ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీమరియు మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ కుమార్ జగన్నాథ్ లు వివిధ పథకాల ను సంయుక్తంగా ప్రారంభించనున్నారు
Posted On:
19 JAN 2022 8:16PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ కుమార్ జగన్నాథ్ లు కలసి 2022వ సంవత్సరం జనవరి 20వ తేదీ నాడు సాయంత్రం పూట సుమారు 4 గంటల 30 నిమిషాల వేళ కు మారిశస్ లో భారతదేశం సహాయాన్ని అందించినటువంటి సామాజిక గృహ యూనిట్ ల పథకాన్ని వర్చువల్ పద్ధతి న ప్రారంభించనున్నారు. ఇద్దరు ప్రముఖులు మారిశస్ లో సివిల్ సర్వీస్ కాలేజీ ని మరియు 8 మెగావాట్ సామర్థ్యం కలిగిన సోలర్ పివి ఫార్మ్ ప్రాజెక్టుల కు కూడా ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల ను భారతదేశం అందించిన అభివృద్ధి సంబంధి సహాయం తో చేపట్టడం జరుగుతున్నది.
మారిశస్ లో మెట్రో ఎక్స్ ప్రెస్ ప్రాజెక్టు కు మరియు ఇతర మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కై భారతదేశం నుంచి 190 మిలియన్ యుఎస్ డాలర్ విలువైన ఒక లైన్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఒసి) మంజూరు కు సంబంధించినటువంటి ఒక ఒప్పందం తో పాటు చిన్న అభివృద్ధి పథకాల అమలు కు ఉద్దేశించినటువంటి ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) ను కూడా ఈ సందర్భం లో ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది.
(Release ID: 1791185)
Visitor Counter : 169
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam