ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవంబర్ 16 నఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి ;  పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే ను ఆయన ప్రారంభిస్తారు


సుల్తాన్పుర్ జిల్లా లో ఎక్స్ ప్రెస్ వే లో భాగం గా నిర్మాణం జరిగిన 3.2 కి.మీ.పొడవైన ఎయర్ స్ట్రిప్ మీదుగా నిర్వహించే ఎయర్ శో ను కూడా ప్రధాన మంత్రితిలకించనున్నారు

Posted On: 15 NOV 2021 11:07AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబర్ 16న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. సుమారు గా మధ్యాహ్నం ఒంటి గంటన్నర వేళ కు సుల్తాన్ పుర్ జిల్లా లోని కర్ వల్ ఖీరీ లో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్- వే ను ఆయన ప్రారంభిస్తారు.

 

ఈ కార్యక్రమం ముగిసిన ప్రారంభం అనంతరం, ప్రధాన మంత్రి సుల్తాన్ పుర్ జిల్లా లో ఎక్స్ ప్రెస్- వే లో భాగం గా నిర్మాణం జరిగినటువంటి 3.2 కిలో మీటర్ ల పొడవైన ఎయర్ స్ట్రిప్ లో భారతీయ వాయు సేన నిర్వహించే ఎయర్ షో ను కూడా వీక్షించనున్నారు. అత్యవసర స్థితి లో భారతీయ వాయు సేన యొక్క యుద్ధ విమానాలు నింగి కి ఎగరడం కోసం/నేల మీదకు దిగడం కోసం ఎయర్ స్ట్రిప్ ను ఏర్పాటు చేయడమైంది.

 

పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్- వే పొడవు 341 కిలో మీటర్ లుగా ఉంది. ఇది లఖ్ నవూ-సుల్తాన్ పుర్ రోడ్డు (ఎన్ హెచ్-731) లో గల చౌడాసరాయ్ గ్రామం నుంచి మొదలవుతుంది. ఇది యుపి-బిహార్ సరిహద్దు నుంచి 18 కి.మీ. ల తూర్పు దిక్కు న నంబరు 31 జాతీయ రహదారి ని ఆనుకొని ఉన్నటువంటి హైదరియా గ్రామం లో సమాప్తం అవుతుంది. ఈ ఎక్స్ ప్రెస్- వే లో 6-దోవ లు ఉన్నాయి; దీనిని రాబోయే కాలం లో 8-దోవల వరకు పొడిగించేందుకు వీలు ఉంది. దాదాపు గా 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నిర్మించిన ఈ పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్- వే వల్ల ఉత్తర్ ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతం, ప్రత్యేకించి లఖ్ నవూ, బారాబంకీ, అమేఠీ, అయోధ్య, సుల్తాన్ పుర్, ఆమ్బేడ్ కర్ నగర్, ఆజంగఢ్, మవూ, ఇంకా గాజీపుర్ జిల్లా ల ఆర్థికాభివృద్ధి కి ప్రోత్సాహం లభించనుంది.

 

 

***


(Release ID: 1772003) Visitor Counter : 204