ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయాని కి శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

‘‘ఈ విమానాశ్రయం ఈ ప్రాంతాన్నంతటినీ ‘నేశనల్ గతిశక్తి మాస్టర్ ప్లాన్’ యొక్క ఒక శక్తిమంతమైన ప్రతిబింబం గామార్చుతుంది’’

‘‘ఈ విమానాశ్రయం ఉత్తర్ ప్రదేశ్ లో పశ్చిమ ప్రాంతాని కి చెందిన వేల కొద్దీప్రజల కు కొత్త ఉపాధి ని కూడా కల్పిస్తుంది’’

‘‘డబల్ ఇంజన్ గవర్నమెంటు యొక్క ప్రయాసల తో, ప్రస్తుతం దేశం లోకెల్లా సంధానసదుపాయాలు అమితం గా ఉన్నటువంటి ప్రాంతం గా ఉత్తర్ ప్రదేశ్ అవతరిస్తోంది’’

‘‘రాబోయే మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఖుర్జా చేతివృత్తుల వారు, మేరఠ్ లోని క్రీడల పరిశ్రమ, సహారన్ పుర్ యొక్క ఫర్నిచర్, మొరాదాబాద్ లోని ఇత్తడి పరిశ్రమ, ఆగ్ రా లోని పాదరక్ష లు మరియు పేఠాపరిశ్రమ లు పెద్ద ఎత్తు న సమర్ధన ను అందుకొంటాయి’’

‘‘మునుపటి ప్రభుత్వాల ద్వారా మిథ్యా స్వప్నాల ను చూసినటువంటి ఉత్తర్ ప్రదేశ్  దేశీయం గా మాత్రమే కాక అంతర్జాతీయం గా కూడాను తనయొక్క ముద్ర ను వేస్తున్నది’’

‘‘మౌలిక సదుపాయాల కల్పన మాకు ‘రాజనీతి’ (రాజకీయాల) లోఒక భాగం కాదు గాని అది ‘రాష్ట్ర నీతి’ (జాతీయ విధానం) లో ఒక భాగం గా ఉంది’’

Posted On: 25 NOV 2021 3:45PM by PIB Hyderabad

ఉత్తర్ ప్రదేశ్ లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్నవారి లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, జనరల్ శ్రీ వి.కె. సింహ్, శ్రీ సంజీవ్ బాలియాన్, శ్రీ ఎస్.పి సింహ్ బఘెల్, శ్రీ బి.ఎల్. వర్మ లు ఉన్నారు.

సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, 21వ శతాబ్ది కి చెందిన నూతన భారతదేశం అత్యుత్తమమైనటువంటి ఆధునిక మౌలిక సదుపాయాల లో ఒకటైన మౌలిక సదుపాయాన్ని ప్రస్తుతం నిర్మిస్తున్నది అని పేర్కొన్నారు. ‘‘మెరుగైన రహదారులు, మెరుగైన రైల్ నెట్ వర్క్, మెరుగైన విమానాశ్రయాలు మౌలిక సదుపాయాల సంబంధి పథకాలు మాత్రమే కావు గాని అవి యావత్తు ప్రాంతాన్ని పరివర్తన కు లోను చేస్తాయి; ప్రజల జీవితాల ను అవి సంపూర్ణం గా మార్చివేస్తాయి’’ అని ఆయన అన్నారు.

 

నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశం లో ఉత్తర ప్రాంతాని కి లాజిస్టిక్స్ గేట్ వే గా అవుతుంది. ఈ విమానాశ్రయం యావత్తు ప్రాంతాన్ని నేశనల్ గతిశక్తి మాస్టర్ ప్లాన్తాలూకు ఒక సశక్త ప్రతిబింబం గా మార్చి వేస్తుంది అని కూడా ఆయన అన్నారు.

 

‘‘మౌలిక సదుపాయాల సంబంధి అభివృద్ధి యొక్క ఆర్థిక పరిణామాన్ని గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, విమానాశ్రయం నిర్మాణ కాలం లో ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయన్నారు. విమానాశ్రయం సాఫీ గా నడవాలి అంటే వేల కొద్దీ ప్రజల అవసరం కూడా ఉంటుంది. అందువల్ల, ఈ విమానాశ్రయం యుపి పశ్చిమ ప్రాంతం లో వేలాది ప్రజల కు కొత్త గా ఉపాధి ని సైతం అందిస్తుంది’’ అని ఆయన అన్నారు.

