గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట 30 రకాల కార్యక్రమాలు


‘స్మార్ట్ నగరాలు, స్మార్ట్ పట్టణీకరణ’ సదస్సుతో
సూరత్ నగరంలో వైభవోపేతంగా ముగింపు..

కార్యక్రమాలపై వివరణతో బ్రోచర్.ను
ఆవిష్కరించిన హర్.దీప్ సింగ్ పూరి..

పట్టణ పౌరుల ఉత్తమ శ్రేణి జీవన ప్రమాణాలకు
ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ

Posted On: 11 JAN 2022 4:13PM by PIB Hyderabad

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు జరుపుకుంటున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివిధ రకాల 30 కార్యక్రమాలను, కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది మార్చిలో ప్రారంభించారు. 2022 ఆగస్టులో జరిగే 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవానికి 75 వారాల కౌంట్ డౌన్ గా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకలు వచ్చే ఏడాది (2023) ఆగస్టు వరకూ జరుగుతాయి.

   కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ రకాల కార్యక్రమాల్లో భాగంగా, ‘స్మార్ట్ నగరాలు, స్మార్ట్ పట్టణీకరణ’పై  ఒక సచిత్ర ప్రచార పత్రాన్ని (బ్రోచర్.ను) లాంఛనంగా విడుదల చేశారు. ఈ రోజు జరిగిన మీడియా కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్.దీప్ సింగ్ పూరి ఈ బ్రోచర్.ను వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించారు.

https://ci3.googleusercontent.com/proxy/ybu2fdj4qElG9-fL8yjViOwSsAhnwe7FTxUkLQ4fooNOY25Md-q2L_HPKt8bY4tLHsXdbG42Iuw7RwLqZBK_a7jpTPqbtqFsi2iQjGCm4YEd-8NQwhNvXv_esw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00136X3.jpg

   ఈ సందర్భంగా, కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, చారిత్రాత్మకంగా జరుగుతున్న 75వ  స్వాతంత్ర్య వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు జరుపుకునేందుకు దేశ ప్రజలంతా మమేకం కావడం ఎంతో సముచితంగా ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారతదేశంలో కేవలం 17శాతంమంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసించేవారని, అయితే, ఈ రోజున పట్టణాల్లో నివసించే వారి సంఖ్య రెండు రెట్లు దాటిందని అన్నారు. పట్టణ జీవనానికి సంబంధించిన మూడు ముఖ్యమైన అంశాలకు వర్తించేలా తమ మంత్రిత్వ శాఖ ప్రజాప్రయోజన వ్యూహంతో కార్యక్రమాలను చేపడుతోందన్నారు. జీవనయోగ్యత, ఆర్థిక సామర్థ్యం, సుస్థిరత్వం వంటి మూడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా అన్ని ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలను చేపడుతున్నట్టు చెప్పారు. పౌరులకు ఉన్నత శ్రేణి ప్రమాణాలతో జీవన అవకాశాన్ని కలిగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని ఆయన వివరించారు. 

   ప్రజల భారీ స్థాయి భాగస్వామ్యంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను తమ మంత్రిత్వ శాఖ చేపడుతోందని, అదే లక్ష్యంతోనే వివిధ కార్యక్రమాలను రూపొందించిందని అన్నారు. ఈ కార్యక్రమాలు సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రధానంగా చూపడమేకాక, భవిష్యత్ ఆశయాలను, సృజనాత్మక కార్యక్రమాలను సూచిస్తున్నాయని అన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ కార్యక్రమాలకు పౌరులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, పారిశ్రామిక రంగం, విద్యా సంస్థలు, స్టార్టప్ కంపెనీలనుంచి, ఇతర రంగాలనుంచి విశేష స్థాయిలో స్పందన వెల్లువెత్తుతోందని కేంద్రమంత్రి అన్నారు.

