ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి ని భూటాన్‌ యొక్క సర్వోన్నత పౌర పురస్కారం తో గౌరవించడం జరిగింది

ఈ స్నేహశీలత నిండినటువంటి ఆదరణ కు గాను నేను అత్యంత కృత‌జ్ఞ‌ుడినై ఉంటాను; అంతే కాదు మాన్య
భూటాన్‌ రాజు గారి కి నా కృతజ్ఞతల ను వ్యక్తం చేస్తున్నాను: ప్రధాన మంత్రి

Posted On: 17 DEC 2021 8:05PM by PIB Hyderabad

భూటాన్‌ రాజు మాన్య శ్రీ జిగ్మే ఖేసర్‌ నామ్ గ్యాల్‌ వాంగ్‌చుక్‌ దేశ జాతీయ దినాన్ని పురస్కరించుకొని భారతదేశం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని దేశ సర్వోన్నత పౌర పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ ది ద్రూక్‌ గ్యాల్ పో తో సమ్మానించారు. శ్రీ నరేంద్ర మోదీ ఈ స్నేహశీలత నిండినటువంటి ఆదరణ కు గాను భూటాన్ రాజు గారికి కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

ఈ మేరకు భూటాన్‌ ప్రధాని ట్వీట్‌ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ అనేక ట్వీట్ లలో

ధన్యవాదాలు ల్యోన్‌చెన్‌ @PMBhutan. నేను స్నేహశీలత నిండినటువంటి ఈ ఆదరణ తో అత్యంత కృత‌జ్ఞ‌ుడినై ఉంటాను. మరి ఇందుకుగాను మాననీయ భూటాన్‌ రాజు గారి కి కృతజ్ఞత ను వ్యక్తపరుస్తున్నాను.

నాకు భూటాన్‌ లోని నా సోదర సోదరీమణుల వద్ద నుంచి అత్యధిక స్నేహాన్ని ప్రాప్తింప చేసుకొనే సౌ
భాగ్యం దక్కింది. మరి భూటాన్‌ యొక్క జాతీయ దినం తాలూకు శుభ సందర్భం లో వారందరికీ
శుభాకాంక్షల ను అందజేస్తున్నాను.

భూటాన్‌ సతత ప్రగతి తాలూకు అద్వితీయ నమూనా ను, గాఢ ఆధ్యాత్మిక జీవన శైలి ని అనుసరిస్తున్నందుకు గాను భూటాన్ ను నేను ప్రశంసిస్తున్నాను. ఒకదాని తరువాత మరొకటి గా ద్రూక్‌ గ్యాల్ పో- మాననీయ రాజు లు ఈ దేశానికి ఒక విశిష్ట గుర్తింపు ను అందించారు. అలాగే పొరుగుదేశాల తో మిత్రత్వం తాలూకు ప్రత్యేక స్నేహబంధాన్ని పెంచి పోషించారు. అటువంటి బంధాన్నే మా దేశం పంచుకొంటున్నది.

భూటాన్‌ ను భారతదేశం తన అత్యంత సన్నిహిత మిత్రదేశం గాను, పొరుగు దేశంగాను మెచ్చుకొంటూ ఉంటుంది. మరి మేము సాధ్యమైన ప్రతి మార్గం లో భూటాన్‌ ప్రగతి పయనం లో సహకారాన్ని అందించడాన్ని కొనసాగిస్తాం.అని పేర్కొన్నారు.

 

Thank you, Lyonchhen @PMBhutan! I am deeply touched by this warm gesture, and express my grateful thanks to His Majesty the King of Bhutan. https://t.co/uVWC4FiZYT

— Narendra Modi (@narendramodi) December 17, 2021

***

DS/SH(Release ID: 1783185) Visitor Counter : 66