ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

పిఎమ్   గతి శక్తి - నేశనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎమ్ పి) కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి ; ఈపథకాన్ని అమలు లోకి తీసుకు వచ్చేందుకు మార్గం సుగమం అయింది


మూడుఅంచెల పద్ధతి లో పిఎమ్  గతి శక్తి - ఎన్ఎమ్ పి ని పర్యవేక్షించడం జరుగుతుంది.  కేబినెట్ సెక్రటరీ అధ్యక్షత వహించే ఒక కార్యదర్శుల సాధికార సమూహం (ఇజిఒఎస్)ఈ మూడు అంచెలలోనూ పై భాగం లో ఉంటుంది.

విభిన్నమంత్రిత్వ శాఖ లకు, విభాగాల కు చెందిన నెట్ వర్క్ప్లానింగ్ డివిజన్ అధిపతుల కు ప్రాతినిధ్యం ఉండేటట్లుగా ఒక మల్టిమాడల్ నెట్ వర్క్ప్లానింగ్ గ్రూపు (ఎన్ పిజి)  ని ఏర్పాటు చేయడం జరుగుతుంది

ఎన్పిజి కి వాణిజ్యం, పరిశ్రమ మంత్రిత్వ శాఖ లోనిలాజిస్టిక్స్ డివిజన్ లో ఉండే ఒక టెక్నికల్ సపోర్ట్ యూనిట్ (టిఎస్ యు) అండదండ లు లభిస్తాయి

పిఎమ్  గతి శక్తి యొక్క మౌలిక సదుపాయాల కల్పన సంబంధి ప్రణాళిక రచన లో అంతర్-మంత్రిత్వ శాఖల సహకారం తో పాటు అంతర్-విభాగాల సహకారం గేమ్ చేంజర్ గా రుజువు కాగలదు

ఇది అభివృద్ధి కి సంబంధించిన ప్రణాళిక రచన పట్ల మన దృష్టి కోణం లో ఒక సార్థకమైన మరియు మహత్వపూర్ణమైన మార్పు కు సంకేతం గా ఉంది

ఇది వనరులమరియు సామర్ధ్యాల గరిష్ట వినియోగానికి, దక్షత ను పెంచడానికి, వృథాను తగ్గించడానికి పూచీ పడుతుంది

Posted On: 21 OCT 2021 3:23PM by PIB Hyderabad

పిఎమ్ గతి శక్తి - నేశనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎమ్ పి) కి ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదం తెలిపింది. దీనిలో మల్టీ-మాడల్ కనెక్టివిటీ ని సమకూర్చడం కోసం ఎన్ఎమ్ పి ని అమలు లోకి తీసుకు రావడం, పర్యవేక్షణ లతో పాటు సమర్ధనాత్మక యంత్రాంగానికై ఉద్దేశించినటువంటి సంస్థాగత ఫ్రేమ్ వర్క్ ను స్థాపించడం భాగం గా ఉన్నాయి.

పిఎమ్ గతి శక్తి-ఎన్ఎమ్ పి ని గౌరవనీయ ప్రధాన మంత్రి 2021 అక్టోబర్ 13 న ప్రారంభించారు. దీని అమలు సంబంధి ఫ్రేమ్ వర్క్ లో కార్యదర్శుల సాధికార సమూహం (ఇజిఒఎస్), నెట్ వర్క్ ప్లానింగ్ గ్రూపు (ఎన్ పిజి) లతో పాటు అవసరమైన సాంకేతిక దక్షతలతో పరిపూర్ణమైనటువంటి టెక్నికల్ సపోర్ట్ యూనిటు (టిఎస్ యు) లు కలసి ఉంటాయి.

కేబినెట్ సెక్రటరీ ఇజిఒఎస్ కు అధ్యక్షత వహిస్తారు. దీనిలో సభ్యులు గా 18 మంత్రిత్వ శాఖ ల కార్యదర్శులు ఉంటారు. దీనికి లాజిస్టిక్స్ డివిజన్ అధిపతి మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. లాజిస్టిక్స్ సంబంధిత దక్షత కు పూచీ పడటం కోసం పిఎమ్ గతి శక్తి-ఎన్ఎమ్ పి అమలు తీరు ను సమీక్షించడానికి మరియు పర్యవేక్షించడానికి ఇజిఒఎస్ కు అధికారాన్ని దత్తం చేయడమైంది. దీనికి ఎన్ఎమ్ పి కి తదుపరి దశ లో ఏవైనా సవరణల ను చేపట్టడానికి గాను ఫ్రేమ్ వర్క్ ను, నియమావళి ని నిర్దేశించే అధికారం ఉంటుంది. ఇజిఒఎస్ వేరు వేరు కార్యకలాపాల ను ఏక కాలం లో నిర్వహించడం కోసం ప్రక్రియ ను, తుది రూపురేఖల ను నిర్ధారిస్తుంది. మరి ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి తాలూకు వేరు వేరు కార్యక్రమాలు ఈ సంయుక్త ఏకీకృత డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో భాగం అయ్యేటట్లుగా కూడాను చూస్తుంది. ఇజిఒఎస్ వివిధ మంత్రిత్వ శాఖల.. ఉదాహరణ కు ఉక్కు, బొగ్గు, ఎరువులు వంటి వివిధ మంత్రిత్వ శాఖల కు అవసరమైనప్పుడు టోకు న వస్తువులను చాకచక్యంగా చేరవేసే డిమాండు ను తీర్చడం కోసం ఏయే చర్యల ను చేపట్టాలో కూడా ఆలోచిస్తుంది.