 

స్వాతంత్య్రం తాలూకు ఏడు దశాబ్దులు గడచిన తరువాత మొట్టమొదటిసారి గా ఉత్తర్ ప్రదేశ్ సదా తనకు హక్కు ఉన్న దాని ని అందుకోవడం మొదలు పెట్టింది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. డబల్ ఇంజన్ గవర్నమెంటు యొక్క ప్రయాస ల ద్వారా దేశం లో కెల్లా ప్రస్తుతం అత్యంత సంధాన సదుపాయం కలిగిన ప్రాంతం గా ఉత్తర్ ప్రదేశ్ అవతరిస్తోంది అని ఆయన అన్నారు. భారతదేశం లో వర్ధిల్లుతున్న విమానయాన రంగం లో నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రధానమైనటువంటి పాత్ర ను పోషిస్తుంది, మరి ఇది విమానాల నిర్వహణ, మరమ్మతు, ఇంకా కార్యకలాపాల కు ఒక కీలకమైన కేంద్రం అవుతుంది అని ఆయన చెప్పారు. 40 ఎకరాల లో మెయింటనన్స్, రిపేర్ ఎండ్ ఓవర్ హాల్ (ఎమ్ఆర్ఒ) సదుపాయం రానుంది, ఇది వందల కొద్దీ యువ జనుల కు ఉపాధి ని ఇస్తుంది అని ఆయన అన్నారు. ఈ తరహా సేవల ను విదేశాల లో పొందడం కోసం భారతదేశం ప్రస్తుతం వేల కొద్దీ కోట్ల రూపాయల ను ఖర్చు పెడుతోంది అని ఆయన చెప్పారు.

 

రాబోయే ఇంటిగ్రేటెడ్ మల్టి-మాడల్ కార్గో హబ్ ను గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, నలు దిశలా భూమి నే సరిహద్దులు గా కలిగిన ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రం లో విమానాశ్రయం ఏర్పాటు అనేది చాలా ప్రయోజనకారి కానుంది అన్నారు. ఈ హబ్ అలీగఢ్, మధుర, మేరఠ్, ఆగ్ రా, బిజ్ నౌర్, మొరాదాబాద్, ఇంకా బరేలీ వంటి పారిశ్రామిక కేంద్రాల కు సేవల ను అందిస్తుంది అని ఆయన చెప్పారు. త్వరలో రూపుదిద్దుకోబోయే మౌలిక సదుపాయాల ద్వారా ఖుర్జా ప్రాంత చేతివృత్తుల కార్మికులు, మేరఠ్ లోని క్రీడల పరిశ్రమ, సహారన్ పుర్ ఫర్నిచర్, మొరాదాబాద్ లోని ఇత్తడి పరిశ్రమ, ఆగ్ రా కు చెందిన పాదరక్ష ల, పేఠా ల పరిశ్రమ లు పెద్ద ఎత్తున సమర్ధన ను అందుకోగలుగుతాయి అని ఆయన అన్నారు.

 

మునుపటి ప్రభుత్వాలు ఉత్తర్ ప్రదేశ్ ను వంచన లో, అంధకారం లో ఉంచుతూ వచ్చాయి. ఇదివరకటి ప్రభుత్వాల ద్వారా మిథ్య స్వప్నాల ను కాంచిన అటువంటి ఉత్తర్ ప్రదేశ్ దేశీయం గానే కాకుండా అంతర్జాతీయం గా కూడా తనదైన ముద్ర ను వేస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇదివరకటి ప్రభుత్వాలు ఉత్తర్ ప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతం అభివృద్ధి పట్ల ఏ విధమైన అలక్ష్యాన్ని వహించాయో జేవర్ విమానాశ్రయమే దానికి ఒక ఉదాహరణ గా ఉంది అంటూ ప్రధాన మంత్రి ప్రస్తావించారు. రెండు దశాబ్దాల కు పూర్వం ఉత్తర్ ప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వం ఈ పథకాని కి రూపకల్పన చేసింది అని ఆయన అన్నారు. అయితే ఆ తరువాత ఈ విమానాశ్రయం దిల్లీ, ఇంకా లఖ్ నవూ ల లోని ఇదివరకటి ప్రభుత్వాల పెనగులాట లో చాలా సంవత్సరాల పాటు చిక్కుకొని పోయింది అని ఆయన అన్నారు. యుపి లో ఇదివరకటి ప్రభుత్వం అప్పటి కేంద్ర ప్రభుత్వాని కి ఒక లేఖ ను రాసి, ఈ విమానాశ్రయం పథకాన్ని స్తంభింప చేయాలి అని చెప్పిందన్నారు. ప్రస్తుతం డబల్ ఇంజన్ గవర్నమెంటు యొక్క ప్రయత్నాల తో మనం ఇదే విమానాశ్రయం తాలూకు నేటి భూమి పూజ కార్యక్రమానికి సాక్షులం అయ్యాం అని ఆయన అన్నారు.

