ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హెలికాప్టర్ దుర్ఘటన లో జనరల్శ్రీ బిపిన్ రావత్, ఆయన సతీమణి మరియు సాయుధ దళాల కు చెందిన ఇతర సిబ్బంది  కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి 

Posted On: 08 DEC 2021 6:44PM by PIB Hyderabad

తమిళ నాడు లో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటన లో జనరల్ శ్రీ బిపిన్ రావత్, ఆయన సతీమణి లతో పాటు సాయుధ దళాల కు చెందిన ఇతర సిబ్బంది కన్నుమూయడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో -

‘‘తమిళ నాడు లో హెలికాప్టర్ కూలిపోయిన ఘటన పట్ల నేను అత్యంత దు:ఖానికి లోనయ్యాను. ఈ దుర్ఘటన లో మనం జనరల్ శ్రీ బిపిన్ రావత్ ను, ఆయన సతీమణి ని మరియు సాయుధ దళాల కు చెందిన ఇతర సిబ్బంది ని కోల్పోయాం. ఆయన అత్యంత నిష్ఠ తో భారతదేశాని కి సేవల ను అందించారు. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను.

జనరల్ శ్రీ బిపిన్ రావత్ ఒక ఉత్కృష్ట సైనికునిగా ఉండే వారు. ఒక సిసలైన దేశభక్తుని వలె ఆయన మన సాయుధ దళాల ను, సమస్త సురక్ష వ్యవస్థ ను ఆధునికీకరించడం లో బహుమూల్యమైనటువంటి తోడ్పాటు ను అందించారు. వ్యూహాత్మక అంశాల లో ఆయన దూరదృష్టి, అభిప్రాయాలు అసాధారణమైనవిగా ఉండేవి. ఆయన కన్నుమూత నాకెంతో దు:ఖదాయకం గా ఉంది. ఓమ్ శాంతి.

భారతదేశాని కి తొలి ‘సిడిఎస్’ గా జనరల్ శ్రీ రావత్ రక్షణ సంబంధి సంస్కరణలు సహా సాయుధ దళాల కు సంబంధించిన విభిన్న విషయాలపైన గొప్ప కృషి ని చేశారు. సైన్యాని కి తన సేవలను అందించడం లో ఆయన తనకు గల అపారమైన అనుభవాన్ని వినియోగించారు. భారతదేశం ఆయన అందించినటువంటి అపూర్వ సేవలను ఎన్నటికీ మరచిపోదు.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH

 


(Release ID: 1779627) Visitor Counter : 169