నెట్ వర్క్ ప్లానింగ్ గ్రూపు (ఎన్ పిజి) స్థాపన, కూర్పు మరియు అధికార క్షేత్రానికి కూడా సిసిఇఎ ఆమోద ముద్ర వేసింది. ఎన్ పిజి లో సంబంధిత మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖల కు చెందిన నెట్ వర్క్ ప్లానింగ్ యూనిట్ ల అధిపతులు పాలు పంచుకొంటారు. అంతేకాక ఇది (ఎన్ పిజి) ఇజిఒఎస్ కు సాయపడుతుంది కూడాను.

దీనికి తోడు, నెట్ వర్క్ ల సమగ్ర ఏకీకరణ లో ఇమిడి ఉన్న జటిలతల ను దృష్టి లో పెట్టుకొని, ఏదైనా ఒక ప్రాంతం యొక్క సమగ్ర అభివృద్ధి కి ఉద్దేశించిన పనుల లో చేసిన పని నే మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండడం కోసం, పథకం తాలూకు ప్రభావ ఉత్పాదకత ను పెంచడం తో పాటు మైక్రో ప్లానింగ్ డిటైలింగ్ మాధ్యమం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చుల ను తగ్గించడానికి గాను ఆవశ్యక దక్షతల ను సమకూర్చడానికి ఒక టెక్నికల్ సపోర్ట్ యూనిట్ (టిఎస్ యు) కు ఆమోదం తెలపడమైంది. టిఎస్ యు స్వరూపాన్ని కూడా ఆమోదించడమైంది. టిఎస్ యు లో విమానయానం, సముద్ర రవాణా, సార్వజనిక రవాణా, రైళ్ళు, రహదారులు, రాజ మార్గాలు, నౌకాశ్రయాలు వగైరా విభిన్న మౌలిక సదుపాయాల రంగాల కు చెందిన నిపుణుల కు చోటు ను కల్పిస్తారు. అంతేకాదు, అర్బన్ ఎండ్ ట్రాన్స్ పోర్ట్ ప్లానింగ్, నిర్మాణాలు (రహదారులు, వంతెన లు మరియు భవనాలు), విద్యుత్తు, పైప్ లైను, జిఐఎస్, ఐసిటి, ఫైనాన్స్/మార్కెట్ పిపిపి, లాజిస్టిక్స్, డేటా ఎనలిటిక్స్ వగైరా సబ్జెక్టుల కు చెందిన సబ్జెక్ట్ మాటర్ ఎక్స్ పర్ట్ స్ (ఎస్ఎమ్ఇ స్) కూడా టిఎస్ యు లో పాలు పంచుకొంటారు.

పిఎమ్ గతి శక్తి - ఎన్ఎమ్ పి ని ఆయా విభాగాలు వేటి కవే గిరిగీసుకొని పని చేసే పద్ధతి ని ఛేదించడం కోసం మరియు మరింత సమగ్రమైనటువంటి, ఏకీకరణ తో కూడినటువంటి ప్రణాళిక ను రచించి, ఆ ప్రాజెక్టుల అమలు కు దోహదం చేయాలనే ఉద్దేశ్యం తో ప్రవేశపెట్టడమైంది. మల్టి-మాడల్ కనెక్టివిటీ లో సమస్యల ను, అలాగే లాస్ట్ మైల్ కనెక్టివిటీ లో సమస్యల ను తీర్చాలి అన్నది దీని పరమావధి గా ఉంది. ఇది లాజిస్టిక్స్ వ్యయాన్ని కుదించడం లో సహాయకారి గా ఉంటుంది. దీని ద్వారా వినియోగదారుల కు, రైతుల కు, యువత కు, అలాగే వ్యాపారాల లో తల మునక లు అయిన వారికి కూడాను ఆర్థిక లాభాలు అనేకం గా దక్కుతాయి.

ఈ ఆమోదం తో, పిఎమ్ గతి శక్తి ఆరంభ ప్రక్రియ మరింత జోరు ను అందుకొంటుంది. ఫలితం గా దేశం లో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కి ఒక సమగ్రమైనటువంటి మరియు ఏకీకృత‌మైనటువంటి ప్రణాళికపూర్వక ఫ్రేమ్ వర్క్ సిద్ధం కాగలదు.

ఈ ఆమోదం తో, పిఎమ్ గతి శక్తి వేరు వేరు స్టేక్ హోల్డర్స్ ను ఒక చోటు కు తీసుకు వస్తుంది. రవాణా తాలూకు వివిధ మాధ్యమాల ను ఏకీకృతం చేయడం లో కూడా ఇది తోడ్పడుతుంది. మల్టి-మాడల్ కనెక్టివిటీ ని లక్షించిన పిఎమ్ గతి శక్తి-ఎన్ఎమ్ పి కేంద్రం లో సమగ్ర పరిపాలన కు పూచీ పడుతుంది. దీని కేంద్ర స్థానం లో భారతదేశ ప్రజానీకం, భారతదేశ పరిశ్రమ లు, భారతదేశ తయారీదారులతో పాటు భారతదేశం లోని రైతు లు ఉన్నారు.

 

***



(Release ID: 1765545) Visitor Counter : 240