ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్రాలకు 47,451 కోట్ల రూపాయలను ముందస్తు పన్ను బకాయిలుగా విడుదల చేసేందుకు ఆమోదం తెలిపిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్


2022 జనవరి నెలలో 95,082 కోట్ల రూపాయలను అందుకోనున్న రాష్ట్రాలు

2వ ముందస్తు వాయిదా విడుదలతో బడ్జెట్ మొత్తానికి మించి పన్ను బకాయిలుగా అదనంగా 90,082 కోట్ల రూపాయలను అందుకోనున్న రాష్ట్రాలు

Posted On: 20 JAN 2022 1:05PM by PIB Hyderabad
రాష్ట్రాలకు ముందస్తు పన్ను బకాయిలుగా 47,451 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఆమోదం తెలిపారు. జనవరి నెల సాధారణ  పన్ను బకాయిల మొత్తానికి అదనంగా ఈ రోజు విడుదల చేసిన మొత్తాన్ని రాష్ట్రాలకు అందించడం జరుగుతుంది. 
ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రాలకు జనవరి నెలలో కేంద్రం నుంచి మొత్తం 95,082 కోట్ల రూపాయలు పన్ను బకాయిలుగా అందుతాయి. జనవరి నెలకు రాష్ట్రాలకు అందే సాధారణ  మొత్తానికి రెండింతలు ఎక్కువగా  ఈ నెలలో నిధులు అందుతాయి. 
రాష్ట్రాల వారీగా విడుదల అయిన పన్ను  బకాయిల వివరాలు కొండా పొందుపరచడం జరిగింది. 
పన్ను బకాయిల మొదటి విడతను కేంద్ర ప్రభుత్వం 2021 నవంబర్ నెలలో విడుదల  చేసింది. 2021 నవంబర్ 22న పన్ను బకాయి మొత్తం మొదటి విడతగా రాష్ట్రాలకు కేంద్రం 47,541 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రెండవ విడత బకాయిలు విడుదల కావడంతో కేంద్రం నుంచి రాష్ట్రాలకు మొత్తం 90,082 కోట్ల రూపాయలు అందినట్టు అవుతుంది. 2022 జనవరి నెల వరకు కేటాయించిన బడ్జెట్ నిధులకు అదనంగా ఈ నిధులు అందుతాయి. 
జీఎస్టీ వల్ల కలిగిన నష్టానికి పరిహారంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు కేంద్రం 1.59 లక్షల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి అంగీకరించింది. 2021 అక్టోబర్ నాటికి ఈ నిధుల విడుదల పూర్తి అయ్యింది. 
కోవిడ్-19 వల్ల కలిగిన తీవ్ర ప్రతికూల ప్రభావానికి గురైన రాష్ట్రాలకు ఆదుకుని వాటికి  మూలధన, పెట్టుబడి నిధులను అందించేందుకు అమలు చేస్తున్న ఉపశమన చర్యల్లో భాగంగా కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. 

రాష్ట్రాల వారీగా జనవరి 2022 లో కేంద్ర పన్నులు, సుంకాల్లో రాష్ట్ర నికర వాటా  

 

 

క్ర.సం. సంఖ్య

రాష్ట్రం

జనవరి 2022 సాధారణ  నెలవారీ వాయిదా

జనవరి 2022లో ముందస్తు వాయిదా

జనవరి 2022లో మొత్తం విడుదలలు

 

 

 

 

1

ఆంధ్రప్రదేశ్

1,923.98

1,923.98

3,847.96

 

2

అరుణాచల్ ప్రదేశ్

835.29

835.29

1,670.58

 

3

అస్సాం

1,487.08

1,487.08

2,974.16

 

4

బీహార్

4,781.65

4,781.65

9,563.30

 

5

ఛత్తీస్‌గఢ్

1,619.77

1,619.77

3,239.54

 

6

గోవా

183.51

183.51

367.02

 

7

గుజరాత్

1,653.47

1,653.47

3,306.94

 

8

హర్యానా

519.62

519.62

1,039.24

 

9

హిమాచల్ ప్రదేశ్

394.58

394.58

789.16

 

10

జార్ఖండ్

1,572.17

1,572.17

3,144.34

 

11

కర్ణాటక

1,733.81

1,733.81

3,467.62

 

12

కేరళ

915.19

915.19

1,830.38

 

13

మధ్యప్రదేశ్

3,731.96

3,731.96

7,463.92

 

14

మహారాష్ట్ర

3,003.15

3,003.15

6,006.30

 

15

మణిపూర్

340.40

340.40

680.80

 

16

మేఘాలయ

364.64

364.64

729.28

 

17

మిజోరం

237.71

237.71

475.42

 

18

నాగాలాండ్

270.51

270.51

541.02

 

19

ఒడిశా

2,152.66

2,152.66

4,305.32

 

20

పంజాబ్

859.08

859.08

1,718.16

 

21

రాజస్థాన్

2,864.82

2,864.82

5,729.64

 

22

సిక్కిం

184.47

184.47

368.94

 

23

తమిళనాడు

1,939.19

1,939.19

3,878.38

 

24

తెలంగాణ 

999.31

999.31

1,998.62

 

25

త్రిపుర

336.66

336.66

673.32

 

26

ఉత్తర ప్రదేశ్

8,528.33

8,528.33

17,056.66

 

27

ఉత్తరాఖండ్

531.51

531.51

1,063.02

 

28

పశ్చిమ బెంగాల్

3,576.48

3,576.48

7,152.96

 

 

మొత్తం 

47,541.00

47,541.00

95,082.00

 

 

***


(Release ID: 1791256) Visitor Counter : 154