గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
'ఓపెన్ డేటా వీక్'ని ప్రారంభించిన కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
స్మార్ట్ సిటీస్ ఓపెన్ డేటా పోర్టల్‌లో అధిక నాణ్యతతో డేటాసెట్‌లు మరియు డేటా బ్లాగ్‌లను ప్రచురించనున్న 100 స్మార్ట్ సిటీలు
Posted On:
17 JAN 2022 12:56PM by PIB Hyderabad
స్మార్ట్ సిటీల్లో ఓపెన్ డేటా వినియోగం, ప్రోత్సహించి, పట్టణ ప్రాంతాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కేంద్ర గృహ నిర్మాణం,పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ' ఓపెన్ డేటా వీక్' కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. 2022 ఫిబ్రవరి నెలలో సూరత్ లో మంత్రిత్వ శాఖ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' లో భాగంగా స్మార్ట్ సిటీస్: స్మార్ట్ అర్బనైజేషన్' అనే అంశంపై సదస్సును నిర్వహించనున్నది. సదస్సు నిర్వహణకు సన్నాహకంగా ;ఓపెన్ డేటా' వినియోగాన్ని ఎక్కువ చేసే విధంగా 'ఓపెన్ డేటా వీక్'ని నిర్వహించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 'ఓపెన్ డేటా వీక్' ను 2022 జనవరి 17 నుంచి 21 వ తేదీ వరకు నిర్వహిస్తారు.
కార్యక్రమంలో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన 100 స్మార్ట్ నగరాలు పాల్గొంటాయి. ఓపెన్ డేటా పోర్టల్ లో కార్యక్రమంలో పాల్గొనే 100 స్మార్ట్ నగరాలు అధిక నాణ్యత కలిగిన డేటా సెట్లను, డేటా బ్లాగులను పొందుపరుస్తాయి. ప్రస్తుతం ఈ పోర్టల్ లో 3,800 కి పైగా డేటా సెట్లు, వివరణాత్మక 60 డేటా అంశాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని సంబంధిత వర్గాలు విశ్లేషించి తమ అవసరాలకు అనుగుణంగా చర్యలు అమలు చేసేందుకు అవకాశం కల్పించారు.
ఓపెన్ డేటా వినియోగం వల్ల సామర్థ్యం, పారదర్శకత, ఆవిష్కరణ అంశాల్లో కనిపించిన మెరుగుదల, ఆర్థికాభివృద్ధి తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో 2022 జనవరి 17 నుంచి 20 వరకు స్మార్ట్ నగరాలు తమ సమాచారాన్ని, భవిష్యత్ ప్రణాళికలు, ఏపిఐ, డేటా బ్లాగులను పోర్టల్ లో పొందుపరుస్తాయి. 2022 జనవరి 21 వ తేదీన స్మార్ట్ నగరాల ఆధ్వర్యంలో 'డేటా డే' ను నిర్వహించడం జరుగుతుంది.
'డేటా డే' లో భాగంగా దేశం వివిధ ప్రాంతాలలో స్మార్ట్ నగరాలుగా గుర్తింపు పొందిన నగరాల్లో చర్చలు, సదస్సులు, ప్రదర్శనలు, , హ్యాకథాన్‌ల నిర్వహణతో పాటు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు, అంకుర సంస్థలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కోవిడ్-19 లాంటి క్లిష్ట పరిస్థితులను సమాచార వినియోగంతో ఈ విధంగా ఎదుర్కోవచ్చునన్న అంశంపై వివిధ వర్గాలకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
సమాచార వ్యాప్తిపై అవగాహన కల్పించి వివిధ వర్గాలను ఛైతన్యం చేయాలన్న ప్రధాన లక్ష్యంతో కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. నాణ్యమైన సమాచారం అందుబాటులోకి వస్తే వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది. సమాచార వినియోగం వల్ల జ్ఞాన సముపార్జన, నూతన అంశాల ఆవిష్కరణ, నూతన రంగాల అభివృద్ధి సాధ్యమవుతుంది. దీనివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సామాన్య సమస్యలను సులువుగా పరిష్కరించేందుకు ప్రభుత్వానికి అవకాశం కలుగుతుంది. ఒక ప్రాంతంలో విజయవంతంగా అమలు జరిగిన విధానాలను ఇతర ప్రాంతాల్లో అమలు చేసేందుకు వీలవుతుంది.
కార్యక్రమంలో పాల్గొనడానికి 100 స్మార్ట్ సిద్ధమవుతున్నాయి. భారత నగరాలను ' డేటా స్మార్ట్' గా మార్చే అంశంలో కలిసి పనిచేయడానికి ఈ నగరాలు సన్నద్ధమవుతున్నాయి. పోర్టల్ https://smartcities.data.gov.in/లో అందుబాటులో ఉంది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గురించి
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశం, దేశ ప్రజల, సంస్కృతి మరియు విజయాలను గుర్తు చేసుకుని, స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం యొక్క చొరవ. ఈ మహోత్సవ్ భారతదేశాన్ని దాని పరిణామ ప్రయాణంలో ఇంతవరకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా, భారతదేశం 2.0ని సక్రియం చేయాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టిని ప్రారంభించే శక్తిని మరియు సామర్థ్యాన్ని కలిగి ఉన్న భారతదేశ ప్రజలకు అంకితం చేయబడింది. ఆత్మనిర్భర్ భారత్.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఒక
75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశం, దేశ ప్రజలు, సంస్కృతి సాధించిన విజయాలను గుర్తు చేసుకుని చరిత్రను స్మరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తోంది. అభివృద్ధి పరిణామ ప్రయాణంలో భారతదేశాన్ని ఇంతవరకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి ఈ ఉత్సవాలను అంకితం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం కృషి చేస్తూ తమ శక్తిని మరియు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న దేశ ప్రజలకు అంకితం చేయబడింది.
భారతదేశ సామాజిక-సాంస్కృతిక, రాజకీయ మరియు ఆర్థిక రంగాల్లో దేశం సాధించిన ప్రగతిశీల అభివృద్ధి అద్దం పట్టే విధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలకు రూపకల్పన జరిగింది. 2021 మార్చ్ 12 న “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవానికి 75 వారాల కౌంట్‌డౌన్ ప్రారంభమయింది. వేడుకలు ఒక సంవత్సరం తర్వాత 15 ఆగస్టు 2022న ముగుస్తాయి.
***
(Release ID: 1790581)
Visitor Counter : 275