 

‘‘మౌలిక సదుపాయాల కల్పన మాకు రాజనీతి (రాజకీయాల) లో భాగం కాదు గాని అది రాష్ట్ర నీతి (జాతీయ విధానం) లో భాగంగా ఉంది. పథకాలు నిలచిపోకుండా, లేదా అసంపూర్ణ స్థితిలో ఉండిపోకుండా గాని, లేదా మార్గాన్నుంచి విడివడడం గాని జరగకుండా చూడాలని మేం తగిన జాగ్రతలను తీసుకొంటున్నాం. మౌలిక సదుపాయాల సంబంధి పనులు అనుకొన్న కాలం లోపు పూర్తి అయ్యేటట్లుగా పూచీపడడం కోసం మేం యత్నిస్తున్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

మన దేశం లో కొన్ని రాజకీయ పక్షాలు వాటి స్వార్ధ ప్రయోజనాలే ఎప్పటికీ పరమం గా ఎంచుతూ వచ్చాయి అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘ఈ మనుషుల ఆలోచన విధానం స్వీయ ప్రయోజనాలు, వారి యొక్క మరియు వారి కుటుంబం యొక్క అభివృద్ధి ఒక్కటే అన్న చందంగా ఉండింది. కాగా, మేం దేశ ప్రజలకు అగ్ర తాంబూలం అనే భావన ను అనుసరిస్తాం. సబ్ కా సాథ్-సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్- సబ్ కా ప్రయాస్ అనేది మా మంత్రం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రభుత్వం చేపట్టిన ఇటీవలి కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి ఒక్కటొక్కటి గా వివరించారు. ఆయన 100 కోట్ల వ్యాక్సీన్ డోజుల తాలూకు మైలురాయి ని గురించి, 2070వ సంవత్సరం కల్లా నెట్ జీరో గోల్ తాలూకు దృఢ సంకల్పాన్ని గురించి, కుశీనగర్ విమానాశ్రయాన్ని గురించి, ఉత్తర్ ప్రదేశ్ లో 9 మెడికల్ కాలేజీల ను గురించి, మహోబా లో కొత్త ఆనకట్ట తో పాటు సేద్యపు నీటి పారుదల పథకాల ను గురించి, ఝాంసీ లో డిఫెన్స్ కారిడార్ ను గురించి, ఆ కారిడార్ సంబంధి పథకాల ను గురించి, పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్- వే ను గురించి, జన్ జాతీయ గౌరవ్ దివస్ ను నిర్వహించడం గురించి, భోపాల్ లో ఆధునిక రైల్ వే స్టేశన్ ను గురించి, మహారాష్ట్ర లోని పంఢర్ పుర్ లో జాతీయ రాజ మార్గాన్ని గురించి, మరి అలాగే ఈ రోజు న నోయెడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గురించి ప్రస్తావించారు. ‘‘మన దేశభక్తి భావన మరి మన దేశ సేవ ల సమక్షం లో కొన్ని రాజకీయ పక్షాల స్వార్ధ భరిత విధానాలు అడ్డు పడి నిలువ జాలవు’’ అని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

21वीं सदी का नया भारत आज एक से बढ़कर एक बेहतरीन आधुनिक infrastructure का निर्माण कर रहा है।

