ప్రధాన మంత్రి కార్యాలయం

తమిళనాడులో భారీ వర్షాల స్థితిగతులపై రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధానమంత్రి

Posted On: 07 NOV 2021 9:42PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్‌తో మాట్లాడి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు సంబంధించిన స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే రక్షణ-సహాయ చర్యలకు కేంద్రం నుంచి సాధ్యమైన మేర అన్నివిధాలా సహాయ-సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా శ్రీ మోదీ హామీ ఇచ్చారు.

ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా దీనిపై పంపిన సందేశంలో-

“తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తిరు @mkstalinతో మాట్లాడి స్థితిగతుల గురించి చర్చించాను. రక్షణ-సహాయ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం త్వరఫున సాధ్యమైనంత వరకూ అన్నివిధాలా సహాయ-సహకారాలు అందిస్తామని హామీ కూడా ఇచ్చాను. రాష్ట్రంలోని ప్రజలందరూ సురక్షితంగా, క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా నేను ప్రార్థిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/SH(Release ID: 1769924) Visitor Counter : 124