సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
#AIRNxtని ప్రారంభించిన ఆల్ ఇండియా రేడియో
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకోవడానికి గాను యువత చేత, యువత కొరకు, యువతే ఏర్పాటు చేసేలా యూత్ షోలు
Posted On:
29 NOV 2021 11:49AM by PIB Hyderabad
యువ భారతానికి ప్రాతినిధ్యం వహించే స్వరాలను వెతికిపట్టుకొనేందుకు 'ఆల్ ఇండియా రేడియో' (ఏఐఆర్) అనూహ్య తరహాలో
నవంబర్ 28, 2021వ తేదీన తన స్టూడియోలను తెరిచింది. రానున్న 52 వారాల పాటు, భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలలోని ఏఐఆర్ స్టేషన్‌లు, స్థానిక కళాశాలలు, విశ్వవిద్యాలయాల యువకులకు ఏఐఆర్ కార్యక్రమాలలో పాల్గొనడానికి తగిన అవకాశం కల్పిస్తాయి, యువ కేంద్రీకృత ప్రదర్శనలపై చర్చించడానికి, వాటిని తగిన విధఃగా నిర్వహించడానికి కూడా యువతను అనుమతిస్తారు. ఈ ప్రదర్శనలు గడిచిన 75 సంవత్సరాల స్వాతంత్య్రంలో దేశం సాధించిన విజయాల గురించి మాట్లాడటానికి యువతను ప్రోత్సహిస్తాయి. దేశం వివిధ రంగాలలో ఎలాంటి ఉన్నత స్థానాలకు చేరాలని వారు ఆశిస్తున్నారు కూడా చర్చించేందుకు వీలు కల్పిస్తారు. ఈ విధంగా యువత వారి పెద్ద కలలను ప్రసారం చేయవచ్చు. భారతదేశ భవిష్యత్తును నిర్వచించవచ్చు. భారతదేశంలోని ప్రతి ప్రాంతాలలో గల 1000 విద్యా సంస్థల నుండి దాదాపుగా 20వేల మంది యువత 167 ఏఐఆర్ స్టేషన్ల ద్వారా ఏడాది కాలం పాటు వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఏఐఆర్ కేంద్రాలు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మునుపెన్నడూ వినని స్వరాలను వెలుగులోకి తేనున్నాయి. కొత్త ప్రోగ్రామ్ #AIRNxt ద్వారా ఆల్ ఇండియా రేడియోలో మొదటిసారిగా ఈ స్వరాలు వెలుగులోకి రానున్నాయి. ఆల్ ఇండియా రేడియోలో దేశవ్యాప్తంగా వేలాది మంది యువత మరియు వందలాది విద్యాసంస్థలు పాల్గొననున్న ఇది అతిపెద్ద సింగిల్ థీమ్ షో ఇది కానుంది. ఈ టాలెంట్ హంట్ షో #AIRNxt అన్ని ప్రధాన భారతీయ భాషలు మరియు మాండలికాలలోనూ ప్రసారం చేయబడుతుంది.
****
(Release ID: 1776060)