  ఈ రోజు ఆవిష్కరించిన బ్రోచర్ (https://smartnet.niua.org/azadi-ka-amrit-mahotsav)  ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ నెల ఒకటవ తేదీనుంచి 31వరకూ, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో జరుగుతున్న 30 ప్రధాన కార్యక్రమాలపై వివరణలతో సచిత్రంగా ఈ బ్రోచర్.ను రూపొందించారు. (కార్యక్రమాల జాబితాను అనుబంధం-1లో చూడవచ్చు.)

https://ci4.googleusercontent.com/proxy/9dqzu92SKMBoqDTk-TokwIVyrNaexpcTXPK5WO2DBXQSq02BEpyfI-7-43HORsOm2_tOF-Vdtg-1IOWxCi6t_r_VTLaJ0SgdJJGa1m-RlWlrJKff9dLPWGlwnQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00211RA.jpg

   ‘స్మార్ట్ నగరాలు, స్మార్ట్ పట్టణీకరణ’ పేరిట జరిగే సదస్సుతో ఈ కార్యక్రమాలన్నీ వైభవోపేతంగా ముగుస్తాయి. ఈ సందర్భంగా ఆరు ప్రధాన కార్యక్రమాలను సూరత్.లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను వచ్చే నెల 4,5 తేదీల్లో చేపట్టాలని తాత్కాలికంగా నిర్ణయించారు. దేశంలో కోవిడ్-19 వైరస్ వ్యాప్తి పరిస్థితిని బట్టి ఈ కార్యక్రమాల నిర్వహణ ఆధారపడి ఉంటుంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలసి నిర్వహించబోయే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలకు సంబంధించి దృష్టిని కేంద్రీకరించాల్సిన ప్రతి కార్యక్రమంపై పాఠకులను కార్యోన్ముఖం చేస్తూ ఈ బ్రోచర్.కు రూపకల్పన చేశారు. ( బ్రోచర్.ను అనుబంధం-2లో పొందుపరిచారు).

  అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలకు సంబంధించి ఐదు ఇతివృత్తాలను ప్రతిబింబిస్తూ ఈ వేడుకలను నిర్వహిస్తారు.  స్వాతంత్ర్య సమరం, కార్యాచరణలు@75, విజయాలు@75, భావనలు@75, తీర్మానాలు@75 పేరిట ఐదు ఇతివృత్తాలతో ఈ కార్యక్రమాలను చేపడతారు. ఈ నెల ఒకటవ తేదీన మొదలైన ఈ కార్యక్రమాలకు పౌరులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, పారిశ్రామిక రంగం, విద్యా సంస్థలు, స్టార్టప్ కంపెనీలనుంచి, ఇతర రంగాలనుంచి విశేష స్థాయిలో సానుకూల స్పందన వెల్లువెత్తుతోంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో 3 లక్షలమందికిపైగా పౌరులు పాలుపంచుకోవచ్చని భావిస్తున్నారు.

  కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మిశ్రమ పద్ధతిలో కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించుకుంది. డిజిటల్, వర్చువల్ పద్ధతిలోనే ఈ కార్యక్రమాల నిర్వహణకు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే ప్రారంభమైన నాలుగు కార్యక్రమాలకు ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోంది. కార్యాచరణ, పరిశోధన దిశగా, జి.ఐ.ఎస్. హ్యాకథాన్, స్మార్ట్ నగరాలు, విద్యాసంస్థలు, లేదా, పట్టణ సృజనాత్మక ఆవిష్కరణల్లో ఉత్తమ పద్ధతులకోసం వివిధ విద్యాసంస్థల సహకారం, వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహనా కార్యక్రమం, ఫ్రీడమ్ టు వాక్, సైకిల్ వంటి కార్యక్రమాలకు ఎంతో స్పందన లభించింది. జనం ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

