ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

రష్యా సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయ వ్లాదిమిర్‌ పుతిన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్‌ సంభాషణ

Posted On: 20 DEC 2021 8:47PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ర‌ష్యా స‌మాఖ్య అధ్య‌క్షుడు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణ సందర్భంగా- ఇటీవల అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌ సందర్శనకు వచ్చినపుడు వారిమధ్య చర్చనీయాంశాల పురోగతిపై అధినేతలిద్దరూ సమీక్షించారు. వీటికి సంబంధించి భవిష్యత్‌ చర్యలతోపాటు రక్షణ సహకారం, ఎరువుల సరఫరాలో సహకారం, రష్యా దూరప్రాచ్య ప్రాంతాలతో భారత్‌ చర్చల విస్తరణ తదితరాలకుగల అవకాశాలు కూడా నేటి సంభాషణలో ప్రస్తావనకు వచ్చాయి. అదేవిధంగా అంతర్జాతీయ అంశాలపై వారు పరస్పరం అభిప్రాయాలు తెలుసుకున్నారు.

   భారత్‌-రష్యాల మధ్య  ప్రత్యేక-విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం కిందకు వచ్చే అన్ని అంశాలపై నిరంతర సమీక్షపై నాయకులిద్దరూ అంగీకారానికి వచ్చారు. అంతేకాకుండా ద్వైపాక్షిక సహకారంసహా బహుపాక్షిక వేదికలలో సంప్రదింపులు, సమన్వయాన్ని మరింతగా పెంచుకోవడానికి నిరంతరం కృషి చేయాలని నిర్ణయించారు.

***(Release ID: 1783779) Visitor Counter : 102