ప్రధాన మంత్రి కార్యాలయం

నేతాజీ సుభాష్చంద్ర బోస్ 125వ జయంతి తాలూకు ఏడాది పొడవునా ఉత్సవాన్ని జరుపుకోవడానికి సూచకం గాఇండియా గేట్ వద్ద నేతాజీ తాలూకు ఒక భవ్య విగ్రహాన్ని నెలకొల్పడం జరుగుతుంది


విగ్రహం పనులుపూర్తి అయ్యేటంతవరకు, నేతాజీ యొక్క హోలోగ్రామ్ ప్రతిమ ను అదే స్థలం లో ఏర్పాటుచేస్తారు

పరాక్రమ్ దివస్ నాడు, ఇండియా గేట్లో నేతాజీ హోలోగ్రామ్ ప్రతిమ ను ఆవిష్కరించనున్న ప్రధాన మంత్రి

2019వ సంవత్సరం మొదలుకొని 2022వసంవత్సరం వరకు ‘ఆపద ప్రబంధన్ పురస్కారాల’ ను కూడా ప్రధాన మంత్రి ప్రదానంచేయనున్నారు

Posted On: 21 JAN 2022 6:34PM by PIB Hyderabad

గొప్ప స్వాతంత్ర్య యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125వ జయంతి ని స్మరించుకోవడం తో పాటు ఏడాది పొడవునా జరుపుకొనే ఉత్సవాల లో భాగం గా, ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క భవ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రానైట్ తో తయారు చేసే ఈ విగ్రహం మన స్వాతంత్ర్య పోరాటానికి నేతాజీ అందించినటువంటి అపారమైన తోడ్పాటు కు ఒక సముచితమైన శ్రద్ధాంజలి కావడమే కాకుండా, ఆయన కు దేశం రుణపడి ఉందనే భావన కు ఒక ప్రతీక గా కూడా ఉండగలదు. విగ్రహం తాలూకు పనులు పూర్తి అయ్యేటంతవరకు, నేతాజీ యొక్క హోలోగ్రామ్ ప్రతిమ ను సరిగ్గా అదే ప్రదేశం లో ఏర్పాటు చేయనున్నారు. ఇండియా గేట్ లో నేతాజీ కి చెందిన హోలోగ్రామ్ ప్రతిమ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జనవరి 23వ తేదీ న సాయంత్రం పూట ఇంచుమించు 6 గంటల వేళ కు ఆవిష్కరిస్తారు.

హోలోగ్రామ్ ప్రతిమ ను 30,000 లూమెన్ 4కె ప్రొజెక్టర్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఒక అదృశ్యమానమైన, హై గెయిన్, 90 శాతం పారదర్శకత్వం తో కూడినటువంటి హోలోగ్రఫిక్ స్క్రీన్ ను సందర్శకుల కు కనపడని విధం గా నెలకొల్పడమైంది. హోలోగ్రామ్ యొక్క ప్రభావాన్ని కలగజేయడం కోసం నేతాజీ యొక్క త్రీడీ ప్రతిబింబాన్ని ఆ తెర మీద ప్రసరింపచేస్తారు. హోలోగ్రామ్ ప్రతిమ పరిమాణం 28 అడుగుల ఎత్తు తోను, 6 అడుగుల వెడల్పు తోను ఉంది.

ఈ కార్యక్రమం లో భాగం గా జరిగే ‘సుభాష్ చంద్ర బోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాల’ ప్రదాన ఉత్సవం లో 2019, 2020, 2021 ఇంకా 2022 సంవత్సరాల కు గాను ఆ పురస్కారాలను సైతం ప్రధాన మంత్రి ప్రదానం చేయనున్నారు. మొత్తం మీద ఏడు పురస్కారాల ను అందజేయడం జరుగుతుంది.

కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ రంగం లో భారతదేశం లోని వివిధ వ్యక్తుల ద్వారా, సంస్థల ద్వారా అందిన అమూల్యమైనటువంటి తోడ్పాటు ను మరియు నిస్వార్థమైనటువంటి సేవ ను గుర్తించడం కోసమూ, గౌరవించడం కోసమూ ఏటా ‘సుభాష్ చంద్ర బోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాల’ ను ప్రవేశపెట్టింది. ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీ నాడు ఈ పురస్కారాల ను ప్రకటించడం జరుగుతుంది. ఈ పురస్కారాల లో భాగం గా ఏదైనా సంస్థ విషయం లో అయితే 51 లక్షల రూపాయల నగదు బహుమతి తో పాటు ఒక ధ్రువ పత్రాన్ని, అదే ఏదైనా వ్యక్తి విషయం లో అయితే ఆ వ్యక్తి కి 5 లక్షల రూపాయల నగదు తో పాటు ఒక ధ్రువ పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది.

స్వాతంత్ర్య యోధుల ను సముచిత రీతి న గౌరవించాలనేది ప్రధాన మంత్రి నిరంతర ప్రయాస గా ఉంటూ వస్తోంది. ఈ ప్రయత్నాల లో భాగం గా ప్రత్యేకించి స్వాతంత్ర్య సేనానుల లో ప్రముఖుడు, దూరదర్శి నాయకుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విషయం లో శ్రద్ధ ను వహించడం జరిగింది. ఈ విషయంలో అనేక చర్యల ను చేపట్టడమైంది. వీటి లో, ఆయన జయంతి ని ఏటా ‘పరాక్రమ్ దివస్’ గా నిర్వహించడం జరుగుతుంది. ఇదే భావన తో, గణతంత్ర దినం తాలూకు ఉత్సవాల ఆరంభం ఒక రోజు ముందు గానే అంటే జనవరి 23 నుంచే జరుగనుంది.

***

 



(Release ID: 1791863) Visitor Counter : 235