ప్రధాన మంత్రి కార్యాలయం
గురుద్వారా లఖ్ పత్ సాహిబ్ లో గురు నానక్ దేవ్ జీ యొక్క గురు పురబ్ ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
Posted On:
24 DEC 2021 11:17AM by PIB Hyderabad
గురు నానక్ దేవ్ జీ యొక్క గురు పర్వ్ ఉత్సవాల సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని కచ్ఛ్ లో గల గురుద్వారా లఖ్ పత్ సాహిబ్ లో 2021వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ న మధ్యాహ్నం పూట సుమారు 12 గంటల 30 నిమిషాల వేళ కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.
ప్రతి సంవత్సరం లో డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు గురు నానక్ దేవ్ జీ యొక్క గురు పర్వ్ ను గుజరాత్ లోని ‘సిక్కు సంగత్’ గురుద్వార్ లఖ్ పత్ సాహిబ్ లో నిర్వహిస్తూ వస్తున్నది. గురు నానక్ దేవ్ జీ తన యాత్ర ల సందర్భం లో లఖ్ పత్ లో బస చేశారు. ఆయన ధరించినటువంటి చెక్క తో చేసిన పాదరక్షలను, ఒక పల్లకీ ని, ఇంకా ఆయన చేతి రాత గ్రంథాలను, గురుముఖీ భాష లో రాసిన రచనలు సహా ఆయన కు చెందిన కొన్ని వస్తువుల ను గురుద్వారా లఖ్ పత్ సాహిబ్ లో పదిల పరచడం జరిగింది.
ఈ గురుద్వారా 2001వ సంవత్సరం లో సంభవించిన భూకంపం వేళ దెబ్బతిన్నది. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రి గా పని చేసిన శ్రీ నరేంద్ర మోదీ దీనికి వెనువెంటనే తగిన మరమ్మతు పనుల ను జరిపించడానికి చొరవ తీసుకొన్నారు. ఇది సిఖ్ఖు పంథ్ పట్ల ప్రధాన మంత్రి కి ఉన్నటువంటి ప్రగాఢమైన భక్తి శ్రద్ధల ను చాటి చెప్పడమే కాక మరెన్నో ఇటీవలి ప్రయాసల లో సైతం ఆయనకు గల ఈ భక్తి శ్రద్ధల ను ప్రతిబింబించింది. ఆ ప్రయాసల లో గురు నానక్ దేవ్ జీ యొక్క 550వ ప్రకాశ్ పురబ్, గురు గోబింద్ సింహ్ జీ యొక్క 350వ ప్రకాశ్ పురబ్, గురు తేగ్ బహాదుర్ జీ యొక్క 400వ ప్రకాశ్ పురబ్ ఉత్సవాలు భాగం గా ఉన్నాయి.
***
(Release ID: 1784817)
Visitor Counter : 181
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam