ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

82 వ‌ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభిక సదస్సు ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి


‘‘ప్రజాస్వామ్యం అనేది భారతదేశాని కి కేవలం ఒక వ్యవస్థ కాదు.  ప్రజాస్వామ్యం మనస్వభావం లో ఇమిడిపోయింది; మరి ప్రజాస్వామ్యం భారతదేశం లో జీవనం లో ఓ భాగం గాకూడా ఉన్నది’’

‘‘రాష్ట్రాలన్నింటి భూమిక భారతదేశం యొక్క సమాఖ్య వ్యవస్థ లో ‘సబ్ కా ప్రయాస్’ కు ఒక పెద్ద ఆధారం గా ఉంది’’

‘‘కరోనా మహమ్మారి కి వ్యతిరేకం గా జరుగుతున్న పోరాటం ‘సబ్ కా ప్రయాస్’ తాలూకు ఒక ఘనమైనటువంటి ఉదాహరణ గా ఉంది’’

‘‘సమాజం కోసం ఏవైనా కొన్ని విశిష్ట కార్యాల ను చేస్తున్నటువంటి, దేశ ప్రజల కువారి సామాజిక జీవనం లో ఇటువంటి కోణాన్ని గురించి చాటిచెప్తున్న జన ప్రతినిధుల కోసంమనం సభ లో ఒక సంవత్సర కాలం లో మూడు రోజులు గాని లేదా నాలుగు రోజుల ను గాని ప్రత్యేకించగలుగుతామా’’

సభ లో గుణాత్మకమైనటువంటి చర్చ కోసం ఆరోగ్యవంతమైన సమయం,ఆరోగ్యవంతమైన రోజు ఉండాలి అంటూ ప్రతిపాదించిన ప్రధాన మంత్రి

పార్లమెంటరీ వ్యవస్థ కు అవసరమైన సాంకేతిక ప్రధాన ప్రోత్సాహాన్ని అందించడంకోసం, అలాగే దేశం లో అన్ని ప్రజాస్వామ్య విభాగాల ను కలపడం కోసం ‘వన్ నేశన్, వన్ లెజిస్లేటివ్ప్లాట్ ఫార్మ్’ ను కూడా ఆయన ప్రతిపాదించారు

Posted On: 17 NOV 2021 11:37AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ ’82 వ ఆల్ ఇండియా ప్రిసైండింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ప్రారంభిక సదస్సు ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో లోక్ సభ స్పీకర్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి లతో పాటు రాజ్య సభ డిప్యూటీ చైర్ మన్ కూడా హాజరయ్యారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రజాస్వామ్యం అనేది భారతదేశాని కి కేవలం ఒక వ్యవస్థ కాదు అన్నారు, ప్రజాస్వామ్యం అనేది మన స్వభావం లో ఇమిడిపోయి ఉంది, అది భారతదేశం సహజ ప్రకృతి అని ఆయన అన్నారు. ‘‘మనం రాబోయే సంవత్సరాల లో, దేశాన్ని కొత్త కొత్త శిఖరాల కు తీసుకు పోవలసి ఉంది. అంతేగాక, అసాధారణమైనటువంటి లక్ష్యాల ను సాధించవలసి ఉంది. ఈ సంకల్పాలు సబ్ కా ప్రయాస్ద్వారా మాత్రమే నెరవేరుతాయి. మరి ప్రజాస్వామ్యం లో భారతదేశం యొక్క సమాఖ్య వ్యవస్థ లో మనం సబ్ కా ప్రయాస్ను గురించి మాట్లాడుకొంటూ ఉన్నప్పుడు దానికి రాష్ట్రాలన్నింటి యొక్క పాత్ర అనేది ఒక పెద్ద ఆధారం గా ఉంటుంది’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. సబ్ కా ప్రయాస్యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి మరింత గా వివరిస్తూ, అది ఈశాన్య ప్రాంతం లో దశాబ్దాల నాటి సమస్యల కు తగిన పరిష్కారాలు కావచ్చు, లేదా దశాబ్దాల తరబడి పనులు ఆగిపోయినటువంటి అభివృద్ధి పథకాలన్నిటిని పూర్తి చేయడం కావచ్చు.. దేశం లో అటువంటి అనేక కార్యాల ను గత కొన్ని సంవత్సరాల లో పూర్తి చేయడం జరిగింది; ఇది ప్రతి ఒక్కరి ప్రయాస ల వల్లే అయింది అని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి కి వ్యతిరేకం గా జరుగుతున్న పోరాటాన్ని సబ్ కా ప్రయాస్తాలూకు ఒక ఘనమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.

మన చట్ట సభ ల సంప్రదాయా లు, వ్యవస్థ లు స్వభావరీత్యా భారతీయత కూడుకొన్నవై ఉండాలి అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ప్రభుత్వం విధానాలు, చట్టాలు భారతీయత భావన ను, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ యొక్క సంకల్పాన్ని పటిష్ట పరచేవి గా ఉండాలి అని ఆయన పిలుపునిచ్చారు. ‘‘అత్యంత ప్రాముఖ్యం కలిగిన విషయం ఏమిటి అంటే, సభ లో మన స్వీయ ఆచార,వ్యవహారాలు భారతీయ విలువల కు తగినట్లుగా ఉండాలి. ఇది మన అందరి బాధ్యత.’’ అని ఆయన అన్నారు.

మన దేశం అంతటా వివిధత్వం నిండి ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘మన వేల సంవత్సరాల అభివృద్ధి యాత్ర లో ఈ భిన్నత్వం నడుమ ఏకత్వం తాలూకు గొప్పదైనటువంటి, దివ్యమైనటువంటి ప్రవాహం నిరంతరాయం గా సాగుతోందని మనం అంగీకరించడం జరిగింది. ఏకత్వం తాలూకు ఈ అఖండ ప్రవాహం మన భిన్నత్వాన్ని పదిలపరుస్తూ, దానిని సంరక్షిస్తున్నది’’ అని ఆయన అన్నారు.

సభ లో ఒక ఏడాది కాలం లో మూడు లేదా నాలుగు రోజుల ను సమాజాని కి ఏదైనా విశిష్టమైన కార్యాలను చేస్తున్నటువంటి జన ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా అట్టిపెట్టలేమా; ఆ దినాల లో జన ప్రతినిధులు వారి అనుభవాల ను వెల్లడి చేసేందుకు వీలు ఉంటుంది కదా అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. జన ప్రతినిధులు వారి సామాజిక జీవనం లోని ఈ కోణాన్ని గురించి దేశ ప్రజల కు తెలియ జేసేందుకు అవకాశం లభించే లాగున మనం చేయగలమా? అంటూ ప్రధాన మంత్రి ఒక ప్రస్తావన ను తీసుకు వచ్చారు. దీనివల్ల ఇతర జన ప్రతినిధుల తో పాటు సమాజం లో ఇతర వ్యక్తుల కు కూడా ఎంతో నేర్చుకొనేందుకు ఆస్కారం ఉంటుంది అని ఆయన అన్నారు.

ఉత్తమమైన చర్చ ల కోసం ప్రత్యేకం గా కొంత సమయాన్ని కేటాయించే వీలు ఉంటుందా? అని కూడా ప్రధాన మంత్రి ప్రతిపాదించారు. ఆ తరహా చర్చ లో మర్యాద, గంభీరత్వం అనే సంప్రదాయాల ను పూర్తి నిష్ఠ తో పాటించాలి, ఎవ్వరూ కూడా ఎవ్వరి పైన అయినా రాజకీయ కళంకాల ను ఆపాదించకూడదు అని ఆయన అన్నారు. ఒక రకం గా అది సభ లో అన్నిటి కంటే ఆరోగ్యప్రదమైన కాలం కావాలి.. ‘ఒక ఆరోగ్యవంతమైన దినంఅవ్వాలి ఆయన అన్నారు.

వన్ నేశన్, వన్ లెజిస్లేటివ్ ప్లాట్ ఫార్మ్అనేటటువంటి ఒక ఆలోచన ను ప్రధాన మంత్రి ముందుకు తెచ్చారు. ‘‘ఒక పోర్టల్ ఉండాలి, అది మన పార్లమెంటరీ వ్యవస్థ కు జరూరైన సాంకేతిక వేగాన్ని ఇవ్వడమే కాక దేశంలోని అన్ని ప్రజాస్వామిక విభాగాల ను కలిపే పని ని కూడా చేయాలి’’ అని ఆయన అన్నారు.

రాబోయే 25 సంవత్సరాలు భారతదేశాని కి చాలా ముఖ్యమైనవి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయం లో పార్లమెంట్ సభ్యులు ఒకే మంత్రాన్ని ఆచరించాలి అని ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. అది ఏమిటి అంటే కర్తవ్యం, కర్తవ్యం, కర్తవ్యం అని ఆయన పునరుద్ఘాటించారు.

 

***

DS/AK

 

 

 

 


(Release ID: 1772658) Visitor Counter : 205