  జి.ఐ.ఎస్. హ్యాకథాన్, పట్టణ భౌగోళిక రేఖా సమాచార గాధలు, చాలెంజ్-2022 కార్యక్రమానికి 900మందికి పైగా హాజరయ్యారు. ఫ్రీడమ్ టు వాక్, సైకిల్ కార్యక్రమంలో 15వేలమదికి పైగా పాల్గొన్నారు. ఈ నెల 6న జరిగిన, కార్యాచరణ, పరిశోధన దిశగా స్మార్ట్ సిటీలు, విద్యాసంస్థలు (ఎస్.ఎ.ఎ.ఆర్.) కార్యక్రమం కింద ఆన్ లైన్ ద్వారా ఒక సమావేశాన్ని నిర్వహించారు. 15 కళాశాలలు/విశ్వవిద్యాలయాలు, 47నగరాలు, జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ (ఎన్.ఐ.యు.ఎ.), ఈ సమావేశంలో పాలుపంచుకున్నాయి. స్మార్ట్ నగరాల పథకం కింద చేపట్టబోయే 75 ప్రాజెక్టులకు డాక్యుమెంటరీ రూపం కల్పించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. దీనికి తోడు, గత ఏడాది డిసెంబరు 27వ తేదీన ప్రారంభమైన వాతావరణ అవగాహనా కార్యక్రమం,. వంద స్మార్ట్ నగరాల్లోని లక్షమందికి చేరువ కావచ్చని భావిస్తున్నారు.

 

 “చారిత్రాత్మక 75వ భారత స్వాతంత్ర్య వార్షికోత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట వేడుకలు జరుపుకునేందుకు దేశప్రజలంతా ఉత్సాహంతో మమేకం కావడం ఎంతో సముచితం. ఈ వేడుకలకోసం కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా తన వంతు భాగస్వామ్యాన్ని అందిస్తోంది. పట్టణాభివృద్ధి ప్రక్రియలో ప్రభావవంతమైన కార్యాచరణను,  విజయాలను స్మరించుకోవడం ద్వారా పలు కార్యకలాపాలు చేపడుతోంది. సౌకర్యవంతమైన ప్రజా జీవనం లక్ష్యంగా చైతన్యవంతమైన, సమ్మిళిత పట్టణ ప్రాంతాల రూపకల్పనకు వీలుగా భారతదేశపు సమైక్య స్ఫూర్తిని, దార్శనికతను ప్రతిబింబిస్తూ  అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.”

హర్ దీప్ సింగ్ పూరి

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి

 

“భారతదేశ నగరాల్లో చోటుచేసుకుంటున్న మౌలిక సదుపాయ, జీవనశైలి పరమైన డిజిటల్ పరివర్తనను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ప్రతిఫలింప జేస్తున్నాయి. పట్టణ, నగర ప్రాంతాల్లోని పౌరులు మరింత మెరుగైన జీవన ప్రమాణాలను సాధించేందుకు, సుదీర్ఘకాలం ప్రగతిని సాధించేందుకు ఈ కార్యక్రమాలన్నీ అండగా నిలుస్తాయి.”

మనోజ్ జోషీ

కార్యదర్శి, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్..

  దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశాన్ని, వైభవోపేతమైన దేశ చరిత్రను, ప్రజల సంస్కృతిని,  ఇతర విజయాలను వివరిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పరిణామ క్రమంలో భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన విభిన్న జీవన రంగాల ప్రజలకు ఈ కార్యక్రమాలను అంకితమిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వావలంబనతో కూడిన ఆత్మనిర్భర భారత్ కలను సాకారం చేసే లక్ష్యంతో ఈ వేడుకలను చేపట్టారు.

   ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది, భారతీయ సామాజిక, సాంస్కృతిక రాజకీయ, ఆర్థిక అస్థిత్వానికి ప్రతిరూపం. “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమాల వాస్తవ పయనం గత ఏడాది మార్చి 12న ప్రారంభమైంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ముగియనున్న 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాలకు 75 వారాల కౌంట్ డౌన్ రూపంలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు.

************

 

 

అనుబంధం- I

2022 జనవరి 1నుంచి 31వ తేదీవరకూ నిర్వహించే వివిధ కార్యక్రమాల జాబితా

క్రమ సంఖ్య

కార్యక్రమం పేరు

కార్యక్రమం జరిగే  తేదీ(లు)

1.

