ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం నాడు శుభాకాంక్షలు తెలిపినప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 09 NOV 2021 10:43AM by PIB Hyderabad

ఉత్తరాఖండ్ స్థాపన దినాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో-

‘‘ఉత్తరాఖండ్ స్థాపన దినం సందర్భం లో ఈ దేవ భూమి లోని నా సోదరీమణులకు, నా సోదరుల కు ఇవే హృదయ పూర్వక శుభాకాంక్షలు. గడచిన అయిదు సంవత్సరాల లో రాష్ట్రం సాధించిన ప్రగతి ని బట్టి చూస్తే, ఈ యావత్తు దశాబ్దం ఉత్తరాఖండ్ దే అవుతుంది అనే విశ్వాసం నాలో కలుగుతున్నది.

ఉత్తరాఖండ్ లో పూర్తి అయిన అభివృద్ధి పనులు ఇక పర్వత ప్రాంతం లోని జలం, యవ్వనం.. రెండూ కూడాను అక్కర కు వస్తున్నాయనడానికి ఒక ప్రమాణం గా నిలుస్తున్నాయి. ప్రకృతి ఒడిలో ఒదిగినటువంటి ఈ రాష్ట్రం ఇదే మాదిరి గా నిరంతరం అభివృద్ధి పథం లో దూసుకుపోవాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

 


(రిలీజ్ ఐడి: 1770309) సందర్శకుల సూచీ సంఖ్య : : 197