ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికల నేపథ్యంలో నూతన కోవిడ్-19 వేరియంట్ ( ఓమిక్రాన్ ) ను ఎదుర్కొనే అంశంలో ప్రజారోగ్య వ్యవస్థ సన్నద్ధతపై రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్షించిన కేంద్రం


టెస్ట్, ట్రాక్, ట్రీట్ వ్యూహంపై అలసత్వం ప్రదర్శించవద్దని రాష్ట్రాలకు సూచన

Posted On: 30 NOV 2021 2:03PM by PIB Hyderabad

ఆర్టీపీసీఆర్ , రాట్ లను ఓమిక్రాన్ తప్పించుకోలేదు: పరీక్షల సంఖ్యని పెంచి సక్రమంగా వేగంగా కేసులను గుర్తించడానికి చర్యలను తీసుకోవాలని సూచించిన కేంద్రం 

సకాలంలో కేసులను గుర్తించి అవసరమైన చర్యలను చెప్పడానికి వ్యాధి వ్యాప్త ప్రాంతాలను గుర్తించి పర్యవేక్షణ పెంచాలి 

పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పనఅవసరమైన పరిమాణంలో మందులు లభించేలా చూసివాటిని నిల్వ చేసిహోమ్ ఐసోలేషన్ పై పర్యవేక్షణ ఉంచాలని రాష్ట్రాలకు సూచనలు జారీ 

 సేకరించిన నమూనాలను జీనోం సీక్వెన్సింగ్ కోసం  అనుమతి పొందిన INSACOG ల్యాబ్‌లకు తక్షణమే పంపాలి

ఇమ్మిగ్రేషన్ బ్యూరో, ఏపీహెచ్ఓ లతో కలిసి రాష్ట్ర యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలి

అందరికి టీకాలు ఇవ్వాలన్న లక్ష్యంతో డిసెంబర్ 31 వరకు ' హర్ ఘర్ దస్తక్” టీకా ప్రచారం పొడిగింపు 

హైదరాబాద్, నవంబర్ 30:

ఓమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొనే అంశంపై అమలు చేయాల్సిన చర్యలను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ ఈ రోజు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్షించారు. నీతీ అయోగ్ సభ్యుడు ( ఆరోగ్యం) డాక్టర్ వి.కే.పాల్ సమక్షంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో నూతన కోవిడ్-19 వేరియంట్ పై ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికలు, వివిధ దేశాల్లో వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజారోగ్య వ్యవస్థ  ద్వారా  చేపట్టాల్సిన చర్యలను ఆయన సమీక్షించారు. 

సమీక్షా సమావేశానికి పౌర విమానయాన కార్యదర్శి శ్రీ రాజీవ్ బన్సాల్, ఐసీఎంఆర్ డీజీ,కార్యదర్శి ( ఆరోగ్య పరిశోధన) డాక్టర్ బలరాం భార్గవ, ఎన్ సీడీసీ డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కే సింగ్, రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బ్యూరో అఫ్ ఇమ్మిగ్రేషన్, రాష్ట్ర విమానాశ్రయ ప్రజారోగ్య ప్రతినిధులు, రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

నూతన కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే జరీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సూచించారు. ఇప్పటికే అమలు చేస్తున్న కోవిడ్-19 నియంత్రణ చర్యల అమలులో అలసత్వం ప్రదర్శించవద్దని ఆయన అన్నారు. విమానాశ్రయాలు, రేవులు, సరిహద్దు మార్గాలలో దేశానికి వస్తున్న విదేశీయులపై నిఘా పెంచాలని ఆయన పేర్కొన్నారు. 

రాష్ట్రాలకు కేంద్రం జారీ చేసిన సూచనలు:- 

* అంతర్జాతీయ ప్రయాణీకుల రాకపై పటిష్ట  నిఘా: 

"ప్రమాదంలో ఉన్న" దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల నమూనాలను వారు వచ్చిన  1వ రోజు తిరిగి  8వ రోజు  పరీక్షించాలి.  ఆర్టీపీసీఆర్   పరీక్ష నివేదిక వచ్చే వరకు విమానాశ్రయంలో   వేచి ఉండటానికి సిద్ధపడి రావాలని  సిద్ధంగా ఉండాలని "ప్రమాదంలో ఉన్న" దేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులకు సూచనలు జారీ అయ్యాయి.  ముందుగా కనెక్టింగ్ విమానాలను బుక్ చేసుకోవద్దని సలహా ఇవ్వడం జరిగింది. 

* జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అన్ని పాజిటివ్  నమూనాలను వెంటనే INSACOG ల్యాబ్‌లకు (రాష్ట్రాలతో అనుసంధానం చేయబడినవి) పంపడానికి.    పాజిటివ్    వ్యక్తులను గుర్తించి  14 రోజుల పాటు పర్యవేక్షణ ఉంచడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. 

* పరీక్షలను ఎక్కువ చేయాలి:పరీక్షల కోసం సౌకర్యాలను మెరుగుపరచాలి. పరీక్షల మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటిస్తూ ప్రతి జిల్లాలో పరీక్షల సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. ఆర్టీపీసీఆర్ నిష్పత్తిని కొనసాగించాలి. 

* హాట్ స్పాట్లపై మరింత పర్యవేక్షణ: 

పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలపై పర్యవేక్షణ ఎక్కువ చేయాలి. పాజిటివ్ తేలిన  నమూనాలను తక్షణం   INSACOG ల్యాబ్‌లకు పంపడానికి చర్యలు తీసుకోవాలి.

* హోం  ఐసోలేషన్ పై మరింత పర్యవేక్షణ: 

 "ప్రమాదంలో ఉన్న" దేశాల నుంచి వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న   ప్రయాణీకుల ఇళ్లను తరచు సందర్శించి క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి.    8వ రోజు పరీక్ష తర్వాత నెగెటివ్ వచ్చిన వారి పరిస్థితిని  రాష్ట్ర యంత్రాంగం భౌతికంగా పర్యవేక్షించాలి.

* ఆరోగ్య సౌకర్యాలను మెరుగు పరచాలి:-

ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను ( ఐసీయూ, ఓ2 పడకలు, వెంటిలేటర్ల లభ్యత తదితర అంశాలు) మెరుగుపరచడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పిల్లలకు ప్రాధాన్యత ఇస్తూ ఈసీఆర్ర్ఫీ-IIని అమలు చేయాలి. మంజూరైన ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి, రవాణా సౌకర్యాలను మెరుగుపరచి, తగినంత సంఖ్యలో మందులు, ఆక్సిజన్ సీలెండర్లను నిల్వ చేసుకోవాలి. 

* విమానాశ్రయ ప్రజారోగ్య అధికారులతో సమన్వయం:- పాజిటివ్ గా తేలిన ప్రయాణీకులతో పాటు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకుల పూర్తి వివరాలను అందించి వారిపై పర్యవేక్షణ ఉంచాలి. 

* ఇమ్మిగ్రేషన్ బ్యూరో, ఏపీహెచ్ఓ, పోర్టుల అధికారులు, సరిహద్దు ప్రాంతాల అధికారులతో కలిసి రాష్ట్ర యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలి. 

* నూతన మార్గదర్శకాలను అమలు చేసే అంశంలో ఇమ్మిగ్రేషన్ బ్యూరో, ఏపీహెచ్ఓ, పోర్టుల అధికారులు, సరిహద్దు ప్రాంతాల అధికారులు, రాష్ట్ర అధికారుల మధ్య సమన్వయం అవసరమని ఈ సమావేశంలో గుర్తించారు. అంతర్జాతీయ ప్రయాణీకులకు నూతనంగా జారీ చేసిన మార్గదర్శకాలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో వివిధ శాఖల మధ్య సమన్వయం మరింత మెరుగుపడాలని నిర్ణయించారు. 

* దేశంలో వైరస్ వ్యాప్తి చెందకుండా చూడడానికి పరిస్థితిని, ముఖ్యంగా కొత్త కేసులు నమోదవుతున్న ప్రాంతాల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రోజు  సమీక్షించాలి.  

* తాజా పరిస్థితిని ప్రజలకు వివరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. దీనికోసం ప్రతి వారం విలేకరుల సమావేశాలను నిర్వహించి సమాచారాన్ని అందించాలి. 

నూతన కోవిడ్ వేరియంట్ ' మహమ్మారి లో మహమ్మారిగా డాక్టర్ వీకే  పాల్ వర్ణించారు. కోవిడ్-19 ని ఎదుర్కోవడంలో విజయం  సాధించి సాధించిన అనుభవంతో నూతన వేరియెంట్ పై దేశం విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కోవిడ్ అనుగుణ ప్రవర్తన, మాస్కులను ధరించడం, ఒకచోట ఎక్కువ మంది గుమి కాకుండా చూడడం, టీకాల ద్వారా రక్షణ పొందవచ్చునని ఆయన చెప్పారు. తాజా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశంలో అందరికీ టీకాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రారంభించిన "హర్ ఘర్ దస్తక్" టీకా కార్యక్రమాన్ని డిసెంబర్ 31 వరకు కొనసాగిస్తామని అన్నారు. అందరికి మొదటి డోసు టీకా ఇచ్చి, మొదటి డోసు తీసుకున్న వారందరూ రెండవ డోసు టీకా తీసుకునేలా చూడడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. టీకా కార్యక్రమాన్ని వేగంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆయన సూచించారు. 

ఆర్టీపీసీఆర్ , రాట్ పరీక్షలను ఓమిక్రాన్ తప్పించుకోలేదని ఐసీఎంఆర్ డీజీ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పరీక్షల సంఖ్యని పెంచి కొత్త కేసులను గుర్తించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. "ప్రమాదంలో"లేని దేశాల నుంచి వచ్చిన ప్రయాణీకులలో కొంతమందిని ఎంపిక చేసి వారికి పరీక్షలను నిర్వహించాలని ఆయన అన్నారు. టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేసి, కోవిడ్ అనుగుణ ప్రవర్తన అమలు జరిగేలా చూడడానికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు అమలు చేయాలని సూచించడం జరిగింది. 


(Release ID: 1776624) Visitor Counter : 247