ప్రధాన మంత్రి కార్యాలయం
యు.కె. లోని గ్లాస్గో లో సి.ఓ.పి-26 సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో సమావేశమైన - ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
02 NOV 2021 8:04PM by PIB Hyderabad
గ్లాస్గో లో జరిగే సి.ఓ.పి-26 సదస్సు నేపథ్యంలో, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నఫ్తాలీ బెన్నెట్ ను, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 నవంబర్, 2వ తేదీన కలిశారు. ఇద్దరు ప్రధానమంత్రులు పరస్పరం సమావేశం కావడం ఇదే మొదటిసారి.
ఇరువురు నాయకులు ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించారు. విభిన్న రంగాల్లో సాధించిన పురోగతిపై ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో పాటు, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని వారు అంగీకరించారు.
భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పూర్తి దౌత్య సంబంధాలు ఏర్పాటై, వచ్చే ఏడాది 30 సంవత్సరాలు నిండుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ, భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా బెన్నెట్ ను ప్రధానమంత్రి ఆహ్వానించారు.
*****
(रिलीज़ आईडी: 1769140)
आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam