ప్రధాన మంత్రి కార్యాలయం

ఎఐఐఎమ్ఎస్ న్యూ ఢిల్లీ లోని ఝజ్జర్ కేంపస్ లో నెలకొన్న నేశనల్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్‌ లో ఇన్ఫోసిస్ ఫౌండేశన్ విశ్రామ్ సదన్‌ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

ఈ సేవాకార్యానికి గాను ఎఐఐఎమ్ఎస్యాజమాన్యాని కి, సుధా మూర్తి జట్టు కు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాన మంత్రి

‘‘100 సంవత్సరాల లో తలెత్తిన అతి పెద్దమహమ్మారి ని ఎదుర్కోవడానికి ప్రస్తుతం దేశం దగ్గర 100 కోట్ల టీకా డోజుల తో కూడిన బలమైనరక్షణ కవచం ఉంది; ఈ కార్యసాధన భారతదేశాని ది, భారతదేశంలోని ప్రతి ఒక్క వ్యక్తిదీనూ’’ 

‘‘భారతదేశం లోని కార్పొరేట్ రంగం, ప్రయివేటు రంగం మరియు దేశం లోనిసామాజిక సంస్థ లు నిరంతరం దేశం లో ఆరోగ్య సంబంధి సేవల ను పటిష్ట పరచడం కోసం తోడ్పాటును అందిస్తూ వచ్చాయి’’

Posted On: 21 OCT 2021 11:49AM by PIB Hyderabad

ఎఐఐఎమ్ఎస్ న్యూ ఢిల్లీ లోని ఝజ్జర్ కేంపస్ లో గల నేశనల్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్‌ లో నిర్మించిన ఇన్ఫోసిస్ ఫౌండేశన్ విశ్రామ్ సదన్‌ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.

ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు న భారతదేశం 100 కోట్ల వ టీకా డోజు ను అధిగమించినందువల్ల ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు అని వ్యాఖ్యానించారు. 100 సంవత్సరాల కాలం లో తలెత్తిన అతి పెద్దదైన మహమ్మారి కి ఎదురొడ్డి నిలవడం కోసం ప్రస్తుతం దేశం దగ్గర 100 కోట్ల టీకా డోజు ల తాలూకు ఒక బలమైన రక్షా కవచం ఉందని ఆయన అన్నారు. ఈ కార్య సాధన తాలూకు ఖ్యాతి భారతదేశం తో పాటు భారతదేశం లోని పౌరులదని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

ప్రధాన మంత్రి దేశం లోని టీకా మందు తయారీ కంపెనీలన్నిటికి, టీకా మందు రవాణా లో పాలుపంచుకొన్న శ్రామికుల కు, టీకా మందు ను అభివృద్ధి పరచడం లో నిమగ్నం అయిన ఆరోగ్య రంగ వృత్తి నిపుణుల కు తన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

కేన్సర్ చికిత్స కోసం ఎఐఐఎమ్ఎస్ ఝజ్జర్ కు విచ్చేసే రోగుల కు ప్రస్తుతం ఒక గొప్ప సదుపాయం అందుబాటు లోకి వచ్చిందని ప్రధాన మంత్రి తెలిపారు. నేశనల్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్‌ లో నిర్మాణం జరిగిన ఈ విశ్రామ్ సదన్ రోగుల కు, వారి బంధువుల కు ఇక్కట్ల ను తగ్గిస్తుంది అని ఆయన అన్నారు.

ఈ విశ్రామ్ సదన్ ను నిర్మించినందుకు ఇన్ఫోసిస్ ఫౌండేశన్ ను, దీని కోసం భూమి ని, విద్యుత్తు ను, నీటి ని కూడా సమకూర్చిన ఎఐఐఎమ్ఎస్ ఝజ్జర్ ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఈ సేవ ను అందించినందుకు ఎఐఐఎమ్ఎస్ యాజమాన్యాని కి మరియు సుధా మూర్తి జట్టు కు ఆయన తన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

భారతదేశం లోని కార్పొరేట్ రంగం, ప్రైవేటు రంగం, ఇంకా సామాజిక సంస్థలు దేశం లో ఆరోగ్య సేవల ను పటిష్ట పరచడం కోసం వాటి వాటి తోడ్పాటుల ను అందిస్తూ వస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఆయుష్మాన్ భారత్-పిఎమ్ జెఎవై ను దీనికి ఒక ఘనమైన ఉదాహరణ గా ఆయన ప్రస్తావించారు.

ఒక రోగి కి ఎప్పుడైతే ఆయుష్మాన్ భారత్ పథకం లో భాగం గా చికిత్స ఉచితంగా అందుతుందో, అప్పుడు ఆ రోగి సేవ కు సంబంధించినటువంటి కార్యం పూర్తి అవుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సేవ భావం కారణం గానే ప్రభుత్వం దాదాపు గా 400 కేన్సర్ ఔషధాల ధరల ను తగ్గించడం కోసం చర్యలు తీసుకొందని ప్రధాన మంత్రి అన్నారు.(Release ID: 1765475) Visitor Counter : 50