ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

18వ ఇండియా-ఆసియాన్ సమిట్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చినప్రసంగం

Posted On: 28 OCT 2021 2:29PM by PIB Hyderabad

యార్ మేజిస్టి,

ఎక్స్ లన్సిజ్,
నమస్కారాలు.
ఈ సంవత్సరం కూడా మనం మన సాంప్రదాయక ఫేమిలి ఫొటో ను తీసుకోలేకపోయాం, కానీ వర్చువల్ పద్ధతి లోనే అయినప్పటికీ, మనం ఆసియాన్-ఇండియా సమిట్ తాలూకు పరంపర ను కొనసాగించగలిగాం. నేను 2021వ సంవత్సరం లో ఆసియాన్ కు సఫల అధ్యక్ష పదవి ని వహించినందుకు గాను బ్రూనేయి సుల్తాన్ గారి ని అభినందిస్తున్నాను.
యార్ మేజిస్టి,

ఎక్స్ లన్సిజ్,

కోవిడ్-19 మహమ్మరి కారణం గా మనం అందరమూ అనేక సవాళ్ళ ను ఎదుర్కోవలసివచ్చింది. కానీ, ఇది ఇండియా-ఆసియాన్ మైత్రి కి ఒక పరీక్ష గా కూడా ఉండింది. కోవిడ్ కాలం లో మన పరస్పర సహకారం, మన పరస్పర సానుభూతి.. ఇవి భవిష్యత్తు లో మన సంబంధాల కు బలాన్ని ఇస్తూనే ఉంటాయి, మన ప్రజల మధ్య సద్భావన కు ఆధారం గా నిలవబోతున్నాయి. భారతదేశాఃనికి, ఆసియాన్ క మధ్య వేల సంవత్సరాల నుంచి హుషారైన సంబంధాలు ఉన్నాయి అనడానికి చరిత్ర యే సాక్షి గా ఉన్నది. వీటి ఛాయ లు మన ఉమ్మడి విలువలలోను, సంప్రదాయాల లోను, భాషల లోను, గ్రంథాల లోను, వాస్తుకళ లోను, సంస్కృతి లోను, అన్న పానాదుల లోను.. ప్రతి చోటా కనుపిస్తాయి. మరి ఈ కారణం గా, ఆసియాన్ యొక్క ఏకత్వం మరియు కేంద్ర స్థానం అనేవి భారతదేశాని కి ఎప్పటికీ ఒక ముఖ్య ప్రాథమ్యం గా ఉంటూ వచ్చాయి. ఆసియాన్ తాలూకు ఈ ప్రత్యేక భూమిక, భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలిసీ, ఏదయితే మా సెక్యూరిటీ ఎండ్ గ్రోత్ ఫార్ అల్ ఇన్ ద రీజియన్ - అంటే ‘‘ఎస్ఎజిఎఆర్’’ పాలిసీ యో, అందులో ఇమిడిపోయి ఉంది. భారతదేశం ప్రతిపాదించినటువంటి ఇండో పసిఫిక్ ఓశన్స్ ఇనిశియేటివ్స్, ఇంకా ఆసియాన్ యొక్క అవుట్ లుక్ ఫార్ ద ఇండో-పసిఫిక్ లు ఇండో-పసిఫిక్ ప్రాంతం లో మన ఉమ్మడి దృష్టి కోణాని కి , మన పరస్పర సహకారాని కి ఆధార భూతం గా నిలచాయి.

యార్ మేజిస్టి,

ఎక్స్ లన్సిజ్,
2022వ సంవత్సరం లో మన భాగస్వామ్యానికి 30 సంవత్సరాలు పూర్తి అవుతుంది. భారతదేశం కూడా తన స్వాతంత్య్రం తాలూకు 75 సంవత్సరాల ను పూర్తి చేసుకొంటుంది. ఈ ముఖ్యమైన మైలురాయి ని మనం ఆసియాన్,-భారతదేశం ల మైత్రి సంవత్సరంగా జరుపుకోనున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. భారతదేశం త్వరలో కంబోడియా అధ్యక్ష పీఠాన్ని అలంకరించనున్న కంబోడియా తో, మరి మన కంట్రీ కో -ఆర్డినేటర్ సింగపూర్ తో భారతదేశం కలసి పరస్పర సంబంధాల ను మరింత బలపరచుకోవడం కోసం కట్టుబడి ఉంది. ఇర నేను మీ అందరి అభిప్రాయాల ను వినాలని తహతహలాడుతున్నాను.

అనేకానేక ధన్యవాదాలు.

అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగాని కి రమారమి అనువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.

 

***


(Release ID: 1767371) Visitor Counter : 240