ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పి ఎం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్


టోకన్ టు టోట్ ల్ విధానం కింద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మనకు సమగ్ర ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన దార్శనికతను అందించారు : డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ

అందుబాటులో, నాణ్యమైన ఆరోగ్య సేవలు నిరంతరాయంగా బ్లాక్, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో అన్ని వర్గా లప్రజలకు అందే రీతిలో క్రుషి చేయడం జరుగుతోంది

స్వస్త దేశ్ సమ్రుద్ధ దేశ్: ఆరోగ్య వంతమైన దేశమే ఉత్పాదక దేశం కాగలదు

దేశవ్యాప్తంగా అమలయ్యే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ప్రాథమిక, సెకండరీ, టెర్షియరీ, డిజిటల్, సమర్ధ ఆరోగ్య సేవలను అందిస్తుంది.
రెండు కంటైనర్ ఆధారిత ఆస్పత్రులు కలిగిన దేశంగా ఇండియా ఆసియాలో తొలిదేశంగా నిలుస్తోంది.

Posted On: 26 OCT 2021 3:39PM by PIB Hyderabad

టోకన్ నుంచి టోటల్ విధానం కింద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మనకు సమగ్ర ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన దార్శనికతను అందించారు బ్లాక్, జిల్లా, రాస్ట్ర, జాతీయ స్థాయిలో అందుబాటు రీతిలో నాణ్యమైన ఆరోగ్య సేవలు నిరంతరాయంగా అందించేందుకు క్రుషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ వి
షయాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. పి.ఎం ఆయుష్మాన భారత్ కు సంబంధించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మాటలన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న ఉత్తర ప్రదేశ్ లోని వారణాశిలో పి.ఎం. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ను ప్రారంభించారు.

2021-22 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం 64 వేలా 180 కోట్ల రూపాయల పెట్టుబడితో పి.ఎం. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాలా మిషన్ ను ప్రకటించింది. ఇది ఆరోగ్య మౌలిక సదుపాాయల రంగంలో భారతదేశం మొత్తానికి వర్తించే అతిపెద్ద కార్యక్రమం. ప్రజారోగ్య అంశాలకు సంబంధించి ఇండియా సామర్ధ్యాన్ని మరింత పెంచేలా ఈరంగానికి ఊపునిచ్చేందుకు దీనిని నిర్దేశించారు. ఈ పథకం భారతదేశ ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల కల్పనలో గొప్ప మార్పును తీసుకురాగలగడమే కాకుండా మరింత పటిష్టపరచగలదు.


అభివ్రుద్ధి, ఆరోగ్యం అనేవి  ఒకదానితో మరొకటి సంబంధం కలిగినవని అంటూ ఆయన, ఏదేశమైనా సుసంపన్నత సాధించాలంటే, ముందు దేశం ఆరోగ్యవంతమైనదిగా ఉండాలని అన్నారు. ఈ లక్ష్యసాధనకు సంబంధించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనికతను ఆయన వివరించారు. స్వచ్ఛ భారత్ అభియాన్, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా, యోగా వంటివి ఆరోగ్యరంగానికి సంబంధించిన వివిధ ముందస్తు చర్యలకు , ఈ విషయంలో సమగ్ర విధానానికి దోహదం చేస్తాయని ఆయన అన్నారు.
కేవలం ఆరోగ్యవంతమైన దేశం మాత్రమే ఉత్పాదక దేశం గా ఉండగలదని మంత్రి చెప్పారు. స్వాస్థ్య దేశ్, సమద్ధ దేశ్ గా   ఉంటుందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రైమరి, సెకండరి, టెర్షియరి,డిజిటల్  సమర్ధ ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. దీనివల్ల భవిష్యత్తులో వివిధ మహమ్మారులనుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్ నెస్ సెంటర్లను 2018 ఏప్రిల్ లో ప్రారంభించారు. అనంతరం 2018 సెప్టెంబర్లో ఆయుష్మాన్ భారత్ పిఎంజెెఎవైని ప్రారంభించారు.

ఈదిశగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పెద్ద ఎత్తున చేపట్టిన చర్యల గురించి కేంద్ర ఆరొోగ్య మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, మెరుగైన ఆరొగ్య సంరక్షణ సదుపాయాలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా 1,50,000 ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని, ఇందులో  ఇప్పటికే 79,000 కేంద్రాలు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. దీనికితోడు ప్రతి జిల్ాలో కనీసం ఒక మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. ఈ పథకం కింద ఎలాంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ఫ్రంట్ లైన్ వర్కర్లకు శిక్షణ ఇస్తారన్నారు. ఎఐఐఎంఎస్ నెట్ వర్క్ ను ప్రస్తుతం ఉన్న 7 ఆస్పత్రులనుంచి 22 ఆస్పత్రులకు పెంచడమనేది కూడా  , అందరికీ సురక్షితమైన సమగ్ర, అందుబాటులో తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలన్న ప్రధానమంత్రి గారి దార్శనిక ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదేనని ఆయన అన్నారు.
సంక్షోభాన్ని, అవకాశంగా మలచుకోవడంలో ఇండియా వ్యూహాన్ని గురించి మాట్లాడుతూ డాక్టర్ మాండవీయ,ఆరోొగ్య రంగ సదుపాయాలు, లేబరెటరీలు, ఆస్పత్రులు, వంటి వాటిని అన్ని స్థాయిలలో మరింత ముందుకు తీసుకుపోనున్నట్టు తెలిపారు.

ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల మిషన్ కింద గల ముఖ్యమైన కొన్ని ప్రధాన అంశాలను వివరిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ,జిల్లా స్థాయిలో  134 వివిధ  రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇది ఖర్చులు తగ్గించడమే కాక పేద ప్రజలకు అనవసర ఇబ్బందులు కూడా తొలగిస్తుందని ఆయన అన్నారు. మరొకటి, ఆసియాలో తొలిసారిగా రెండు కంటెయినర్ ఆధారిత సమగ్ర వైద్య సదుపాయాలను అన్నవివేళలా అందుబాటులో ఉండేలా చూసినట్టు చెప్పారు. వీటిని అత్యవసరంగా రైలు లేదా విమాన మార్గంలో దేశంలో విపత్తులు, ప్రక్రుతి వైపరీత్యాలు ఎదుర్కొన్న ప్రాంతాలకు తరలించడానికి వీలు కలుగుతుందని అన్నారు.

పిఎం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ప్రజారోగ్య రంగంలో అద్భుత ఫలితాలను సాధించేందుకు నిర్దేశించినది. ప్రజారోగ్య రంగంలో ఇండియాను ప్రపంచంలో అత్యధునాతన సదుపాాయాలు గల దేశాల సరసన నిలబెట్టేందుకు నిర్దేశించినది. అలాగే ప్రజారోగ్య సంక్షోభాలను ఎదుర్కొనేందుకు దీనిని నిర్దేశించారు. వన్ హెల్త్ కు నేషనల్ ప్లాట్ ఫారం ఏర్పాటు, వ్యాధుల నిర్మూలన సైన్స్, శాటిలైట్ సెంటర్ ఆఫ్ నేషనల్ ఎయిడ్స్ రిసెర్చి ఇన్ స్టిట్యూట్, ప్రాంతీయ ఎన్.ఐ.వి లు , జాతీయ పరిశోధన శాలలను బలోపేతం చేయడం, ఎన్ సి డిసి, ప్రస్తుత లేబరెటరీల మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలల స్థాయిపెంపు, అదనంగా ఐసిఎం ఆర్, ఎన్ సిడిసి  కింద బిఎస్ ఎల్ 3 సదుపాయాలు వంటివి దేశంలో కొత్త వ్యాధుల ను గుర్తించి వాటికి చికిత్స చేసేందుకువీలు కలుగుతుంది.

ప్రణాళికా బద్ధంగా ఆరోగ్య రంగంలో తీసుకుంటున్న చర్యల వల్ల శిక్షణ పొందిన మానవ వనరులు తగినంతగా అందుబాటులోకి వస్తాయి. అలాగే వ్యాది నిర్ధారణ, పరిశోధన, కొత్త కొత్త వ్యాధులు, వైరస్ లు , జీవసంబంధిత ముప్పులను ఎదుర్కొవడానికి ఈ సన్నద్ధత పనికి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో విదేశీ భాగస్వాములు, లేబరెటరీలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది.
ఈ పథకం కింద క్రిటికల్ కేర్ ఆస్పత్రి బ్లాక్ లను 602 జిల్లాలలో ప్రతిపాదించారు. ఇది ఆయా జిల్లాల స్వావలంబనకు చాలావరకు దారితీస్తుంది. ఇతర వైద్య చికిత్సలకు ఎలాంటి అంతరాయం లేకుండానే అంటువ్యాధుల నివారణకు సమగ్ర చికిత్స అందించడానికి వీలు కలుగుతుంది. అలాగే ప్రజారోగ్య సదుపాయాల విషయంలొ క్రిటికల్ కేర్ సదుపాయాలు పెంచడానికి వీలు కలుగుతుంది.
. సరిహద్దులలో ప్రవేశ మార్గాలను పటిష్ఠపరిచే చర్యల వల్ల కొత్త కొత్త ఇన్ ఫెక్షన్లు , వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు, కంటైనర్ ఆధారిత మొబైల్ ఆస్పత్రులు  వంటివి అత్యవసర స్పందన సామర్ధ్యాలను మరింత పెంపొందించడానికి దోహదపడతాయి.

 జాతీయ, ప్రాంతీయ, రాష్ట్ర, జిల్లా ,బ్లాక్ స్థాయి లేబరెటరీలను సమీక్రుత నెట్ వర్క్ తో అనుసంధానించడం, వ్యాధులకు సంబంధించి నిఘా , ఇంటిగ్రెటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫారం (ఐహెచ్ఐపి) ధ్వారా ఐటి ఆధారిత రిపోర్టింగ్ విధానం  వంటివి వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు వంటివాటి విషయంలోొ స్వావలంబనకు ఉపకరిస్తాయి.

***


(Release ID: 1766952) Visitor Counter : 342