बेहतर सड़कें, बेहतर रेल नेटवर्क, बेहतर एयरपोर्ट ये सिर्फ इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स ही नहीं होते बल्कि ये पूरे क्षेत्र का कायाकल्प कर देते हैं, लोगों का जीवन पूरी तरह से बदल देते हैं: PM

— PMO India (@PMOIndia) November 25, 2021

नोएडा इंटरनेशनल एयरपोर्ट उत्तरी भारत का logistic गेटवे बनेगा।

ये इस पूरे क्षेत्र को नेशनल गतिशक्ति मास्टरप्लान का एक सशक्त प्रतिबिंब बनाएगा: PM @narendramodi

— PMO India (@PMOIndia) November 25, 2021

हवाई अड्डे के निर्माण के दौरान रोज़गार के हजारों अवसर बनते हैं।

हवाई अड्डे को सुचारु रूप से चलाने के लिए भी हज़ारों लोगों की आवश्यकता होती है।

पश्चिमी यूपी के हजारों लोगों को ये एयरपोर्ट नए रोजगार भी देगा: PM @narendramodi

— PMO India (@PMOIndia) November 25, 2021

आज़ादी के 7 दशक बाद, पहली बार उत्तर प्रदेश को वो मिलना शुरु हुआ है, जिसका वो हमेशा से हकदार रहा है।

डबल इंजन की सरकार के प्रयासों से, आज उत्तर प्रदेश देश के सबसे कनेक्टेड क्षेत्र में परिवर्तित हो रहा है: PM @narendramodi

— PMO India (@PMOIndia) November 25, 2021

पहले की सरकारों ने जिस उत्तर प्रदेश को अभाव और अंधकार में बनाए रखा,

पहले की सरकारों ने जिस उत्तर प्रदेश को हमेशा झूठे सपने दिखाए,

वही उत्तर प्रदेश आज राष्ट्रीय ही नहीं, अंतर्राष्ट्रीय छाप छोड़ रहा है: PM @narendramodi

— PMO India (@PMOIndia) November 25, 2021

यूपी में और केंद्र में पहले जो सरकारें रहीं, उन्होंने कैसे पश्चिमी उत्तर प्रदेश के विकास को नजरअंदाज किया, उसका एक उदाहरण ये जेवर एयरपोर्ट भी है।

2 दशक पहले यूपी की भाजपा सरकार ने इस प्रोजेक्ट का सपना देखा था: PM @narendramodi

— PMO India (@PMOIndia) November 25, 2021

लेकिन बाद में ये एयरपोर्ट अनेक सालों तक दिल्ली और लखनऊ में पहले जो सरकारें रहीं, उनकी खींचतान में उलझा रहा।

यूपी में पहले जो सरकार थी उसने तो बाकायदा चिट्ठी लिखकर, तब की केंद्र सरकार को कह दिया था कि इस एयरपोर्ट के प्रोजेक्ट को बंद कर दिया जाए: PM @narendramodi

— PMO India (@PMOIndia) November 25, 2021

अब डबल इंजन की सरकार के प्रयासों से आज हम उसी एयरपोर्ट के भूमिपूजन के साक्षी बन रहे हैं: PM @narendramodi

— PMO India (@PMOIndia) November 25, 2021

इंफ्रास्ट्रक्चर हमारे लिए राजनीति का नहीं बल्कि राष्ट्रनीति का हिस्सा है।

हम ये सुनिश्चित कर रहे हैं कि प्रोजेक्ट्स अटके नहीं, लटके नहीं, भटके नहीं।

हम ये सुनिश्चित करने का प्रयास करते हैं कि तय समय के भीतर ही इंफ्रास्ट्रक्चर का काम पूरा किया जाए: PM @narendramodi

— PMO India (@PMOIndia) November 25, 2021

हमारे देश में कुछ राजनीतिक दलों ने हमेशा अपने स्वार्थ को सर्वोपरि रखा है। इन लोगों की सोच रही है- अपना स्वार्थ, सिर्फ अपना खुद का, परिवार का विकास।

जबकि हम राष्ट्र प्रथम की भावना पर चलते हैं।

सबका साथ-सबका विकास, सबका विश्वास-सबका प्रयास, हमारा मंत्र है: PM @narendramodi

— PMO India (@PMOIndia) November 25, 2021

***

DS/AK

 

 (Release ID: 1775300) Visitor Counter : 64