ప్రధాన మంత్రి కార్యాలయం

బీహార్‌లోని కర్మాగారంలో బాయిలర్‌ పేలి ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధాని తీవ్ర సంతాపం


‘పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌’ నుంచి నష్టపరిహారం చెల్లింపునకు ఆమోదం

Posted On: 26 DEC 2021 9:52PM by PIB Hyderabad

   బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోగల ఓ కర్మాగారంలో బాయిలర్ పేలుడు దుర్ఘటనలో ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో-

“"బీహార్‌లోని ముజఫర్‌పూర్‌గల కర్మాగారంలో దుర్ఘటన సంభవించడం చాలా బాధాకరం. ఈ ఉదంతంలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను. అలాగే ఈ సంఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

   కాగా, బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోగల ఓ కర్మాగారంలో బాయిలర్ పేలుడువల్ల మరణించినవారి కుటుంబాలకు ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి నష్టపరిహారం మంజూరుకు ప్రధాని ఆమోదముద్ర వేశారు. ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని ఒక ట్వీట్‌ద్వారా తెలిపింది. ఈ మేరకు...

   “ముజఫర్‌పూర్‌లోని కర్మాగారంలో సంభవించిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ‘పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌’ నుంచి తలా రూ.2 లక్షల వంతున నష్టపరిహారం అందించేందుకు ప్రధానమంత్రి ఆమోదించారు. అలాగే గాయపడిన వారికి తలా రూ.50,000 వంతున అందజేయబడుతుంది” అని పేర్కొంది.



(Release ID: 1785419) Visitor Counter : 112