌త‌కాల‌ను సాధించాడు. వీటితో పాటుగా, అత‌డు 1998లో కౌలాలంపూర్ లో జ‌రిగిన కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో సైక్లింగ్‌లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. 
కాగా, భార‌తీయ మెన్స్ టీంలో ఉన్న సౌర‌వ్ ఘోషాల్‌, ర‌మిత్ టాండ‌న్‌, మ‌హేష్ మంగావ్‌క‌ర్ ఇటీవ‌లే కౌలాలంపూర్ లో జ‌రిగిన ఏషియ‌న్ టీం చాంపియ‌న్‌షిప్స్‌ల‌లో ర‌న్న‌ర్ అప్‌లుగా నిలిచారు. ఇక, జోషువా చిన్న‌ప్ప‌, సునైనా కురువిల్లా, ఊర్వ‌శి జోషి ఉమెన్స్ స్వ్కాడ్‌లో సెమీఫైన‌ల్స్‌కు చేరుకున్నారు. ఈ ఏడాది జ‌రుగ‌నున్న రెండు ప్ర‌ధాన ఈవెంట్ల‌లో మెరుగైన ఫ‌లితాల‌ను సాధించేంద‌కు భార‌త్ ఎదురుచూస్తోంది. 
కామ‌న్‌వెల్త్ క్రీడ‌లు జులై 28 నుంచి ఆగ‌స్టు 8 వ‌ర‌కు బ‌ర్మింగ్‌హాంలో జ‌రుగ‌నున్నాయి, ఏషియ‌న్ గేమ్స్ సెప్టెబ‌ర్ 10 నుంచి 25 వ‌ర‌కు చైనాలోని హాంగ్‌ఝౌలో జ‌రుగ‌నున్నాయి. 
కాగా, 2018లో జ‌రిగిన కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో డ‌బుల్స్‌లో రెండు ర‌జ‌త ప‌త‌కాల‌ను భార‌త్ సాధించింది. దీపికా ప‌ల్లిక‌ల్ కార్తీక్‌, జోషువా చిన్న‌ప్ప‌తో క‌లిసి వుమెన్ డ‌బుల్స్ గెలుచుకోగా, సౌర‌వ్ ఘోషాల్ మిక్సెడ్ డ‌బుల్స్‌లో ప‌త‌కాన్ని సాధించాడు. ఏషియ‌న్ గేమ్స్ 2018లో భార‌త్ ర‌జ‌త ప‌త‌కం (మ‌హిళా టీం) ఐదు ప‌త‌కం స‌హా మూడు ఈవెంట్ల‌లో నాలుగు కాంశ్య ప‌త‌కాల‌ను సాధించింది.
భార‌తీయ క్రీడాకారుల పిఎస్ఎ వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్‌లుః 
పురుషులుః సౌర‌వ్ ఘోషాల్ (16) ర‌మిత్ టాండ‌న్ (50), మ‌హేష్ మంగావ‌క‌ర్ (51) విక్ర‌మ్ మ‌ల్హోత్రా (71) వెల‌వ‌న్ సాయికుమార్ (122)
మ‌హిళ‌లుః జోషువా చిన్న‌ప్ప (10), త‌న్వీ ఖ‌న్నా (77) సున‌య‌న కురువిల్లా (108) ఆకాంక్ష సాలుంఖె (157) ఊర్వ‌శి జోషి (169).

***
 


(Release ID: 1792205) Visitor Counter : 123