ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిడ్నీ డైలాగ్ లో కీలకోపన్యాసం చేయనున్న ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 NOV 2021 7:25PM by PIB Hyderabad


 

2021 న వంబర్ 18న భారత దేశ కాలమానం పకారం ఉదయం 9 గంటల సమయంలో సిడ్నీ డైలాగ్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కీక ప్రసంగం చేయనున్నారు. భారత దేశంలో "సాంకేతిక అభివృద్ధి -విప్లవం" అనే అంశంపై ప్రధాన మంత్రి తన ఆలోచనలను పంచుకోనున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి తన ప్రసంగానికి ముందు ప్రారంభ వ్యాఖ్యలను ఇవ్వనున్నారు.

 

సిడ్నీ డైలాగ్ 2021 నవంబర్ 17 నుంచి 19 వరకు జరుగుతోంది. ఇది ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ చొరవ. సిడ్నీ డైలాగ్ వాస్తవానికి రాజకీయ నాయకులు, పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రభుత్వాధిపతులను విస్తృత శ్రేణి చర్చల దిశగా పనిచేయడానికి, కొత్త ఆలోచనలను సృష్టించడానికి మరియు అభివృద్ధి చెందుతున్న, ముఖ్యమైన సాంకేతికతల నుండి ఉత్పన్నమయ్యే అవకాశాలు, సవాళ్లపై సాధారణ అవగాహనను అభివృద్ధి చేయడానికి తీసుకువస్తుంది. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి శ్రీ స్కాట్ మోరిసన్ , జపాన్ మాజీ ప్రధాని శ్రీ షింజో అబే కూడా సిడ్నీ డైలాగ్  లో కీక ప్రసంగం చేస్తారు.

 


(రిలీజ్ ఐడి: 1772781) సందర్శకుల సూచీ సంఖ్య : : 182
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam