ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

14వ ఆర్థిక సంఘం నుండి తదుపరి ఫైనాన్స్ కమిషన్ వ్యవధి (2021–-2026) వరకు "అట్మోస్పియర్ & క్లైమేట్ రీసెర్చ్- మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ & సర్వీసెస్ (ఎక్రాస్)" గొడుగు పథకాన్ని కొనసాగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది


దీనికి సంబంధించిన ఎనిమిది ఉప–పథకాలతో పాటు ఐదు తదుపరి ఫైనాన్స్ సైకిల్కు రూ.2,135 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.

Posted On: 24 NOV 2021 3:41PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి  న‌రేంద్ర మోదీ అధ్యక్షత‌న నిర్వహించిన ఆర్థిక వ్యవ‌హారాల కేబినెట్ క‌మిటీ ఈ రోజు గొడుగు ప‌థ‌కం "అట్మోస్పియర్ & క్లైమేట్ రీసెర్చ్-మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ & సర్వీసెస్ (ఎక్రాస్)"తో పాటు దాని ఎనిమిది ఉప పథకాలను తదుపరి ఫైనాన్స్‌ సైకిల్ వరకు కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. ఐదు సంవత్సరాల చక్రం అంటే 2021–-2026 వరకు ఇది కొనసాగుతుంది. ఈ పథకం అంచనా వ్యయం రూ.2,135 కోట్లు.  కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎస్) దాని యూనిట్లు అయిన ఇండియా మెటియోలాజికల్ డిపార్ట్‌మెంట్ (భారత వాతావరణ శాఖ), నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ (ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ (ఐఐటీఎం)  ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్సీఓఐఎస్) ద్వారా పథకాన్ని అమలు చేస్తారు.

వివరాలు:

ఎక్రోస్ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (ఎంఓఈఎస్)  వాతావరణ విజ్ఞాన కార్యక్రమాలకు సంబంధించినది.  వాయుమండలం, వాతావరణ సేవలకు సంబంధించిన వివిధ అంశాలను పరిష్కరిస్తుంది. ఈ అంశాలలో ప్రతి ఒక్కటి గొడుగు పథకం "ఎక్రాస్" క్రింద ఎనిమిది ఉప–-పథకాలుగా పొందుపరచడం జరిగింది.  పైన పేర్కొన్న నాలుగు ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా సమీకృత పద్ధతిలో అమలవుతాయి.

అమలు వ్యూహం, లక్ష్యం:

ఎక్రాస్ పథకం కింద ఎనిమిది ఉప–-పథకాలు బహుళ క్రమశిక్షణ  విధానంలో ఉంటాయి.  ఆవరణం, వాతావరణానికి సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేయడానికి ఐఎండీ, ఐఐటీఎం, ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్  ఐఎన్సీఓఐఎస్ ద్వారా సమీకృత పద్ధతిలో పథకాలను అమలు చేస్తారు. ఇక్కడ పేర్కొన్న ఎనిమిది స్కీమ్‌ల ద్వారా పై పనులను పూర్తి చేయడానికి ప్రతి ఇన్‌స్టిట్యూట్‌కు నిర్దేశిత పాత్ర ఉంటుంది:

1.                  పొలారిమెట్రిక్ డాప్లర్ వెదర్ రాడార్స్ (డీడబ్ల్యూఆర్) అమలు–-భారత వాతావరణ శాఖ  కమీషన్

2.                  వాతావరణ అంచనాల నవీకరణ–ఐఎండీ

3. వాతావరణం, శీతోష్ణస్థితుల సేవలు– -భారత వాతావరణ శాఖ  

4. వాయుమండలం పరిశీలన వ్యవస్థ –-భారత వాతావరణ శాఖ

 5. న్యూమరికల్ మోడలింగ్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్– -ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్

6.మాన్‌సూన్ మిషన్ ఐఐఐ–ఐఐటీఎం/ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్/ఐఎన్సీఓఐఎస్/భారత వాతావరణ శాఖ

7. రుతుపవనాలు, మేఘాలు,  వాతావరణ మార్పు (ఎంసీ4)- ఐఐటీఎం/ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్/భారత వాతావరణ శాఖ

8. హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ (హెచ్పీసీఎస్)-ఐఐటీఎం/ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్

 

ఉపాధి కల్పన సామర్థ్యం,  ప్రధాన ప్రభావం

ఈ పథకం శీతోష్ణస్థితులు, వాతావరణం, సముద్ర వాతావరణ సూచనలను,  సేవలను, ఇతర ప్రమాద సంబంధిత సేవలను మరింత మెరుగ్గా అందజేస్తుంది. తద్వారా ప్రజా వాతావరణ సేవ, వ్యవసాయ-వాతావరణ సేవలు, విమానయాన సేవలు, పర్యావరణ పర్యవేక్షణ సేవలు వంటి వివిధ సేవల ద్వారా అంతిమ వినియోగదారుకు తగిన ప్రయోజనాలను అందిస్తుంది. జల-వాతావరణ సేవలు, శీతోష్ణస్థితి సేవలు, పర్యాటకం, తీర్థయాత్ర, విద్యుత్ ఉత్పత్తి, నీటి నిర్వహణ, క్రీడలు & సాహసం మొదలైన వాటికి ఉపయోగపడుతంది. అంచనాల తయారీ నుండి దాని బట్వాడా వరకు మొత్తం ప్రక్రియకు ప్రతి దశలో గణనీయమైన మానవశక్తి అవసరం కాబట్టి తద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

నేపథ్యం:

శీతోష్ణస్థితి, వాతావరణం  సముద్ర పారామితులను గమనించడం,  వాతావరణ శాస్త్రాన్ని పరిష్కరించడంతోపాటు సామాజిక, ఆర్థిక  పర్యావరణ ప్రయోజనాల కోసం శీతోష్ణస్థితి, వాతావరణం,  ప్రమాద సంబంధిత విషయాలను అంచనా వేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం,  మెరుగుపరచడం ఈ కార్యక్రమ ఉద్దేశం. ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి (ఆర్&డీ) కార్యకలాపాలను నిర్వహించాలని భూ విజ్ఞానశాస్త్రాల మంత్రిత్వ శాఖ  ఆదేశించింది.  విశ్వ వాతావరణ వ్యవస్థలో మార్పుల వల్ల తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటితో ముడిపడి ఉన్న ప్రమాదాల కారణంగా విపరీతమైన విపత్తులు వస్తున్నాయి. ఈ ప్రమాదాలే ఐఎండీ, ఐఐటీఎం, ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్,  ఐఎన్సీఓఐఎస్ద్వారా సమీకృత పద్ధతిలో నిర్వహించగల అనేక లక్ష్య ఆధారిత కార్యక్రమాలను రూపొందించేలా ఎంఓఈఎస్ని ప్రేరేపించాయి.  ఇవన్నీ గొడుగు పథకం "ఎక్రోస్" పరిధిలో ఉంటాయి.

***



(Release ID: 1774857) Visitor Counter : 181