జి.ఐ.ఎస్. హ్యాకథాన్: పట్టణ భౌగోళిక రేఖా సమాచార గాథలపై సవాలు 2022

1-17 జనవరి

2.

పౌరులకు, నగర నేతలకు ఫ్రీడం ట వాక్, సైకిల్ చాలెంజ్

1-26 జనవరి

3.

కార్యాచరణ, పరిశోధన దిశగా స్మార్ట్ సిటీలు, విద్యా సంస్థలు (ఎస్.ఎ.ఎ.ఆర్.)

జనవరి 1నుంచి..

4.

వాతావరణ మార్పులపై అవగాహనా కార్యక్రమం

1-26 జనవరి

5.

చైతన్య గుజరాత్: పి.పి.పి. రోడ్ షోలు

8 జనవరి*,

17-30 జనవరి

6.

పి.ఎం.ఎ.వై-యు పథకానికి అతీతంగా- ప్యానెల్ చర్చ

10-15 జనవరి

7.

ఆరోగ్యవంతమైన నగరాలపై సంప్రదింపుల చర్చాగోష్టి

12 జనవరి

8.

ప్లేస్ మేకింగ్ మారథాన్ 2.0

15-26 జనవరి

9.

మురికివాడల రహిత నగరాలపై ప్యానెల్ చర్చ

16-20 జనవరి

10.

ఓపెన్ డేటా వీక్ (1వ భాగం)

17-21 జనవరి

11.

ఓపెన్ డేటా వీక్ (2వ భాగం)

17-21 జనవరి

12.

పుణె మెట్రో రీచ్-1, 2 భాగాల ప్రారంభోత్సవం

17-31 జనవరి

13.

పది నగరాలకోసం అర్బన్ స్టార్టప్ అడ్డాలు

17-31 జనవరి

14.

పట్టణ నిర్వాసితులకోసం శీతాకాల సమీకరణ

17-31 జనవరి

15.

జాబ్ మేళాలు

17-31 జనవరి

16.

రుణ మేళాలు

17-31 జనవరి

17.

స్వనిధి ద్వారా సమృద్ధి

17-31 జనవరి

18.

స్వనిధి ప్రత్యేక కార్యక్రమం

17-31 జనవరి

19.

‘స్వచ్ఛభారత్ అనుసంధానం’పై ప్రచార కార్యక్రమం

17-31 జనవరి

20.

‘లక్ష్య జీరో డంప్ సైట్’ కార్యక్రమం

17-31 జనవరి

21.

స్వచ్ఛ టెక్నాలజీ చాలెంజ్ - ఫలితాలు

17-31 జనవరి

22.

‘హర్ ధడ్కన్ హైఁ స్వచ్ఛ భారత్ కీ’

17-31 జనవరి

23.

జల సంరక్షణతో జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్.సి.ఆర్.) పై చర్చాగోష్టి

17-31 జనవరి

24.

ఒకవారం–ఒక లక్ష అనుసంధాన కార్యక్రమం

17-31 జనవరి

25.

పి.ఎం.ఎ.వై-యు యాత్రలపై వర్ణన

17-31 జనవరి

26.

యమునా నదీ వరద మైదానాల పునరుద్ధరణ, పునరుజ్జీవం

17-31 జనవరి

27.

పి.ఎం.ఎ.వై.-యు పథకం కింద ఆర్థిక స్వయంచాలనం

21 జనవరి

28.

స్వచ్ఛతా స్టార్టప్ చాలెంజ్ ప్రచార కార్యక్రమం

27 జనవరి

29.

స్మార్ట్ భవంతులపై వెబినార్ సదస్సు

28 జనవరి

30.

పి.ఎం.ఎ.వై.-యు. పురస్కారాల ప్రకటన: 150 రోజుల సవాలు

30 జనవరి

 

*-వాయిదా పడినవి.

****



(Release ID: 1789297) Visitor Counter : 175