ప్రధాన మంత్రి కార్యాలయం
మకర సంక్రాంతి.. ఉత్తరాయణం.. భోగి.. మాఘ్ బిహు.. పొంగల్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
14 JAN 2022 9:18AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలనుద్దేశించి వరుస ట్వీట్లద్వారా ఇచ్చిన సందేశంలో-
“భారతదేశంలో ఉజ్వల సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటే వివిధ పండుగలు చేసుకుంటున్నాం. ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు. తదనుగుణంగా ఆయా పండుగ చేసుకుంటున్న ప్రజలకు ప్రత్యేకంగా సందేశం పంపారు.
“మకర సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు.”
https://t.co/4ittq5QTsr
“ఉత్తరాయణం పండుగను వైభవంగా నిర్వహించుకోండి.”
https://t.co/hHcMBzBJZP
“అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పర్వదినం మన సమాజంలో ఆనంద స్ఫూర్తిని సుసంపన్నం చేయాలి. ఈ మేరకు నా దేశ పౌరులందరికీ చక్కని ఆరోగ్యం-శ్రేయస్సు కలగాలని ఆ దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.”
https://t.co/plBUW3psnB
“మీకందరికీ మాఘ్ బిహు శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం ఇనుమడింపజేయాలని, సౌభాగ్యం ప్రసాదించాలని నేను ఆ సర్వేశ్వరుణ్ని ప్రార్థిస్తున్నాను.”
https://t.co/mEiRGpHweZ
“తమిళనాడు ఉజ్వల సంస్కృతిలో పొంగల్ పండుగ అంతర్భాగం. ఈ ప్రత్యేక సందర్భంలో ప్రతి ఒక్కరికీ.. ముఖ్యంగా ప్రపంచం అంతటాగల తమిళ ప్రజానీకానికి నా శుభాకాంక్షలు. ప్రకృతితో మన అనుబంధంతోపాటు సమాజంలో సోదర భావం అనంతంగా వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
https://t.co/FjZqzzsLhr
***
DS/SH
(Release ID: 1789864)
Visitor Counter : 181
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam